సహజ నటన, స్టార్ కాస్ట్, మ్యూజిక్, డైరక్షన్ సహజ నటన, స్టార్ కాస్ట్, మ్యూజిక్, డైరక్షన్ ఊహాజనితమైన కథనం, మిస్సింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్, డాక్యుమెంటరీ అప్పీల్

కంచరపాలెం లో ఉండే రాజు(సుబ్బారావు) అటెండర్ గా ఉద్యోగం చేస్తుంటాడు. 49 ఏళ్లు వచ్చిన ఇంకా పెళ్లి చేసుకోని అతని గురించి ఊళ్లో వాళ్లంతా రకరకాలుగా మాట్లాడుకుంటారు. అదే ఆఫీస్ లో కొత్తగా వచ్చిన ఆఫీసర్ రాధా (రాధా బెస్సీ) అతన్ని ప్రేమిస్తుంది. పెళ్లై భర్త చనిపోవడంతో రాజుని ప్రేమిస్తుంది.


ఇక మరో పక్క జోసెఫ్ (కార్తిక్ రత్నం), బ్రహ్మణ అమ్మాయి అయిన భార్గవి (ప్రణీతా పట్నాయక్) ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఇక వైన్ షాప్ లో పనిచేసే గడ్డం (మోహన్ భగత్), వేశ్య అయిన సలీమా (విజయ ప్రవీణ)ను కళ్లు చూసి ప్రేమిస్తాడు. స్కూల్ కు వెళ్లే సుందరం (కేశవర కర్రి), సునీత (నిత్య శ్రీ)లది ఒక రకమైన ప్రేమ. వీరి ప్రేమకథలన్ని ఒకే చోట మలుపు తిరుగుతాయి. అదే సినిమా కథ.  

అందరు కొత్తవారితో తీసిన ఈ సినిమా దర్శకుడు ఆర్టిస్టుల దగ్గర నుండి పర్ఫార్మెన్స్ రాబట్టడంలో సక్సెస్ అయ్యాడు. ప్రతి ఒక్క పాత్ర చాలా నాచురల్ గా అనిపిస్తుంది. కంచరపాలెం లో మనం కూడా ఉన్నామన్న ఫీలింగ్ కలిగేలా దర్శకుడి టేకింగ్ ఉంది. ఈ సినిమా మొత్తం 52 మంది కొత్త వారిని పరిచయం చేశారు. లీడ్ రోల్ చేసిన రాజు, మోహన్ భగన్, కార్తిక్ అందరు బాగా చేశారు.

స్వీకర్ అగస్థి మ్యూజిక్ చాలా బాగుంది. బిజిఎం అదరగొట్టేశాడు. వరుణ్, ఆదిత్యల సినిమాటోగ్రఫీ చాలా ఇంప్రెస్ గా అనిపిస్తుంది. నాచురల్ లొకేషన్స్ లో కూడా చాలా అందంగా సినిమా వచ్చేలా చేశారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. కథ, కథనాల్లో దర్శకుడు పర్ఫెక్షన్ మెచ్చుకునేలా ఉంది. వెంకటేష్ మహా తన ప్రతిభ చాటాడని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత కావాలో అంత పెట్టారు.  

ఒక ఊరు.. నాలుగు ప్రేమ కథలు.. అందులో ఒక చిన్న ట్విస్ట్.. రా అండ్ రియలిస్టిక్ అనే మాటలకు కంచర పాలెం పర్ఫెక్ట్ ఎక్సాంపుల్ అని చెప్పొచ్చు. పాత్రలు నటిస్తున్నట్టుగా కాకుండా జీవిస్తున్నట్టుగా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు మన పక్కన జరుగుతున్న సందర్భాలే అనిపించేలా కథ, కథనాలు ఉన్నాయి.

ఇక లైవ్ రికార్డింగ్ తో సినిమాను ఆడియెన్స్ కు మరింత చేరువయ్యేలా చేశారు. ఈ సినిమా సక్సెస్ లో దర్శకుడు వెంకటేష్ మహాకు ఎక్కువ మార్కులు పడుతాయి. తను రాసుకున్న కథ కథనం ఎలాంటి అవుట్ పుట్ రావాలో ముందే ఊహించుకుని సరిగ్గా అలాంటి అవుట్ పుట్ తెచ్చుకున్నాడు.

ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. డిఫరెంట్ జానర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలను ఇష్టపడే వారికి కంచరపాలెం నచ్చే అవకాశం ఉండదు.
Subba Rao, Radha Bessy, Nithya Sri Goru,Karthik Ratnam,Vijaya Praveena,Praneetha Patnaik,Venkatesh Maha,Rana Daggubati,Sweekar AgasthiC/o కంచరపాలెం.. జీవితాన్ని చూపించిన సినిమా..!

మరింత సమాచారం తెలుసుకోండి: