పూజా హెగ్దె, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలుపూజా హెగ్దె, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలుస్క్రీన్ ప్లే, మ్యూజిక్, మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

సరదాగా జీవితాన్ని గడుపుతున్న వైభవ్ (బెల్లంకొండ శ్రీనివాస్) సౌందర్య లహరి (పూజా హెగ్దె)ని చూసి ఇష్టపడతాడు. ఆమెని ప్రేమలో పడేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటే ఆమె అనుకోకుండా దుబాయ్ నుండి ఇండియాకు వస్తుంది. ఆమె కోసం వైభవ్ కూడా ఇండియాకు వస్తాడు. అయితే ప్రకృతి ద్వారా వైభవ్ తన తల్లిదండ్రులను కిరాతకంగా చెపేసిన రౌడీలను గుర్తిస్తాడు. వారిని వైభవ్ ఎలా సంహరించాడు. అసలు ప్రకృతి అతనికి ఎలా వారిని గుర్తించేలా చేసింది అన్నది సినిమా కథ. 

బెల్లంకొండ శ్రీనివాస్ నటన పర్వాలేదు. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేశాడు. అయితే ఎమోషనల్ సీన్స్ లో ఇంకాస్త మెరుగుపడాల్సి ఉంది. పూజా హెగ్దె గ్లామర్ లుక్ లో మెరిసింది. సినిమాకు ఆమె ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. సినిమాలో ఆమె పాత్ర కూడా ప్రాముఖ్యత కూడుకున్నది. ఇక ఎవిల్ ట్రియోగా జగపతి బాబు, అశుతోష్ రాణా, రవి కిషన్ బాగానే చేశారు. శరత్ కుమార్, మీనాలు కూడా సహజ నటనతో ఆకట్టుకున్నారు. వెన్నెల కిశోర్ కామెడీ, కృష్ణ భగవాన్ అలరించారు.

ఆర్థర్ విల్సన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా లో కెమెరా వర్క్ చాలా బాగుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ పర్వాలేదు. సౌందర్యలహరి సాంగ్ లో లొకేషన్స్ బాగున్నాయి. సిజి వర్క్ ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది. విలన్స్ ను హీరోకి ప్రకృతి చూపించడం లైన్ కొత్తగా ఉన్నా గ్రాఫిక్స్ వర్క్ పేలవంగా ఉండటంతో సినిమా ట్రాక్ తప్పిందనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే రిచ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ ఓకే. 

కథ పాతదే అయినా కథనం కొత్తగా తెరకెక్కించాలని అనుకున్న దర్శకుడు శ్రీవాస్ తన తల్లిదండ్రులను చంపిన ఎవిల్ గ్యాంగ్ ను ప్రకృతి సహకారంతో కనిపెట్టడం కాస్త కొత్తగానే ఉంటుంది. అయితే అనుకున్న కాన్సెప్ట్ ను ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించడంలో మాత్రం విఫలమయ్యాడని చెప్పొచ్చు.

సినిమాలో పూజాని కేవలం గ్లామర్ కోసమే తీసుకున్నారని అర్ధమవుతుంది. ఇక రాంగ్ ప్లేస్ మెంట్ సాంగ్స్ సినిమాకు అడ్డుగా మారాయి. సినిమాటోగ్రఫీ ఫస్ట్ క్లాస్ గా ఉన్నా సినిమా కథ, కథనాల్లో అంత పట్టు లేకపోవడంతో సినిమా మళ్లీ బెల్లంకొండ బాబుకి నిరాశనే మిగిల్చిందనే అనాలి.

కామెడీ కూడా అంతత మాత్రమే.. ఎంచుకున్న కథ దానికి రాసుకున్న కథనం గ్రిప్పింగ్ లేకపోవడం.. చాలా చోట్ల అసలు లాజిక్ లేకుండా సీన్స్ రావడం ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. ఫైనల్ గా సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే అవకాశం ఉంది.  
Bellamkonda Sreenivas,Pooja Hegde,Sriwass,Abhishek Nama,Harshwardhan Rameshwarబెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం.. అంచనాలను అందుకోలేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: