అడివి శేష్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లేఅడివి శేష్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లేహీరోయిన్, సాంగ్స్

రా ఏజెంట్  అయిన రఘువీర్ (రవి ప్రకాశ్) సిక్కింలో జరిగిన ఆపరేషన్ లో ప్రాణాలు కోల్పోతాడు. రఘువీర్ కొడుకు గోపి (అడివి శేష్)ను అతని స్నేహితుడు సత్య పెంచి పెద్ద చేస్తాడు. అతనికి ప్రాణ హాని ఉందని తెలిసి సత్య గోపిని అర్జున్ పేరుతో పెంచుతాడు. తండ్రిలానే రా ఏజెంట్ గా పనిచేయాలనుకున్న అర్జున్ త్రినేత్ర స్పెషల్ టీంకు సెలెక్ట్ అవుతాడు. అర్జున్ అపాయింట్ అయిన రోజే త్రినేత్ర టీం పై ఎటాక్ చేస్తారు కొందరు. త్రినేత్ర లీడ్ తో పాటుగా కొందరిని చంపేస్తారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్.. టీం ను ఎటాక్ చేసిన తుపాకి, బైక్ మీద అర్జున్ వేలిముద్రలు ఉంటాయి. అతన్ని దోషిగా భావించిన టెర్రరిస్టులకు కోవర్ట్ గా మారాడని భావిస్తారు. ఎవరికి దొరకకుండా పారిపోయిన అర్జున్ ఈ మిస్టరీని ఎలా ఛేధించాడన్నది సినిమా కథ.

తెలుగు సినిమాల్లో గూఢచారి అంటే సూపర్ స్టార్ కృష్ణనే గుర్తొచ్చే వారు. అయితే అడివి శేష్ డేరింగ్ డెశిషన్ తో అద్భుతమైన కథతో వచ్చాడని చెప్పొచ్చు. సినిమాలో అతని పాత్ర అద్భుతంగా ఉంటుంది. హీరోయిన్ శోభిత లుక్స్ ఇంప్రెసివ్.. ఆమె పాత్ర అలరించింది. ఇక జగపతి బాబు విలనిజం సర్ ప్రైజ్ చేస్తుంది. సుప్రియ చాలా రోజుల తర్వాత స్క్రీన్ పై మెరిసింది. ప్రకాశ్ రాజ్ సహజ నటనతో ఆకట్టుకున్నారు. వెన్నెల కిశోర్, అనీష్ కురివిల్లా, మధుశాలిని అలరించారు.

శానెల్ డియో సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమా కోసం చాలా కష్టపడ్డారని తెర మీద కబడుతుంది. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ కూడా అలరించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు సపోర్ట్ గా నిలిచింది. అబ్బూరి రవి మాటలు బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. కథ, కథనం అడివి శేష్ అధుతంగా రాసుకున్నాడు. దర్శకుడు శషి కిరణ్ సినిమా గ్రిప్పింగ్ తో తెరకెక్కించాడు. 

జేంస్ బాండ్ సినిమాలంటే హాలీవుడ్ వైపు చూసే ప్రేక్షకులకు కచ్చితంగా అడివి శేష్ గూఢచారి మెప్పిస్తుంది. హాలీవుడ్ సినిమా స్టాండర్డ్స్ తో ఈ సినిమా వచ్చిందని చెప్పొచ్చు. సినిమా కథ, కథనాలు పర్ఫెక్ట్ గ్రిప్ తో రాసుకున్నారు. పేపర్ మీదే కాదు సీన్ మీద ప్రతి సీన్ ఉత్కంటతగా సాగుతుంది.

ముఖ్యంగా హీరో పర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ లు ఎన్నొచ్చినా గూఢచారి కొత్త ప్రయత్నమని చెప్పొచ్చు. అయితే ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ సీన్స్ కాస్త ఇబ్బంది పెడతాయి. సినిమా సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బలాలు. ఇలాంటి క్రేజీ అటెంప్ట్ చేసినందుకు తప్పకుండా అడివి శేష్ ను మెచ్చుకోవాలి.

డిఫరెంట్ సినిమాలు చూసే ఆడియెన్స్ కు ఈ సినిమా నచ్చుతుంది. ఫ్యామిలీ, మాస్ ఆడియెన్స్ కాస్త నిరుత్సాహ పడొచ్చు. వారికి కనెక్ట్ అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయినట్టే.
Adivi Sesh,Sobhita Dhulipala,Sashi Kiran Tikka,Abhishek Pictures,Sricharan Pakalaగూఢచారి.. తెలుగు జేమ్స్ బాండ్ సినిమా..!

మరింత సమాచారం తెలుసుకోండి: