కమల్ హాసన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్కమల్ హాసన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ఫస్ట్ హాఫ్, స్క్రీన్ ప్లే, నరేషన్

విశ్వరూపం కథ ఎక్కడ ముగిసిందో అక్కడ నుండి ఈ సినిమా మొదలవుతుంది. ఇండియాని ఉగ్రవాదుల నుండి కాపాడే రా ఏజెంట్ గా విసాం (కమల్ హాసన్) ఒమర్ (రాహుల్ బోస్)తో కలిసి ఉగ్రవాద చర్యలు చేస్తుంటాడు. అలా వారితో ఉంటూనే వారి సమాచారం మొత్తం విసాం పై అధికారికి చేరవేస్తాడు. ఈ క్రమంలోనే వారు ఓ పెద్ద టాస్కులు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కుని విసాం ఎలా నిలబడ్డాడు. విసాం ఓమర్ ను ఎలా మట్టుపెట్టాడు అన్నది సినిమా కథ.

కమల్ హాసన్ నటుడిగా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి ఉండదు. తన వరకు నటనతో ఆకట్టుకున్నాడు. పూజా కుమార్, ఆండ్రియాలు అలరించారు. రాహుల్ బోస్ కూడా విలన్ పాత్రలో ఇంప్రెస్ చేశాడు. శేఖర్ కపూర్ ఓకే అనేలా చేశాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సను జాన్ వర్గీస్, శాందాత్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్ పరంగా కాస్త ఊరట కలిగించే ప్రయత్నం చేశారు. ఇక జిబ్రాన్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. కథ, కథనాల్లో కమల్ ఏమాత్రం ప్రతిభ కనబరచలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం రిచ్ గా ఉన్నాయి.

విశ్వరూపం మొదటి భాగం గుర్తు చేస్తూ సీన్స్ తో ఈ సినిమా మొదలవుతుంది. ఇక సినిమాకు అనుకున్న కథను ఎక్కడ కథనంలో మెప్పించలేదు కమల్. అనవసరమైన సాగదీతగా అనిపిస్తుంది. సినిమాలో కొంత ఎమోషనల్ డ్రామా చేయడం కాస్త అసంతృప్తిగా ఉంటుంది. టెక్నికల్ గా సినిమా బాగున్నా ఏమాత్రం ఆకట్టుకునే కథ, కథనాలు ప్రేక్షకులను విసిగిస్తాయి.

కమల్ ఇదవరకు సినిమాల్లో ఏదో ఒక మేజిక్ వర్క్ అవుట్ అయ్యేది. కాని ఈ సినిమాలో అది మిస్ అయ్యింది. సినిమాలో మొదటి భాగం మొత్తం ల్యాగ్ అయినట్టు అనిపించగా సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. సినిమాలో కమల్ యాక్షన్ సీన్స్ మాత్రం అభినందించేలా ఉంటాయి. 

డైరక్షన్ పూర్ గా అనిపిస్తుంది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఓ స్పై థ్రిల్లర్ కథ ఊహించలేం అలానే విశ్వరూపం-2 కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు.
Kamal Haasan,Pooja Kumar,Andrea Jeremiah,S Chandrahasan,Ghibranవిశ్వరూపం-2.. అంచనాలను అందుకోలేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: