సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్రొటీన్ స్టోరీ, మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్, టైటిల్

బైక్ మెకానిక్ లో ప్రొఫెషన్ అయిన రాజ్ (రాజ్ తరుణ్) తల్లిదండ్రులను కోల్పోయిన నాటి నుండి అన్న రాజీవ్ కనకాల అతన్ని ఎంతో ప్రేమగా పెంచుతాడు. చిన్న ఇంజురీ వల్ల చరిత్ర (సిద్ధి కుమార్)ను మీట్ అవుతాడు రాజ్. ఆమెని చూసిన మొదటి క్షణమే ప్రేమలో పడతాడు రాజ్. అయితే అనుకోకుండా ఆమెకు ఓ సమస్య వచ్చి పడుతుంది. ఆమెను విలన్లు కిడ్నాప్ చేస్తారు. ఆమెను కాపాడేందుకు రాజ్ ప్రయత్నిస్తాడు. అసలు చరిత గతం ఏంటి..? ఆమెను ఎందుకు విలన్లు కిడ్నాప్ చేస్తారు..? రాజ్ ఎలా తన ప్రేయసిని ఆపద నుండి కాపాడాడు అన్నదే సినిమా కథ.

రాజ్ తరుణ్ ఎప్పటిలానే ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ చేశాడు. అయితే తన పాత్రలో ఎలాంటి డిఫరెన్స్ కనిపించదు. ఇదవరకు సినిమాల పాత్రల కొనసాగింపుగా అనిపిస్తుంది. సిద్ధి కుమార్ క్యూట్ గా స్క్రీన్ స్పేస్ ను బాగా వాడుకుంది. సినిమాకు ఆమె ప్లస్ పాయింట్. రాజీవ్ కనకాల ఎప్పటిలానే సింపతీ బ్రదర్ రోల్ ప్లే చేశాడు. సచిన్ కేద్కర్, అజయ్, సుబ్బరాజు విలన్స్ గా బాగానే చేశారు. ప్రవీన్, సత్యం రాజేష్, సత్య కామెడీ చేసినా అంతగా ఆకట్టుకోలేదు.

సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కేరళ ఎపిసోడ్స్ లో ఆయన కెమెరా వర్క్ ఏంటో తెలుస్తుంది. సినిమాలో ఒక్కో పాటకి ఒక్కో మ్యూజిక్ డైరక్టర్ చేశాడు. మ్యూజిక్ పరంగా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. కథ రొటీన్ గా అనిపిస్తుంది. అనీష్ కృష్ణ కథనం కొంతమేర లాక్కొచ్చినట్టు అనిపించినా రొటీన్ ఫ్లాట్ కథ మైనస్ అని చెప్పొచ్చు. ఎడిటింగ్ ఓకే. 

అలా ఎలా తర్వాత దిల్ రాజు బ్యానర్ లో సినిమా ఛాన్స్ పట్టేసిన అనీష్ కృష్ణ అందుకు తగిన సినిమా అందించడంలో విఫలమయ్యాడు. మూడు వరుస ఫ్లాపుల తర్వాత లవర్ అయినా తనకు హిట్ ఇస్తుందని ఆశించిన హీరో రాజ్ తరుణ్ రొటీన్ స్టోరీతోనే వచ్చాడని చెప్పొచ్చు. మొదటి భాగం అంతా హీరో, హీరోయిన్ ను ఇంప్రెస్ చేసే సన్నివేశాలతోనే నింపేయగా సెకండ్ హాఫ్ కాస్త కొత్తగా అనిపిస్తుంది.

అయితే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అందించడంలో దర్శకుడు సక్సెస్ అవలేదు. కామెడీ కూడా ఆకట్టుకోలేదు. రాజ్ తరుణ్ క్యారక్టరైజేషన్ విషయంలో కూడా కొత్తదనం చూపించలేదు. ముఖ్యంగా కథనం చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. సినిమా క్లైమాక్స్ కూడా అంత కిక్ ఇవ్వలేదు.

దిల్ రాజు ప్రొడక్షన్ లో తక్కువ బడ్జెట్ అని ప్రమోషన్స్ లో చెబుతున్నా సినిమా తెర మీద చాలా రిచ్ గా అనిపిస్తుంది. అయితే సరైన పోటీ ఇచ్చే బాక్సాఫీస్ ఫైట్ లేనందున ఈ సినిమా కాస్త ఆడియెన్స్ మెప్పు పొందే అవకాశం ఉంది.  
Raj Tarun,Riddhi Kumar,Annish Krishna,Harshith Reddy,Ankit Tiwariఈ 'లవర్'.. ఏమంత కిక్ ఇవ్వలేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: