నిహారిక, ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ నిహారిక, ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్, స్లో నరేషన్

ఆనంద్ (సుమంత్ అశ్విన్), అక్షర (నిహారిక) ఇద్దరు ప్రేమించుకుంటారు. వారికి ప్రేమకు పెద్దల అంగీకరాం లభిస్తుంది. ఇక వారికి పెళ్లిచేసేందుకు ఎంగేజ్మెంట్ చేస్తారు. ఈలోగా తను ఇదవరకు ఇష్టపడిన విజయ్ (రాజా)మళ్లీ అక్షర లైఫ్ లోకి వస్తాడు. అసలే ప్రతిది కన్ ఫ్యూజ్ అయ్యే అక్షర ఆనంద్ ను పెళ్లిచేసుకోవాలా వద్ద అన్న కన్ ఫ్యూజన్ లో ఉంటుంది. ఇంతకీ అక్షర అసలు సమస్య ఏంటి..? చివరకు అక్షర ఎవరిని పెళ్లాడింది..? ఆమె కన్ ఫ్యూజన్ ఎలా తొలగింది అన్నది సినిమా కథ. 

మెగా డాటర్ నిహారిక ఈ సినిమా మొత్తం తానే ఆక్యుపై చేసింది. తన నటనతో నిహారిక మంచి మార్కులు కొట్టేసింది. సుమంత్ అశ్విన్ కూడా సినిమాలో బాగా చేశాడు. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. సినిమా చాలా వరకు వారి మధ్యనే నడుస్తుంది. మురళి శర్మ, నరేష్ లు కూడా సహజ నటనతో ఆకట్టుకున్నారు. మిగతా వార్తలన్ని తమ తమ పాత్రలతో ఇంప్రెస్ చేశారు.

బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగా హెల్ప్ అయ్యింది. లీడ్ పెయిర్ ను చాలా అందంగా చూపించారు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు ఆకర్ష్ణణగా నిలిచింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో మ్యూజిక్ బాగుంది. నూతన దర్శకుడు లక్ష్మణ్ కార్య తను రాసుకున్న కథ, కథనాలను పర్ఫెక్ట్ గా ప్రెసెంట్ చేశాడు. దర్శకుడి ప్రతిభ మెచ్చుకోదగినదే అయితే సినిమా కథ పెద్ద గొప్పగా అనిపించదు డైలాగ్స్ భారీగా రాసుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.  


ప్రేమకథలను లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీనే చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో అది బాగానే వర్క్ అవుట్ అయ్యింది. సుమంత్, నిహారికల మధ్య సీన్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. నిహారిక తన నటనతో ఆకట్టుకుంది. మొదటి భాగం అంతా సరదాగా సాగగా సెకండ్ హాఫ్ ఎమోషనల్ డ్రామా అయ్యింది. డైలాగ్స్ బాగా రాశారు. అయితే అక్కడక్కడ లెంగ్తీ డైలాగ్స్ కాస్త ఇబ్బంది పెడతాయి.

కథ, కథనాల్లో దర్శకుడు కొత్తదనం చూపించకున్నా తన ప్రతిభ చాటుకున్నాడు. ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సీరీస్ తీసిన లక్ష్మణ్ కార్య హ్యాపీ వెడ్డింగ్ ప్రేక్షకులు మెప్పు పొందేలా చేశాడని చెప్పొచ్చు. సినిమాలో ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీగా ఈ సినిమా అనుకున్నంతలో సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు.

యూత్ ఆడియెన్స్ ఇంప్రెస్ చేసే అంశాలే కాదు ఫ్యామిలీ మొత్తం చూసే చక్కని కుటుంబ కథా చిత్రంగా హ్యాపీ వెడ్డింగ్ వచ్చింది. అయితే స్క్రీన్ ప్లే ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేదని అనిపిస్తుంది. ఫైనల్ గా నిహారిక సెకండ్ ప్రాజెక్ట్ ఆమెకు మంచి పేరు తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు.


Sumanth Ashwin,Niharika Konidela,Lakshman Karya,M. Sumanth Raju,Shakthikanth Karthickనిహారిక 'హ్యాపీ వెడ్డింగ్'.. కాస్త అటు ఇటుగా ఉన్నా మెప్పించింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: