లీడ్ పెయిర్, స్క్రీన్ ప్లే, క్లవర్ డైరక్షన్లీడ్ పెయిర్, స్క్రీన్ ప్లే, క్లవర్ డైరక్షన్అక్కడక్కడ స్లో అవడం
లవ్ ఫెయిల్యూర్ అయిన అర్జున్ (సుశాంత్) పెళ్లంటే అంత ఇంట్రెస్ట్ చూపించడు. పెళ్లికి మరో ఐదేళ్లు టైం కావాలన్న అర్జున్ తల్లి అను హాసన్ ఎలాగోలా పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తుంది. అంజలి (రుహాని శర్మ)ని చూసేందుకు వచ్చిన అర్జున్ ఆమె మొహం మీదే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతాడు. అంజలి స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి.. తన మదర్ రోహిణి వల్ల ఆమె కూడా ఈ పెళ్లిచూపులకు ఒప్పుకుంటుంది. అయితే ఇద్దరికి ఇద్దరు నచ్చని ఆ టైంలో ఓ చిన్న ట్విస్ట్ ఫైనల్ గా ఇద్దరిని మార్చేస్తుంది. ఇంతకీ ఏంటా ట్విస్ట్..? అర్జున్, అంజలిల పెళ్లిచూపులు ఏమయ్యాయి అన్నదే సినిమా కథ.

తన పదేళ్ల సిని కెరియర్ లో సుశాంత్ ఈ సినిమాలో చాలా సెటిల్డ్ గా చేశాడని చెప్పొచ్చు. ఇలాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలకి సుశాంత్ పర్ఫెక్ట్ అనిపించేలా చేశాడు. ఇక హీరోయిన్ రుహాని శర్మ పాత్ర ఆకట్టుకుంది. హీరోయిన్ గా ఆమె ముందు ఇంప్రెస్ చేయకున్నా సినిమా నడుస్తున్నా కొద్ది ఆమె అందంగా కనిపిస్తుంది. అను హాసన్, రోణిహి ఇద్దరు బాగా చేశారు. స్నేహితుడి పాత్రలో వెన్నెల కిశోర్ ఆకట్టుకున్నాడు.

ఎన్. సుకుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమా ఫీల్ ఎక్కడ మిస్ అవకుండా చేశారు. ఇక ప్రశాంత్ విహారి మ్యూజిక్ బాగుంది. సినిమా నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. కథ, కథనాల్లో దర్శకుడు రాహుల్ రవింద్రన్ తన టాలెంట్ చూపించాడు. కథ కొత్తది కాకున్నా కథనం చాలా క్లవర్ గా నడిపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

పెళ్లంటే ఇష్టం లేని కుర్రాడు.. పెళ్లిచూపుల్లో ఒకరంటే ఒకరు ఇష్టం లేకుండా ఒక 8 గంటల వ్యవధిలో ఒకరిని ఒకరిని ఇష్టపడటమే ఈ సినిమా కాన్సెప్ట్. ఇద్దరిది చెరో దారి అయినా వారి మనసులకు ముడి వేసిన దర్శకుడి ఆలోచన మెచ్చుకోదగినది. సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అవుతారు.

మొదటి భాగం కాస్త స్లోగా అనిపించినా సెకండ్ హాఫ్ కాస్త ఎమోషనల్ గా వర్క్ అవుట్ చేశాడు. లవ్, ఎమోషన్,ఫన్ ఇలా ఈ మూడు అంశాలలో చిలసౌ సక్సెస్ అయ్యింది. సినిమా చూస్తున్నంత సేపు ఓ ఫీల్ గుడ్ మూవీ చూస్తున్న అనుభూతి ఉంటుంది. సినిమాలో లీడ్ పెయిర్ నటన ఆకట్టుకుంది.

సుశాంత్ లో ఇంత నటుడు ఉన్నాడా అనిపిస్తుంది. రుహాని శర్మ ఇచ్చిన రోల్ కు న్యాయం చేసింది. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా క్లైమాక్స్ లో అంశాలు మరింత మెప్పిస్తాయి. డైలాగ్స్ కూడా ప్రసలు వాడకుండా సహజంగా మనసుని తాకేలా రాసుకున్నాడు. మొత్తానికి సుశాంత్ చిలసౌ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చి అంచనాలను అందుకుంది.
Sushanth,Ruhani Sharma,Rahul Ravindran,Jaswanth Nadipalli,Nagarjuna Akkineni,Prashanth R Vihariచిలసౌ.. సుశాంత్ మ్యాజిక్ వర్క్ అవుట్ అయ్యింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: