Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 20, 2019 | Last Updated 3:01 am IST

Menu &Sections

Search

రివ్యూ : విశ్వరూపం 2

- 1.75/5
రివ్యూ : విశ్వరూపం 2 READ THIS MOVIE REVIEW IN ENGLISH

మంచి

  • కమల్ హాసన్
  • సినిమాటోగ్రఫీ
  • ప్రొడక్షన్ వాల్యూస్

చెడు

  • ఫస్ట్ హాఫ్
  • స్క్రీన్ ప్లే
  • నరేషన్
ఒక్క మాటలో: విశ్వరూపం-2.. అంచనాలను అందుకోలేదు..!

చిత్ర కథ

విశ్వరూపం కథ ఎక్కడ ముగిసిందో అక్కడ నుండి ఈ సినిమా మొదలవుతుంది. ఇండియాని ఉగ్రవాదుల నుండి కాపాడే రా ఏజెంట్ గా విసాం (కమల్ హాసన్) ఒమర్ (రాహుల్ బోస్)తో కలిసి ఉగ్రవాద చర్యలు చేస్తుంటాడు. అలా వారితో ఉంటూనే వారి సమాచారం మొత్తం విసాం పై అధికారికి చేరవేస్తాడు. ఈ క్రమంలోనే వారు ఓ పెద్ద టాస్కులు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కుని విసాం ఎలా నిలబడ్డాడు. విసాం ఓమర్ ను ఎలా మట్టుపెట్టాడు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ

కమల్ హాసన్ నటుడిగా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి ఉండదు. తన వరకు నటనతో ఆకట్టుకున్నాడు. పూజా కుమార్, ఆండ్రియాలు అలరించారు. రాహుల్ బోస్ కూడా విలన్ పాత్రలో ఇంప్రెస్ చేశాడు. శేఖర్ కపూర్ ఓకే అనేలా చేశాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు

సను జాన్ వర్గీస్, శాందాత్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్ పరంగా కాస్త ఊరట కలిగించే ప్రయత్నం చేశారు. ఇక జిబ్రాన్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. కథ, కథనాల్లో కమల్ ఏమాత్రం ప్రతిభ కనబరచలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం రిచ్ గా ఉన్నాయి.

చిత్ర విశ్లేషణ

విశ్వరూపం మొదటి భాగం గుర్తు చేస్తూ సీన్స్ తో ఈ సినిమా మొదలవుతుంది. ఇక సినిమాకు అనుకున్న కథను ఎక్కడ కథనంలో మెప్పించలేదు కమల్. అనవసరమైన సాగదీతగా అనిపిస్తుంది. సినిమాలో కొంత ఎమోషనల్ డ్రామా చేయడం కాస్త అసంతృప్తిగా ఉంటుంది. టెక్నికల్ గా సినిమా బాగున్నా ఏమాత్రం ఆకట్టుకునే కథ, కథనాలు ప్రేక్షకులను విసిగిస్తాయి.

కమల్ ఇదవరకు సినిమాల్లో ఏదో ఒక మేజిక్ వర్క్ అవుట్ అయ్యేది. కాని ఈ సినిమాలో అది మిస్ అయ్యింది. సినిమాలో మొదటి భాగం మొత్తం ల్యాగ్ అయినట్టు అనిపించగా సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. సినిమాలో కమల్ యాక్షన్ సీన్స్ మాత్రం అభినందించేలా ఉంటాయి. 

డైరక్షన్ పూర్ గా అనిపిస్తుంది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఓ స్పై థ్రిల్లర్ కథ ఊహించలేం అలానే విశ్వరూపం-2 కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు.

కాస్ట్ అండ్ క్రూ

3 / 5 - 7887
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS

Tollywood

View all
ఏక్ సినిమా రివ్యూ

ఏక్ సినిమా రివ్యూ

విడుద‌ల తేదీః 14.06.2019 నటీనటులు : బిష్ణు అధికారి , అపర్ణ శర్మ , హిమాన్షి ఖురానా సంగీతం : మంత్ర ఆనంద్ నిర్మాత : హరి దర్శకత్వం : సంపత్ రుద్రారపు రేటింగ్ : 3/5 స‌మాజంలో జ‌రిగే ఎన్నోఅన్యాయాల‌ను అరిక‌ట్టాల‌నే నేప‌ధ్యంలో సాగే క‌థ ఇది. ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌, కుల‌మ‌తాల గొడ‌వ‌లు ఇలా ఎన్నో అన్యాయాల‌ను చూసి త‌ట్టుకోలేని ఓ అమ్మాయి ల‌వ‌ర్ హీరో (బిష్ణు) పాత్ర ఉంటుంది. టెర్రరిజం నేపథ్యంలో సందేశాత్మకంగా తెరకెక్కించిన చిత్రం '' ఏక్ ''. బిష్ణు హీరోగా అపర్ణ శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సుమన్ కీలక పాత్ర పోషించారు. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? చూద్దామా ! స్టోరీ : బ్రిలియంట్ స్టూడెంట్ అయిన సిద్దూ అపర్ణ శర్మ ని ప్రేమిస్తాడు . అపర్ణ శర్మ కూడా సిద్దూ ని అమితంగా ఇష్టపడుతుంది . అయితే ఉగ్రవాదుల దాడిలో అపర్ణ శర్మ చనిపోతుంది . త‌ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అప‌ర్ణ చ‌నిపోవ‌డంతో సంఘ వ్యతిరేకులైన ఉగ్రవాదులను అంతం చేయాలనుకుంటాడు సిద్దూ. ఉగ్రవాదులను అంతం చేయడానికి సిద్దూ ఎంచుకున్న మార్గం ఏంటి ? అందులో సక్సెస్ అయ్యాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . అందులో ఒక‌రిని త‌నే త‌న చేతుల‌తో ఘోరంగా చంపితే మ‌రొక‌రిని తెలివిగా ప్లాన్ చేసి విల‌న్‌ను చంపిస్తాడు. చివ‌ర‌గా త‌ను ప్రియురాలు బాంబ్‌బ్లాస్ట్‌లో చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన మ‌సూద్ (పృధ్వి) క్యారెక్ట‌ర్‌ను త‌న‌తో పాటే బాంబ్ పెట్టి చంపేస్తాడు. త‌న ప్రియురాలు లేని జీవితం త‌న‌కు ఎందుకు త‌న లైఫ్ త‌న‌తోనే అంతం అన్న పాత్ర‌ను ద‌ర్శ‌కుడు చాలా బాగా తెర‌కెక్కించారు. హైలెట్స్ : కథాంశం హీరో నటన పెర్ఫార్మెన్స్ : ఉగ్రవాదులను , అరాచక వాదులను అంతం చేయాలనే సిద్దు పాత్రలో అద్భుతంగా రాణించాడు బిష్ణు అధికారి . నటనలోనే కాదు మంచి ఫిజిక్ తో కూడా ఆకట్టుకున్నాడు బిష్ణు . అపర్ణ శర్మ గ్లామర్ తో అలరించింది , అలాగే హిమాన్షి ఖురానా గ్లామర్ కే పరిమితం అయ్యింది . కీలక పాత్రలో సుమన్ నటించాడు . ఇక సుమన్ గురించి కొత్తగా చెప్పేదేముంది . అలాగే బెనర్జీ , శ్రవణ్ , 30 ఇయర్స్ పృథ్వీ తదితరులు తమ తమ పాత్రల్లో రాణించారు . టెక్నికల్ టీమ్ : మంత్ర ఆనంద్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది , అలాగే విజువల్స్ కూడా బాగున్నాయి . ఖర్చుకు వెనుకాడకుండా మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించి తన నిర్మాణ దక్షతని నిరూపించుకున్నారు హరి . ఇక దర్శకుడు సంపత్ విషయానికి వస్తే బర్నింగ్ పాయింట్ ని కథా వస్తువుగా ఎంచుకొని మంచి ప్రయత్నమే చేసాడు . నటీనటుల నుండి చక్కని నటన ని రాబట్టుకున్న దర్శకుడు యువతని ఆలోచింప జేసే విధంగా ఏక్ చిత్రాన్ని మలిచాడు . ఫైనల్ గా : ఏక్ యాక్ష‌న్ డ్రామా ఎంట‌ర్‌టైన‌ర్‌

Bollywood

View all