చైతన్య, మ్యూజిక్, సినిమాటోగ్రఫీచైతన్య, మ్యూజిక్, సినిమాటోగ్రఫీరొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్
రిచ్ బిజినెస్ మ్యాన్ రావు (మురళి శర్మ) కొడుకైన చైతన్య తండ్రి బిజినెస్ లు చూసుకుంటూ ఉంటాడు. డబ్బున్న పొగరు, ఈగోయిస్ట్ గా ఉండే చైతన్య మొదటి చూపులోనే ప్రేమించిన అను (అను ఎమ్మాన్యుయెల్) తో నిశ్చితార్ధం చేస్తాడు. ఆమె శైలజా రెడ్డి కూతురు చెప్పాపెట్టకుండా పెళ్లిచేసుకోవడం తెలిసి ఆమె మనుషులు అనుని తీసుకెళ్తారు. అయితే ఆ విషయాన్ని శైలజా రెడ్డి దగ్గర దాచేస్తారు. శైలజా, అనుల మధ్య చిన్న విషయంలో గొడవై వారిద్దరు మాట్లాడరు అది తెలుసుకుని చైతన్య ఆ తల్లి కూతుళ్లతో పాటుగా తన ప్రేమను ఎలా గెలిచాడన్నది సినిమా కథ.
చైతన్య పాత్రలో నాగ చైతన్య ఎప్పటిలానే ఎనర్జిటిక్ నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాలో చైతు లుక్స్ బాగున్నాయి. ఇక హీరోయిన్ గా అను ఎమ్మాన్యుయెల్ ఇంప్రెస్ చేసింది. టైటిల్ రోల్ పోశించిన రమ్యకృష్ణ తన పాత్రకు తగినట్టుగా చేసింది. నరేష్, వెన్నెల కిశోర్, పృధ్వి నటన ఆకట్టుకుంది.
నిజార్ షఫి సినిమాటోగ్రఫీ బాగుంది. చైతుని కొత్తగా చూపించారు. ఇక గోపి సుందర్ మ్యూజిక్ బాగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. దర్శకుడు మారుతి కథ, కథనాల్లో పెద్దగా కొత్తదనం లేదు. కథనం మరీ రొటీన్ గా అనిపిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
మారుతి సినిమాలు కథలు రొటీన్ గా అనిపించినా కథనం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు అలానే అనిపిస్తాయి. అయితే శైలజా రెడ్డి అల్లుడు మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. మారుతి తన మార్క్ మిస్సయ్యాడని అనిపిస్తుంది.


మొదటి భాగం సక్సెస్ అయిన మారుతి సెకండ్ హాఫ్ మరీ రొటీన్ గా కథనం నడిపించాడనిపిస్తుంది. ఒకానొక సందర్భంలో బోర్ కూడా కొట్టించేస్తుంది. తల్లి, కూతుళ్లు మాట్లాడని సందర్భంలో హీరో వారి చేత మాట్లాడించే సీన్స్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. రమ్యకృష్ణ పాత్ర బాగుంది. ఆమెను ఇంకా బాగా వాడుకోవచ్చు. మెయిన్ హీరోయిన్ కన్నా రమ్యకృష్ణ పాత్ర ఇంప్రెస్ చేస్తుంది.


హీరోయిన్ క్యారక్టరైజేషన్ విషయంలో దర్శ్కుడు తడబడ్డాడని చెప్పొచ్చు. తాను చెప్పదలచుకున్న పాయింట్ కామెడీ రూపంలో చెప్పే మారుతి శైలజా రెడ్డి అల్లుడు విషయంలో లాజిక్స్ మిస్సయ్యాడని చెప్పొచ్చు. ఓవరల్ గా మొదటి భాగం బాగున్నా సెకండ్ హాఫ్ మాత్రం ఇబ్బంది పెట్టేస్తుంది.
Naga Chaitanya,Anu Emmanuel,Ramya Krishnan,Maruthi Dasari,S Radha Krishna,Naga Vamsi S,PDV Prasad,Gopi Sundarశైలజా రెడ్డి అల్లుడు ఆకట్టుకోలేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: