లీడ్ కాస్టింగ్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీలీడ్ కాస్టింగ్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీసెకండ్ హాఫ్ ల్యాగ్
విజయ్ గోవిందం (విజయ్ దేవరకొండ) చిన్ననాటి నుండి చాలా పద్ధతిగా పెరిగిన వ్యక్తి. ప్రొఫెసర్ గా జాబ్ చేస్తున్న గోవిందం అనుకోకుండా ఓ బస్ జర్నీలో గీత (రష్మిక) పట్ల మిస్ బిహేవ్ చేస్తాడు. దాని వల్ల అతని మీద పగ పెంచుకుంటుంది. ఇదిలా ఉంటే గీత అన్నతోనే గోవిందం చెల్లి పెళ్లి ఫిక్స్ అవడంతో సైలెంట్ అవుతుంది. అయినా సరే ఆమె చుట్టూ మేడం మేడం అంటూ తిరిగి ఆమెను కన్విన్స్ చేయాలని చూస్తాడు.

ఇంతలోనే గోవిందం కాలేజ్ స్టూడెంట్ చేసిన ఓ పని వల్ల గీతకి అతని మీద మరింత బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. అటు గీత అన్న కూడా బస్ లో గీతతో మిస్ బిహేవ్ చేసిన వాడిని చంపేద్దామని తిరుగుతుంటాడు. అటు అతన్ని.. ఇటు గీతని గోవిందం ఎలా కన్విన్స్ చేశాడు.. చివరకు ఇద్దరిగా ఉన్న గీతా, గోవిందం ఎలా ఒక్కటయ్యారు అన్నదే సినిమా కథ.

విజయ్ గోవిందం గా విజయ్ దేవరకొండ మరోసారి తన పర్ఫార్మెన్స్ తో మనసులు గెలిచాడు. ఎంచుకున్న పాత్రలో చాలా కన్విన్సెడ్ గా నటించాడు. ఇక గీతగా చేసిన రష్మిక మరోసారి తన మార్క్ నటనతో ఆకట్టుకుంది. ఛలో సినిమాతో అలరించిన ఈ భామ గీతగా యూత్ ఆడియెన్స్ కు తెగ నచ్చేస్తుంది. ఇక సుబ్బరాజు పాత్ర బాగానే ఉంది. నాగబాబు పాత్ర చిన్నదే. రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, అన్నపూర్ణల కామెడీ బాగుంది. గిరిబాబు కొన్ని సీన్స్ లో కనిపించారు. 

మనికంథన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో విజయ్, రష్మికలు చాలా అందంగా కనిపించారు. గోపి సుందర్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా ఇంకేం కావాలో సాంగ్ ఆడియో సూపర్ హిట్ అవగా మోంటేజ్ కూడా అలరించింది. కథ, కథనాల్లో దర్శకుడు పరశురాం ప్రతిభ మెచ్చుకోవచ్చు. కథ అంత కొత్తగా లేకున్నా కథనం ఎక్కడ బోర్ కొట్టకుండా చేశాడు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
జీవితంలోకి భార్య వస్తే ఎంత అద్భుతంగా ఊహించుకునే హీరో.. అనుకోకుండా అలాంటమ్మయి దొరికితే మాత్రం ఆమె తనని తప్పుగా అర్ధం చేసుకునేలా పరిచయం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఆ హీరోయిన్ అన్నతోనే హీరో చెల్లి పెళ్లి ఫిక్స్ అవడం. ఆమెను హీరో మేడం మేడం అని జరిగిన తప్పుని మర్చిపోమని రిక్వెస్ట్ చేయడం.

కాస్త ప్రేమతో రా పోలికలు ఉన్న ఈ కథలో దర్శకుడు హీరోయిన్ క్యారక్టర్ అంత వెయిట్ లేకుండా చేశాడు. గోవిందం పాత్ర మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా సాగగా సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. మళ్లీ క్లైమాక్స్ ఆకట్టుకుంది. ఓవరాల్ గా విజయ్ ఫ్యాన్స్ కు ఈ సినిమా నచ్చేస్తుంది.

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ గోవిందం గా విజయ్ చాలా వేరియేషన్స్ చూపించాడు. పాత్రకు పర్ఫెక్ట్ అవడమే కాదు తన మార్క్ యాక్టింగ్ తో అభిమానులను సాటిస్ఫై చేశాడు. ఓవరాల్ గా సినిమా సక్సెస్ అందుకున్నాడు.
Vijay Deverakonda,Rashmika Mandanna,Parasuram,Bunny Vas,Gopi Sundar'గీత గోవిందం' ఇద్దరు కలిసి మెప్పించేశారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: