త్రిషా, కామెడీ, కెమెరా వర్క్త్రిషా, కామెడీ, కెమెరా వర్క్రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, సిజి వర్క్

చెఫ్ గా తన స్పెషాలిటీ చూపించే వైష్ణవి (త్రిష) తన అసిస్టెన్స్ బల్కి (స్వామినాథన్), పంజు (యోగి బాబు)లతో కలిసి లండన్ వెళ్తుంది. అక్కడ సందీప్ (జాకీ బగ్నాని)తో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. ఓ యాక్సిడెంట్ లో వైష్ణవి మిస్ అవ్వగా ఆ తర్వాత ఆమెలో ఏదో మార్పు కనిపిస్తుంది. వైష్ణవిలో మోహిని చేరిందని తెలుస్తుంది. అసలు వైష్ణవిలో మోహిని ఎందుకు వచ్చింది..? మోహిని టార్గెట్ ఎవరు..? మోహిని ఎందుకు పగబట్టింది అన్నది సినిమా కథ.   

సౌత్ లో టాప్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న త్రిష స్టార్ అవకాశాలు సన్నగిల్లడంతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. ఇదవరకు నాయకి సినిమా చేసిన త్రిష ఇప్పుడు మోహినిగా వచ్చింది. సినిమాలో ఆమె రెండు పాత్రల్లో బాగా చేసింది. జాకీ బగ్నాని కూడా ఇంప్రెస్ చేశాడు. కమెడియన్స్ అలరించగా.. విలన్ గా ముఖేష్ తివారి ఆకట్టుకున్నాడు. లీడ్ పెయిర్స్ మధ్య కెమిస్ట్రీ అలరించింది.

ఆర్బి గురుదేవ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. వివేక్ మెర్విన్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. దర్శకుడు రమణ మదేష్ కథ, కథనాలు కొత్తగా అనిపించలేదు. కథ పర్వాలేదు అనిపించినా కథనం మరి రొటీన్ గా సాగించారని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.  

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న చైల్డ్ అబ్యూజ్ గురించి సినిమాలో ప్రస్థావించారు. సోషల్ మెసేజ్ తో కూడిన థ్రిల్లర్ మూవీగా మోహిని వచ్చింది. అయితే కథ, కథనాలు రెగ్యులర్ హర్రర్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు ఆ అనుభూతి కలిగించడంలో మాత్రం విఫలమైంది. 

మదేష్ నరేషన్ బాగానే రాసుకున్నా మధ్యలో అనవసరమైన కామెడీ ట్రాక్ తప్పిస్తుంది. అంతేకాదు హర్రర్ సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలు కనిపించినట్టు ఉండవు. క్లైమాక్స్ కూడా రొటీన్ గానే ఉంటుంది. సినిమాలో త్రిష అందం, అభినయం అలరించాయి. 

త్రిషని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్, యాక్షన్ ఆడియెన్స్ కు మాత్రం ఈ సినిమా నచ్చకపోవచ్చు. సోషల్ మెసేజ్ ను హర్రర్ జానర్ లో చెప్పిన ఈ మోహిని ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
Trisha,Jackky,Yogi Babu,R. Madhesh,S Lakshman Kumar,Vivek-Mervinత్రిష 'మోహిని' మెప్పించలేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: