ఎన్.టి.ఆర్ త్రివిక్రం డైలాగ్స్ సినిమాటోగ్రఫీఎన్.టి.ఆర్ త్రివిక్రం డైలాగ్స్ సినిమాటోగ్రఫీమిస్సింగ్ ఎంటర్టైన్మెంట్స్ అక్కడక్కడ ల్యాగ్ అవడం
ఫ్యాక్షన్ గొడవల్లో తండ్రిని నారప రెడ్డి (నాగబాబు)ని కోల్పోయిన వీర రాఘవ రెడ్డి (ఎన్.టి.ఆర్) నాయనమ్మ మాటల ప్రభావం వల్ల పగ ప్రతీకారం వదిలి సిటీకెళ్తాడు. అలా ఉన్న వీర రాఘవకి అరవింద (పూజా హెగ్దె) పరిచయం ఏర్పడుతుంది.

ఒకానొక టైం లో ఆమె మీద ఎటాక్ చేయగా అప్పటి నుండి ఆమెకు బాడీ గార్డ్ గా ఉంటాడు. అరవింద సొంత ఊరికి కూడా వస్తాడు వీర రాఘవ. అక్కడ ఎలాంటి పరిస్థితులను వీర రాఘవ ఎదుర్కున్నాడు..? అరవింద ఎవరు..? వీర రాఘవ ఏం చేశాడు అన్నదే సినిమా కథ. 

ఎన్.టి.ఆర్ వీర రాఘవ పాత్రలో అదరగొట్టేశాడని చెప్పొచ్చు. త్రివిక్రం రాసుకున్న క్యారక్టరైజేషన్ కు తారక్ పర్ఫెక్ట్ అనిపించాడు. ఇక సినిమాలో హీరోయిన్ పూజా హెగ్దె పాత్ర సినిమా మొత్తం ఉన్నా అంతగా ఇంప్రెస్ చేయలేదు. సినిమా టైటిల్ రోల్ ఆమెదే అయినా ఎందుకో పూజా అంత బాగా చేసిందని అనిపించలేదు.

ఇక ఈషా రెబ్బ పాత్ర కూడా అంతే ఏదో ఉంది అంటే ఉంది అన్నట్టు ఉంటుంది. సునీల్ సినిమాలో కొత్తగా కనిపించాడు. సునీల్ కు కచ్చితంగా ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుంది. ఇక బసి రెడ్డి (జగపతి బాబు) పాత్ర బాగుంది. జెబి కూడా ఆ రోల్ లో చక్కగా అభినయించారు.

పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అలరించింది. సినిమాలో ప్రతి ఫ్రేం అందంగా తీర్చిదిద్దాడు. తమన్ మ్యూజిక్ సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. బ్యాక్ గ్రౌండ్ సాంగ్, పెనివిటి సాంగ్ బాగున్నాయి. బిజిఎం అదరగొట్టాడు.

కథ, కథనాల్లో దర్శకుడు త్రివిక్రం తన పెన్ పవర్ చూపించగా రెగ్యులర్ గా త్రివిక్రం సినిమాల్లో ఆశించే కామెడీ ఈ సినిమలో ఉండదు. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవలేదని సినిమా చూస్తే తెలుస్తుంది.

త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో సినిమా అంటే ఆడియెన్స్ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఆ అంచనాలకు తగినట్టుగానే అరవింద సమేత ఉందని చెప్పొచ్చు. రెగ్యులర్ ఫ్యాక్షన్ రివెంజ్ స్టోరీనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు త్రివిక్రం. ఇక ఆయన మాటల తూటాలైతే మాములుగా పేలలేదు.


వీర రాఘవ పాత్ర ఇంటెన్స్ తో పలికించే డైలాగ్స్ ది బెస్ట్ గా నిలిచాయి. అయితే సినిమా మొత్తం సీరియస్ గా నడిపించడం కాస్త నిరాశ పరుస్తుంది. కంటెంట్ కు కనెక్ట్ అయిన ఆడియెన్స్ కు మాత్రం బాగా నచ్చుతుంది. అయినా సరే అక్కడక్కడ ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొదటి 20 మినిట్స్ అదుర్స్ అనిపించగా.. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ కాస్త నిరాశపరుస్తుంది.


ఫైనల్ గా క్లైమాక్స్ లో మళ్లీ శభాష్ అనిపించారు. నందమూరి అభిమానులే కాదు సిని ప్రియులు కూడా నచ్చే సినిమాగా అరవింద సమేత వచ్చింది. అయితే త్రివిక్రం మార్క్ పంచ్ డైలాగులు.. ఎంటర్టైన్మెంట్ ఆశించి సినిమాకు వస్తే నిరాశ చెందుతారు.
N. T. Rama Rao Jr,Pooja Hegde,Eesha Rebba,Trivikram Srinivas,S. Radha Krishna,S. Thamanఅరవింద సమేత వీర రాఘవ.. ఎన్.టి.ఆర్ అభిమానులకు పండుగే..!

మరింత సమాచారం తెలుసుకోండి: