లీడ్ పెయిర్, మ్యూజిక్, స్టార్ కాస్ట్లీడ్ పెయిర్, మ్యూజిక్, స్టార్ కాస్ట్స్లో స్క్రెన్ ప్లే, సాంగ్ ప్లేస్ మెంట్

శ్రీనివాస్ (నితిన్) చండిఘర్ లో ఆర్కిటెక్ గా పనిచేస్తుంటాడు. ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆర్కే (ప్రకాశ్ రాజ్) ప్రతిది కమర్షియల్ గా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆర్కే కూతురు శ్రీదేవి (రాశి ఖన్నా) శ్రీనివాస్ తో పరిచయం అతను ఫ్యామిలీ రిలేషన్స్ చూసి అతన్ని ఇష్టపడుతుంది. ఇక పెళ్లి మీద ఓ అభిరుచితో పాటుగా నానమ్మ చెప్పిన వేడుకగా పెళ్లి చేసుకోవాలని కలలు కనే శ్రీనివాస్ కు శ్రీదేవి తండ్రి ఎలాంటి టాస్క్ పెట్టాడు. ఆర్కే ని ఒప్పించి శ్రీనివాస్ ఎలా ఏడురోజుల పెళ్లి చేసుకున్నాడు అన్నది సినిమా కథ.  

లవర్ బోయ్ నితిన్ తన కెరియర్ లో ఇప్పటివరకు ఇంత బరువైన పాత్ర చేయలేదు. నితిన్ పాత్ర వరకు బాగా చేశాడు. రాశి ఖన్నా కూడా శ్రీదేవిగా ఇంప్రెస్ చేసింది. ప్రకాశ్ రాజ్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. రాజేంద్ర ప్రసాద్, జయసుధ, నరేష్ మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. పెళ్లి వేడుకను నిజంగానే పండుగలా చూపించారు. కెమెరా వర్క్ నీట్ గా అందంగా అనిపించింది. మిక్కి జే మేయర్ మ్యూజిక్ పర్వాలేదు. కళ్యాణం సాంగ్ తప్ప మిగతా పాటలు మాములుగా అనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. కథ, కథనాలు సతీష్ మరోసారి ఫ్యామిలీ ఎమోషన్స్ పండించే ప్రయత్నం చేశారు. అయితే కేవలం పెళ్లి అనే ఒక్క దాని మీదే కథ మొత్తం నడవడం వల్ల సెకండ్ హాఫ్ స్లో అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ దిల్ రాజు బ్రాండ్ తెలిసేలా చేశాయి.

శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న సతీష్ వేగేశ్న మరోసారి అలాంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే శ్రీనివాస కళ్యాణం సినిమా తెరకెక్కించాడు. కథ మొత్తం పెళ్లి దాని ప్రాముఖ్యత గురించి చెప్పడమే. అందులో సతీష్ డైలాగ్స్ బాగా రాసుకున్నారు. సినిమా మొదటి భాగం అంతా సరదాగా సాగిందని చెప్పొచ్చు. అయితే సెకండ్ హాఫ్ కాస్త సెంటిమెంట్ ఎక్కువైంది.

అక్కడక్కడ ల్యాగ్ అవడం కూడా నెగటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. సాంగ్స్ ఓకే కాని అంతగా ఇంప్రెస్ చేయలేదు. ఇంటర్వల్, క్లైమాక్స్ ఇవి రెండు సినిమాకు ప్రధాన బలం. నితిన్, రాశి ఖన్నాల పెయిర్ బాగుంది. కథ, కథనాల్లో దర్శకుడు సెంటిమెంట్ డోస్ పెంచాడని చెప్పొచ్చు. 

యూత్ ఆడియెన్స్ కాస్త అసహనం కలిగించేలా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం ఈ సినిమా తప్పకుండా అంజాయ్ చేస్తారు. మాస్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది నచ్చే అవకాశం లేదు. ఓవరాల్ గా దిల్ రాజు చెప్పినంత లేకున్నా సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు.
Nithiin,Raashi Khanna,Vegesna Satish,Dil Raju,Shirish,Mickey J Meyerశ్రీనివాస కళ్యాణం.. ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్..!

మరింత సమాచారం తెలుసుకోండి: