Star cast: GayatriAnilL.B.Sriram
Producer: Yakkali Ravindra BabuDirector: Sunil Kumar Reddy

తెలుగు రివ్యూ: వెయిటింగ్ ఫర్ యు - సారి ఐ యాం నాట్ కమింగ్

వెయిటింగ్ ఫర్ యు రివ్యూ: చిత్రకథ 
నిజానికి కథ అర్ధం కాకపోయినా దర్శకుడి పాయింట్ అఫ్ వ్యూ లో ఇలా ఉండవచ్చేమో అని రాస్తున్నా "కిమ్స్ హాస్పిటల్ లో అంబులెన్స్ టీం లో పని చేసే దేవా(రవి) మరియు స్వప్న ( గాయత్రి) ల జీవితాలలో జరిగే సంఘటనల సమూహారం ఈ చిత్రం. అది శేషు మరియు పరమేశు మధ్యన ఉన్న ఫ్యాక్షన్ గొడవల కారణంగా పరమేశు జరిపిన బాంబు దాడిలో అది సేశుతో పాటు స్వప్న తండ్రి గాయపడి మరణిస్తాడు. ఆ సమయంలో స్వప్న రవి ల పరిచయం జరుగుతుంది మెల్లగా అది ప్రేమగా మారి స్వప్న గర్భవతి అయ్యేదాక వెళ్తుంది. పెళ్లి చేసుకోవాలనుకునే సమయం లో అందరికి సహాయం చేసే దేవా, అది శేషు మనుషుల నుండి నరసింహులు (షఫీ) ని కాపాడబోయి గాయపడతాడు. ఈ విషయం తెలిసిన స్వప్న దేవకీ ఒక షరతు పెట్టడం దానికి దేవా ఒప్పుకోకపోవడంతో విడిపోతారు. షఫీ ని కాపాడినందుకు గాను అది శేషు దేవా మీద పగ పెంచుకొని చంపాలని వెతుకుతుంటారు ఇలా కొద్ది రోజులు గడిచాక కామా రత్నం(రఘు బాబు ) ధర్నా నిర్వహిస్తున్న రోజు స్వప్న, దేవా కోసం తొమ్మిది నెలల గర్భవతిగా తిరిగి వస్తుంది అదే సమయంలో అది శేషు, దేవా మీద హత్య ప్రయత్నం చేస్తారు. దేవా బతికాడా లేదా స్వప్నను కలిసాడా లేదా అసలు స్వప్న పెట్టిన షరతు ఏంటి అన్న అనుమానాలు ఏమయినా ఉంటె సినిమాలో చుడండి.."

వెయిటింగ్ ఫర్ యు రివ్యూ: నటీనటుల ప్రతిభ
ముందు మంచి మాట్లాడుకుందాం..... ఎల్ బి శ్రీరాం ఈ సినిమాలో అతి పెద్ద మంచి అంశం ఈయనే. ఈయన ఉన్నంతసేపు డైలాగ్స్ చాలా బాగుండటమే కాకుండా అయన నటన కూడా అయన చెప్పిన విషయాలను ఆలోచింపజేస్తుంది. అంతే, ఇంక ఎవరి గురించి చెప్పుకోవాలన్నా ఏదో నటించాం అన్నట్టే చేశారు. పెళ్ళికాని అమ్మాయి స్వప్న గా కనిపించిన గాయత్రీ పరవాలేదనిపించింది. రవి పరవాలేదనే అనిపించాడు విలన్ గా షఫీ తనదయిన శైలిలో ఆకట్టుకోగా మిగిలిన వాళ్ళందరు కూడా "పరవలేధనిపించారు".

వెయిటింగ్ ఫర్ యు రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

రొమాంటిక్ క్రైమ్ కథ చిత్రాన్ని నడిపిన విధానాన్ని పక్కన పెడితే అందులో ఎంచుకున్న అంశం సున్నితమయినది యువత భావోద్వేగాలకు దగ్గరగా ఉంది మరి ఈ చిత్రానికి వచ్చే సరికి దర్శకుడికి ఫ్యాక్షన్ తీయాలా, రొమాంటిక్ తీయాలా, మెసేజ్ పెట్టాలా అన్న కన్ఫ్యుసన్ లో అన్ని కలిపి తీసేసాడు. దర్శకుడిగా సునీల్ కుమార్ రెడ్డి 100% ఫెయిల్, బలహీనమయిన కథలో అందరు "పరవలేధనిపిస్తే " కథ ఇంకా బలహీన పడటం అతిశయోక్తి కాదు. కథనం విషయానికి వస్తే చివరి వరకు సంబంధం లేని నాలుగు సబ్ ప్లాట్స్ ని చివర్లో లింక్ చేసేసి స్క్రీన్ ప్లే అనిపించేసుకున్నారు. ఎల్ బి శ్రీరాం చెప్పిన డైలాగ్స్ మరియు "అక్కడక్కడా" వచ్చే కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ "పరవాలేదు", సంగీతం బాగుంది కాని చిత్రానికి ఎటువంటి తోడ్పాటుని ఇవ్వలేకపోయింది. చిత్రం చిన్నది కావడంతో నచ్చినా నచ్చకపోయినా ఎడిటర్ సన్నివేశాలను కత్తిరించకుండా అలానే ఉంచెసినట్టు తెలుస్తుంది.


వెయిటింగ్ ఫర్ యు రివ్యూ: హైలెట్స్
  • LB శ్రీరామ్
వెయిటింగ్ ఫర్ యు రివ్యూ: డ్రా బాక్స్
  • మిగిలినవి అన్నీ

వెయిటింగ్ ఫర్ యు రివ్యూ: విశ్లేషణ

రాష్ట్ర విభజన కారణంగా పెద్ద హీరోల చిత్రాలు విడుదల అవ్వడం ఆలస్యం అవుతుండటంతో గత కొన్ని వారాలుగా చిన్న చిత్రాలు థియేటర్ ల వద్ద సందడి చేస్తున్నాయి. అందులో కొన్ని బాగుండగా కొన్ని మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. అలాంటి ఒక దారుణం ఈరోజు విడుదలయ్యింది. పోస్టర్ చూడగానే ఇదేదో సున్నితమయిన అంశాన్ని చర్చించి ఉంటాడు అనుకుని వెళ్ళిన సదరు ప్రేక్షకుడు బుర్ర గోక్కునేలా ఇంకా చెప్పాలంటే తల బాదుకునేలా ఒక అనుభవాన్ని ఎదుర్కొనడం ఖాయం. ఇదే దర్శకుడు తెరకెక్కించిన ఒక రొమాంటిక్ క్రైమ్ కథ చిత్రం ఎలా ఉన్న అందులో చర్చించిన అంశం మాత్రం కాస్త సున్నితమయినదే కాని ఈ చిత్రంలో అది కూడా ఇవ్వకుండా కథను ఉప్మా చేసి మన ముందు పెట్టాడు. కథ క్లైమాక్స్ కి వచ్చేవరకు కూడా కథలో కీలక పాత్ర ఎవరో తెలియకుండా ఉండటం ఏంటో? ఎక్కడో మొదలు పెట్టిన కథకు అసలా ఆ కథకి సంబంధం లేని పాత్రలతో సనివేశాలను నింపేసి చివర్లో చిన్న లింక్ పెట్టేసి కథ పూర్తి చేసుకున్నాం అనిపించుకోవడం ఏంటో, చిత్రంలో చాలా సన్నివేశాలు హాస్పిటల్ మరియు అంబులెన్స్ లోనే జరగడం ఆ వాతావరణం సగటు ప్రేక్షకుడికి సినిమా చూడటానికి వచ్చాం అన్న ఫీలింగ్ కన్నా జబ్బు చేసి హాస్పిటల్ కి వచ్చాం అన్న ఫీలింగ్ రప్పిస్తుంది. దర్శకుడిగా సునీల్ కుమార్ రెడ్డి ఏమి చెప్పాలనుకున్నాడో ఆయనకయినా తెలుసా అనిపిస్తుంది పెళ్లి కాని ఒక అమ్మాయి ప్రేమ కథలో మత గొడవలతో మొదలై ఫ్యాక్షనిజం , టెర్రరిజం మరియు రాజకీయం రావడం ఒక ఎత్తయితే వీటికి ఆ అమ్మాయి కథకి చివరి వరకు సంబంధం లేకపోవడం అసలు చిరాకు పెట్టె అంశం. నాలుగు వేరు వేరు కథలు రాసుకొని విడి విడిగా డెవలప్ చెయ్యలేక అన్ని కలిపేసి పులిహోర చేసినట్టు ఉంటుంది. మధ్య మధ్యలో క్లాసు పీకడం ఏంటో దర్శకుడికే తెలియాలి... అంబులెన్స్ కి దారివ్వండి అని చెప్పడానికి రెండు గంటల సినిమా ఎందుకు డైరెక్టర్ గారు? అని గట్టిగా అరవాలనిపిస్తుంది, కింగ్స్ హాస్పిటల్ పబ్లిసిటీ కి సినిమా తీయాలా మేష్టారు? ఒక రొమాంటిక్ క్రైమ్ కథ చూసి ఇంతకన్నా చెత్తగా తీయలేరేమో అనుకున్న ఈ దర్శకుడు తన రికార్డు ని తనే బద్దలు కొట్టుకొని నేను తప్పని నిరూపించాడు.ఒక్కోసారి ఈ దర్శకుడేనా "సొంత ఊరు" "గంగపుత్రులు" చిత్రాలను తీసింది అని అనుమానం వచ్చేస్తుంది. మరి ఇలాంటి చిత్రాలే హిట్ అవుతుంది అనుకున్నాడేమో కాని గత రెండు చిత్రాలలో అయన దర్శకత్వం దారుణం. మనకి రానివి ప్రయత్నిస్తే పలితం ఇలానే ఉంటుంది అని ఇకనయినా గ్రహించి తన శైలిలో కి తిరిగి చిత్రాలు చేస్తే చూడాలని ఉంది. అయన గత చిత్రాల మీద నమ్మకంతో ఈ చిత్రం బాగుంటుంది వెళ్తే....అదన్నమాట.... ఇక వెళ్ళడం వెళ్లకపోవడం మీ ఇష్టం నన్నుఅడగకండి......


వెయిటింగ్ ఫర్ యు రివ్యూ: చివరగా
వెయిటింగ్ ఫర్ యు : సారి ఐ యాం నాట్ కమింగ్
 

Review board: Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Waiting For You | Waiting For You Wallpapers | Waiting For You Videos

మరింత సమాచారం తెలుసుకోండి: