రైతుల గురించి డైలాగ్స్, కార్తి నటన, ఫ్యామిలీ ఎమోషన్స్రైతుల గురించి డైలాగ్స్, కార్తి నటన, ఫ్యామిలీ ఎమోషన్స్నేటివిటీ ప్రాబ్లెం, భారీ సెంటిమెంట్ సీన్స్, స్క్రీన్ ప్లే

ఇద్దరు భార్యలున్న రుద్ర రాజు (సత్యరాజ్) ఐదుగురు కూతుళ్ల తర్వాత కృష్ణం రాజు (కార్తి) పుడతాడు. అందుకే ఆ కుటుంబంలో కృష్ణం రాజు అంటే విపరీతమైన ప్రేమ. పదవతరగతి వరకే చదివి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నకృష్ణం రాజు రైతులకు ఆదర్శంగా నిలుస్తాడు. ఇక తన ఇద్దరి మేనకోడళ్లలో ఒకరిని పెళ్లాడాల్సి ఉండగా కృష్ణం రాజు మాత్రం నీల నీరద (సయేషా సైగల్)ను ఇష్టపడతాడు. అది తెలుసుకున్న నీల నీరద బావ సురేందర్ రాజు (శత్రు) కులం ఓట్ల కోసం నీలని తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తాడు. కృష్ణం రాజు నీలని వారిని కాదని ఎలా దక్కించుకునాడు..? శత్రు పెట్టిన గొడవల వల్ల కృష్ణం రాజు కుటుంబానికి ఎలాంటి కష్టం వచ్చింది..? వాటిని అతని ఎలా సాల్వ్ చేశాడు అన్నది సినిమా కథ.

కార్తి రైతు పాత్రలో ఆకట్టుకున్నాడు. తన మార్క్ కామెడీ టైమింగ్ తో అలరించాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ లో కూడా తన మార్క్ చూపించాడు. సినిమాలో సత్య రాజ్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. కామెడీ, ఎమోషనల్ సీన్స్ లో ఆయన కూడా బాగానే చేశారు. హీరోయిన్ సయేషా సైగల్ చిన్న పాత్ర అని చెప్పొచ్చు. ఇక విలన్ గా శత్రు మంచి రోల్ చేశాడు. తెలుగులో చిన్న చితకా పాత్రలు చేసే అతను చినబాబులో మెయిన్ విలన్ గా మంచి ఛాన్స్ కొట్టేశాడు. ఇక మిగతా వారంతా తమిళ నటీనటులే కావడం విశేషం.

ఇమాన్ మ్యూజిక్ జస్ట్ ఓకే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్.. పంటపొలాలు ఈ సీన్స్ కంటికి ఇంపుగా అనిపించేలా తీశారు. కథ, కథనాల్లో దర్శకుడు కొత్తగా లేకున్నా ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమా నడిపించాడు. అయితే సెంటిమెంట్ డోస్ ఎక్కువైందని చెప్పొచ్చు. ఎడిటింగ్ ఓకే. సూర్య నిర్మాణ వలువలు బాగున్నాయి.  



హీరోని రైతుగా చూపించాలన్న ఆలోచన రావడం గొప్ప విషయం. కార్తి రైతు పాత్రలో ఆదర్శవంతంగా ఉంటూ ఊళ్లో రాజకీయాలతో పాటుగా ఫ్యామిలీలో ఎమోషన్స్ గురించి చెప్పే కథే ఈ చినబాబు. సినిమా అంతా సరదాగా  సాగుతున్నట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ సెంటిమెంట్ పాళ్లు ఎక్కువయ్యాయని చెప్పొచ్చు.

కార్తి కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్లస్ అవుతాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా నచ్చే అంశాలతో ఈ సినిమా వచ్చిదని చెప్పొచ్చు. సినిమా మొత్తం తమిళ నేటివిటీకి దగ్గరగా ఉంటుంది. కొన్ని చోట్ల అది మరి ఎక్కువయిందని అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ ఓకే.

విలన్ గా శత్రు పర్వాలేదు అయితే కేవలం ఫైట్స్ కోసమే విలన్ ను పెట్టారన్న భావన వస్తుంది. ఎడ్ల పందెం నాడు తళక్కున మెరిసిన సూర్య ఫ్యాన్స్ ను అలరించాడు. ఓ విధంగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసేలా ఈ సినిమా మంచి అనుభూతిని అందిస్తుందని చెప్పొచ్చు. అయితే యూత్ ఆడియెన్స్ వెరైటీ సినిమాలు కోరుకునే వాళ్లకు కాస్త కష్టమే.
Karthi,Sayyeshaa,Pandiraj,Suriya,D. Immanకార్తి 'చినబాబు'.. సెంటిమెంటు ఎక్కువైంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: