Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 4:20 am IST

Menu &Sections

Search

ఝాన్సీ : రివ్యూ

- 2.5/5
ఝాన్సీ : రివ్యూ

What Is Good

  • జ్యోతిక
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • సినిమాటోగ్రఫీ

What Is Bad

  • తమిళ నేటివిటీ ఎక్కువవడం
  • డబ్బింగ్
Bottom Line: జ్యోతిక ఝాన్సీ.. మెప్పించే ప్రయత్నమే..!

Story

గాలి రాజు (జివి ప్రకాశ్), రాశి (ఇవానా) ప్రేమించుకుంటారు. ఇద్దరు మైనర్లే.. అయినా సరే రాశి గర్భవతి అవుతుంది. రాశి గర్భానికి కారణం రాజు అని అతనిపై రేప్ కేసు పెడతారు. ఈ కేసు డీల్ చేసేందుకు ఝాన్సీ రంగంలోకి దిగుతుంది. సీనియర్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ఝాన్సీ ఈ కేసు ఎలా డీల్ చేసింది. రాశి గర్భానికి కారణం ఎవరని తెలుసుకుంది. ఈ మిస్టరీని ఝాన్సీ ఎలా క్లియర్ చేసింది అన్నది సినిమా కథ.

Star Performance

తెలుగు ఆడియెన్స్ కు హీరోయిన్ గా మాత్రమే పరిచయం ఉన్న జ్యోతిక ఇలాంటి పవర్ ఫుల్ రోల్ లో వారికి సర్ ప్రైజ్ ఇచ్చిందని చెప్పొచ్చు. మాస్, ఠాగూర్, చంద్రముఖి సినిమాలతో జ్యోతిక తెలుగులో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. సూర్యతో పెళ్లి తర్వాత ఆమె సినిమాలు తగ్గించింది. ఝాన్సీగా మాత్రం అదరగొట్టింది. జివి ప్రకాశ్ మంచి రోల్ చేశాడు. ఇవానా మొదటి సినిమానే అయినా ఆకట్టుకుంది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

Techinical Team

ఇళయరాజా పాటలు అంతగా బాగాలేకున్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరించింది. సతీష్, ఈశ్వర్ సూర్యల కెమెరా పనితనం బాగుంది. బాలా రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా చాలా మోడ్రెన్ గా తీశాడు. కథ, కథనాలు బాలా స్టైల్ కు కాస్త దూరంగా తెరకెక్కించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

Analysis

తమిళంలో బాలా సినిమా అంటే తెలుగులో మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన డైరక్షన్ లో వచ్చిన శివపుత్రుడు, వాడు వీడు కూడా ఇక్కడ ప్రేక్షకాదరణ పొందాయి. బాలా డైరక్షన్ లో మూవీ అనగానే సహజత్వానికి పెద్ద పీఠ వేస్తాడు. ఈ సినిమాలో కూడా అంతే సహజంగా సాగే పాత్రలు.. పాత్ర ధారులు కనిపిస్తారు. అయితే సినిమా కథ అంత గొప్పగా రాసుకోలేదు. సింపుల్ కాన్సెప్ట్ చక్కగా చెప్పాడు. 

కథనంలో దర్శకుడి ప్రతిభ మెచ్చుకోదగినట్టు ఉంటుంది. బాలా సినిమా అని నమ్మడానికి కాస్త టైం పడుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా సరదగా నడిపించిన బాలా సెకండ్ హాఫ్ థ్రిల్లర్ గా మార్చాడు. కథనం వర్క్ అవుట్ అయ్యింది. ఇక సినిమా డ్యూరేషన్ కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుంది. 100 నిమిషాల్లో సినిమా పూర్తి చేస్తారు. 

సిన్సియర్ పోలీస్ పాత్రలో జ్యోతిక మెప్పించింది. ఇక సినిమాలో ప్రతి విషయాన్ని డీటైలింగ్ ఇవ్వడం బాగుంది. కాస్త తమిళ నేటివిటీ ఎక్కువగా అనిపించడం జరిగింది. కొన్ని చోట్ల హోర్డింగులు మార్చలేదు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా ఎక్కకపోవచ్చు. కాని కాన్సెప్ట్ మాత్రం బాగుంది.

Cast & Crew

3 / 5 - 8989
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS

Kollywood

View all
Sarkar Movie Review, Rating

Sarkar Movie Review, Rating

Pandem Kodi 2 Movie Review, Rating

Pandem Kodi 2 Movie Review, Rating