ఎమోషనల్ సీన్స్, మురళి శర్మ నటన, సినిమాటోగ్రఫీఎమోషనల్ సీన్స్, మురళి శర్మ నటన, సినిమాటోగ్రఫీరొటీన్ కథ, కథనం, ఎడిటింగ్

ఓ మధ్యతరగతి కుటుంబాబికి చెందిన రాం (కళ్యాణ్ దేవ్) అతని తండ్రి శ్రీనివాస రావు (మురళి శర్మ) వారి జీవితాన్ని సాగిస్తుంటారు. కొడుకు కోరిందల్లా శ్రీనివాస్ రావు తెచ్చిపెడుతుంటాడు గ్రాడ్యుయేషన్ పూర్తయినా సరే ఉద్యోగం, బాధ్యత ఇలాంటివి ఉంటాయన్న ఆలోచన ఉండదు. కొడుకు మీద చాలా హోప్స్ పెట్టుకున్న శ్రీనివాస రావు నిరాశ పడతాడు. జాబ్ రావడం లేదని రాం ఓ బిజినెస్ చేస్తాడు అది కూడా దెబ్బేస్తుంది. ఇంతలో తండ్రి ఆరోగ్యం క్షీణిస్తుంది. అప్పుడే అతని ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుంటాడు కొడుకు. ఫైనల్ గా అతని మెప్పించేలా.. తండ్రితో పాటుగా తను ఎలా విజేత అయ్యాడు అన్నది సినిమా కథ.

కళ్యాణ్ దేవ్ నటన జస్ట్ ఓకే. మధ్యతరగతి కుర్రాడిగా కళ్యాణ్ దేవ్ చక్కగా కుదిరాడు. అయితే మొదటి సినిమా కాబట్టి నటనలో బెరుకు కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో ఇంకాస్త బాగా చేసి ఉండాల్సింది అనిపిస్తుంది. ఇక సినిమాలో మరో ముఖ్య పాత్ర చేసిన నటుడు మురళి శర్మ. సినిమా అంతా కళ్యాణ్ దేవ్ తో సమానమైన రోల్ ఇచ్చారు. ఇక తన నటనతో దానికి ప్రాణం పోశారు మురళి శర్మ. హీరోయిన్ మాళవిక నాయర్ బాగానే చేసింది. ఆమెకు మరికొన్ని సీన్స్ రాయాల్సింది. తణికెళ్ల భరణి, నాజర్ పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్తాయి. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతగా నవ్వించలేదు.

సినిమాటోగ్రాఫర్ సెంథిల్ చిన్న సినిమానే అయినా ఇందులో కూడా తన ప్రతిభ చూపించాడు. మ్యూజిక్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సాయి కొర్రపాటి తన బ్యానర్ వాల్యూకి తగినట్టుగా సినిమా తీశారు. దర్శకుడు రాకేష్ శషి కథ పాతదే అయినా కథనంలో కొన్ని ఎమోషన్స్ మాత్రమే కొత్తగా తీసి మిగతా అంతా రొటీన్ గా నడిపించాడు.  

విజేత.. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా.. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన కళ్యాణ్ దేవ్ కు ఆ టైటిల్ వాడారు. మంచి సెంటిమెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విజేత అని చెప్పొచ్చు. తండ్రి కొడుకుల మధ్య సన్నివేశాలు అలరిస్తాయి. కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తండ్రి.. అతని ఆశలు పట్టించుకోకుండా ఆవారాగా తిరిగే కొడుకు. ఈ ఇద్దరి ఆలోచనలను కలిపే వారి ఎమోషన్. ఇలా సినిమా అంతా తెలిసిన కథగా నడుస్తుంది.

అయితే దర్శకుడు రాకేష్ శషి కథనం కూడా చాలా ఫ్లాట్ గా రొటీన్ గా నడిపించాడు. ఏమాత్రం కొత్తదనం చూపించలేదు. అంతేకాదు సన్నివేశాలు అన్ని ఊహాజనితంగా ఉన్నాయని చెప్పొచ్చు. మెగా ఫ్యామిలీ హీరోగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ లా కాకుండా ఓ సింపుల్ స్టోరీతో కళ్యాణ్ ఎంట్రీ మాత్రం బాగుంది.

జతకలిసే తర్వాత రాకేష్ శషి చేసిన ఈ ప్రయత్నం ఏమాత్రం వర్క్ అవుట్ కాలేదు. కొన్ని ఎమోషనల్ సీన్స్, డైలాగ్స్ తప్ప ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. అయితే కథ, కథనాలకు కనెక్ట్ అయిన ఆడియెన్స్ మాత్రం సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు.
Kalyaan Dhev,Malavika Nair,Rakesh Sashii,Rajani Korrapati,Harshavardhan Rameshwarకళ్యాణ్ దేవ్ 'విజేత' కాలేకపోయాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: