సినిమాటోగ్రఫీ, కథలో ట్విస్టులు, మంచు లక్ష్మి పర్ఫార్మెన్స్ సినిమాటోగ్రఫీ, కథలో ట్విస్టులు, మంచు లక్ష్మి పర్ఫార్మెన్స్ స్క్రీన్ ప్లే, అక్కడక్కడ స్లో అవడం

దీక్ష (మంచు లక్ష్మి)ఓ స్వచ్చంద సంస్థలో ఉద్యోగం చేస్తుంటుంది. తన భర్త రామ్ (సామ్రాట్) మరణించాడని తెలుసుకుంటుంది. అయితే భర్తని ఎవరో చంపారని గుర్తించిన దీక్ష పోలీసుల సహకారం కోరుతుంది. అయితే వారు దీక్షకు సపోర్ట్ చేయరు. అందుకే తన తెలివితేటలతో ఆధారాలను సేకరించి తన భర్తని చంపేసింది ఎవరన్నది కనిపెడుతుంది. ఇంతకీ దీక్ష భర్తని చంపింది ఎవరు..? దీక్ష ఎలా అతన్ని కనిపెట్టింది..? అన్నది సినిమా కథ.

మంచు లక్ష్మి దీక్ష పాత్రలో బాగా నటించింది. సినిమా మొత్తం ఆమె భుజాన వేసుకుని నడిపించారని చెప్పొచ్చు. సామ్రాట్ చిన్న పాత్రే అయినా ఆకట్టుకున్నాడు. రాకీగా ఆదర్శ్ ఇంప్రెస్ చేశాడు. చారి పాత్రలో ప్రియదర్శి మంచి పాత్రలో కనిపించాడు.

రఘు దీక్షిత్ మ్యూజిక్ సినిమాలో పాటలు లేకున్నా సరే సస్పెన్స్ కు కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు. భాస్కర్ సామల సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. కథ, కథనాల్లో దర్శకుడు విజయ్ యలకంటి కొత్తగా ట్రై చేశాడు. ముఖ్యంగా సమాజంలో జరుగుతున్న లైంగిక దాడుల కథాంశం ఎన్నుకోవడం విశేషం. ఈ కథను థ్రిల్లర్ గా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గానే ఉన్నాయి.

వైఫ్ ఆఫ్ రామ్ సినిమా మర్డర్ మిస్టరీతో సాగుతుంది. సినిమా అంతా తన భర్తను ఎవరు చంపారో కనిపెట్టడమే. ఆరంభంలో సినిమాను ఆసక్తిగా తెరకెక్కించిన దర్శకుడు ఇంటర్వల్ లోనే దానికి కారణం ఎవరన్నది రివీల్ చేస్తాడు. ఇక సెకండ్ హాఫ్ ఏం చూపిస్తాడు అనుకోగా అతన్ని కనిపెట్టే విధానంలో దీక్ష హార్డ్ వర్క్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.   

ఫస్ట్ హాఫ్ అంతా సస్పెన్స్ మెయింటైన్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ గాడి తప్పినట్టు అనిపిస్తుంది. మళ్లీ క్లైమాక్స్ లో సినిమా ఆడియెన్స్ ను థ్రిల్ చేస్తుంది. సినిమా చూసిన ప్రతి వారు విద్యా బాలన్ కహాని సినిమాతో పోల్చుతారు. చాలా వరకు కథనం అలానే సాగుతుంది.

సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన వైఫ్ ఆఫ్ రామ్ రెగ్యులర్ సినిమా లవర్స్ కన్నా ఈ జానర్ సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్ కు నచ్చే అవకాశం ఉంది. 
Lakshmi Manchu,Aadarsh B Krishna,Vijay Yelakanti,Vivek Kuchibhotla,Raghu Dixitమంచు లక్ష్మి వైఫ్ ఆఫ్ రామ్.. మంచి ప్రయత్నమే కాని..!

మరింత సమాచారం తెలుసుకోండి: