లీడ్ కాస్టింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంభాషణలులీడ్ కాస్టింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంభాషణలుఅక్కడక్కడ స్లో అవడం, కథ

రాజ వంశానికి చెందిన వారసురాలైన ధరణి (రియా సుమన్) బిటెక్ చదువుతూ పార్ట్ టైంగా పేపర్ గా పనిచేస్తున్న రవి (సంతోష్ శోభన్)ను చూసి ఇష్టపడుతుంది. రవి కూడా ధరణిని ఇష్టపడతాడు. ధరణి తల్లిదండ్రులు కూడా వారి ప్రేమను అంగీకరిస్తారు అయితే అనుకోకుండా రవి, ధరణిలు దూరమవుతారు. రవి, ధరణిల మధ్య ఏం జరిగింది..? వారు దూరమవడానికి కారణాలేంటి..? వీరి ప్రేమకథకు ముంబైలో ఉండే మేఘ (తన్య హోప్)కు సంబందం ఏంటి అన్నది సినిమా కథ.

హీరోగా సంతోష్ శోభన్ రెండో సినిమా అయినా బాధ్యత గల పౌరుడిగా మంచి రోల్ చేశాడు. సినిమాలో అతని అభినయానికి అందరు ఫిదా అవుతారు. రవి పాత్రకు సంతోష్ శోభన్ పర్ఫెక్ట్ అనిపించాడు. ఇక రియా సుమన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. సినిమాలో ఎక్కువ సీన్స్ హీరో హీరోయిన్ మధ్య ఉంటాయి. అవి కూడా అలరించేలా ఉన్నాయి. తన్య హోప్ పాత్ర చిన్నదే అయినా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. నాగినీడు, విద్యుల్లేక, మహేష్, బితిరి సత్తి ఇలా అందరు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఆకర్ష్ణణ అని చెప్పొచ్చు. భీమ్స్, బొబ్బిలి సురేష్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్లస్ అని చెప్పొచ్చు. కథ, కథనాలు కొత్తగా ఏమి లేకునందా ఉన్నంతవరకు కాస్త నీట్ గానే ప్రెజెంట్ చేయగలిగాడు జయశంకర్. ఇక ఈ సినిమాకు సంపత్ నంది రచన హెల్ప్ అయ్యింది. సంపత్ నంది నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

తెలుగు సినిమాల్లో రొటీన్ ఫార్ములా అయిన పేందింటి అబ్బాయి.. గొప్పింటి అమ్మాయి కాన్సెప్ట్ తోనే పేపర్ బాయ్ సినిమా వచ్చింది. అయితే దర్శకుడు కథ ఎంచుకున్న తీరు ఫ్లాట్ గా ఉన్నా కథనం మెప్పించింది. హీరో, హీరోయిన్ ఇష్టపడే తీరు.. వారి మధ్య సంభాషణలు అలరిస్తాయి. 

సినిమాలో కాస్టింగ్ కూడా బాగుంది. లీడ్ పెయిర్ నటన ఆకట్టుకుంటుంది. సినిమాలో కామెడీ సీన్స్ ఉన్నా అది సినిమా ఫ్లోని దెబ్బతీసేలా కనిపిస్తాయి. సంపత్ నంది రచనా సహకారం సినిమాకు బాగానే హెల్ప్ అయ్యిందని చెప్పొచ్చు. దర్శకుడు జయశంకర్ మొదటి ప్రయత్నంగా వచ్చిన పేపర్ బాయ్ సినిమా అంచనాలను అందుకోలేదు. అయితే యూత్ ఆడియెన్స్ ఈ సినిమా రిసీవ్ చేసుకున్న విధానాన్ని బట్టి సినిమా ఫలితం ఉంటుంది. సినిమాలో మనసుని తాకే కొన్ని సంభాషణలు అలరిస్తాయి.    

కథ, కథనాల్లో ఇంకాస్త జాగ్రత్త పడితే మంచి ఫలితం వచ్చేది. సంపత్ నంది ప్రొడక్షన్ లో వచ్చిన ఈ పేపర్ బాయ్ కొంతమేరకు పర్వాలేదు అన్నట్టు ఉన్నా ఫైనల్ గా మంచి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.
Santosh Shoban,Riya Suman,Tanya Hope,Jaya Shankarr,Sampath Nandi,Bheemsపేపర్ బాయ్.. మంచి ప్రయత్నమే కాని..!

మరింత సమాచారం తెలుసుకోండి: