సుధీర్, నభా నటేష్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్సుధీర్, నభా నటేష్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్

కార్తిక్ (సుధీర్ బాబు) చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన తను కెరియర్ మీద బాగా ఫోకస్ పెడతాడు. యూఎస్ వెళ్లాలనే లక్ష్యంతో సాఫ్ట్ వేర్ ఆఫీస్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేసే కార్తిక్ తన తండ్రిని మేనేజ్ చేసేందుకు లవర్ గా సిరి అలియాస్ మేఘన (నభా నటేష్)ను పరిచయం చేస్తాడు. అయితే అనుకోకుండా మేఘన కార్తికేయ ప్రేమలో పడుతుంది. కాని కెరియర్ మీద ఫోకస్డ్ గా ఉండే కార్తిక్ మేఘన ప్రేమని అర్ధం చేసుకోడు. మేఘన కూడా కార్తిక్ తనని ఇష్టపడటం లేదని డిసైడ్ అవుతుంది. అయితే ఇంతలోనే మేఘన మీద ప్రేమ పెంచుకుంటాడు కార్తిక్. ఫైనల్ గా కార్తిక్, మేఘన లవ్ సక్సెస్ అయ్యిందా..? కెరియర్ కోసం ప్రేమని త్యాగం చేశాడా.. లేదా అన్నది సినిమా కథ.

సుధీర్ బాబు తన పరంగా సినిమాకు న్యాయం చేశాడు. నిర్మాతగా కూడా తను సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. హీరోయిన్ నభా నటేష్ పర్వాలేదు అనిపించుకుంది. అక్కడక్కడ ఆమె ఎక్స్ ప్రెషన్స్ అంతగా బాగాలేదు ఫైనల్ గా ఓకే అనిపించుకుంది. ఇక సుదర్శన్, జబర్దస్త్ వేణు ఒకటి రెండు సీన్స్ కే పరిమితమయ్యారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సురేష్ సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది.. సుధీర్ బాబుని అందంగా చూపించాడు. మ్యూజిక్ డైరక్టర్ అంజనీష్ లోక్ నాథ్ పాటలు అంతగా ఆకట్టుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంగా ఇంప్రెస్ చేయలేదు. ఆర్.ఎస్ నాయుడు కథ, కథనాలు కొత్తగా అనిపించలేదు. సాదగీసిన కథనంతో బోర్ కొట్టించాడని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

సుధీర్ బాబు నిర్మాతగా చేసిన మొదటి ప్రయత్నం నన్ను దోచుకుందువటే. మరదలు పెళ్లి కాదనడం.. తండ్రిని మెప్పించేందుకు వేరే అమ్మాయిని లవ్ చేస్తానని చెప్పిన హీరో తండ్రి కోసం ఓ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ తో మేనేజ్ చేయాలని అనుకుంటాడు. ఫైనల్ గా వీరి కథ ఎలా ముగిసింది అన్నది ఈ సినిమ.

అయితే సినిమా కథగా చెప్పుకుంటే చిన్న పాయింటే.. అయితే కథనం ఇంట్రెస్టింగ్ గా సాగించడంలో దర్శకుడు ఆర్.ఎస్ నాయుడు విఫలమయ్యాడు. మొదటి భాగం కాస్త పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ ఆకట్టుకోలేదు. అక్కడక్కడ సుధీర్ తన పనితనం చూపించాడు.

రొటీన్ కథే అయినా కథనం కాస్త ఎంటర్టైనింగ్ గా ఉంటే బాగుండేది కాని ఆర్.ఎస్ నాయుడు కథనం కూడా రొటీన్ గానే సాగించాడు. పాటలు కూడా అంతగా మెప్పించేలేకపోయే సరికి సినిమా బోర్ కొట్టించేస్తుంది. యూత్ ఆడియెన్స్ కు అక్కడక్కడ నచ్చే అంశాలున్నా సినిమా మాత్రం నిరాశ పరచిందనే చెప్పొచ్చు.
Sudheer Babu,Nabha Natesh,RS Naidu,B. Ajaneesh Loknathనన్ను దోచుకుందువటే.. సుధీర్ వృధా ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: