విశాల్ వరలక్ష్మి మ్యూజిక్ విశాల్ వరలక్ష్మి మ్యూజిక్సెకండ్ హాఫ్ కథ

రాయలసీమలోని ఏడు ఊళ్లకు పెద్దాగా ఉంటాడు రాజా రెడ్డి (రాజ్ కిరణ్). వీరభధ్ర జాతరకు రాజా రెడ్డి తన వారసుడు బాలు (విశాల్)ను ఫారిన్ నుండి రమ్మంటాడు. అయితే ఏడేళ్ల క్రైతం జాతరలో భోజనాల దగ్గర జరిగిన చిన గొడవ చిలికిచిలికి గాలి వాన అవుతుంది. రెండు కుటుంబాల మధ్య గొడవ ముదురుతుంది.


అందులో ఓ కుటుంబానికి చెందిన భవాని అవతలి కుటుంబంలో వారసుడు లేకుండా చంపేయమంటుంది. అయితే ఆ కుటుంబానికి రాజా రెడ్డి అండగా ఉంటాడు. రాజా రెడ్డి చెప్పడంతో ఆయన కోరిక మేరకు బాలు ఆ కుటుంబాన్ని కాపాడేందుకు నడుం బిగిస్తాడు. ఇంతకీ భవాని ఎవరు..? బాలు భవానిల మధ్య గొడవ దేనికి. బాలు ప్రేమించింది ఎవరిని అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమాలో బాలుగా విశాల్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. యాక్షన్, ఫైట్స్ అన్ని అదరగొట్టాడు. హీరోయిన్ గా కీర్తి సురేష్ తక్కువ ప్రాధాన్యత కలిగిన పాత్రే చేసింది. సినిమాలో హీరోతో సమానమైన పాత్ర చేసింది వరలక్ష్కి శరత్ కుమార్. భవాని పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంది. ఇక సినిమాలో రాజ్ కిరణ్ నటన ఇంప్రెస్ చేసింది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

క్.ఏ శక్తివేల్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు కావాల్సిన సీమ బ్యాక్ డ్రాప్ చక్కగా చూపించాడు. ఇక యువన్ శంకర్ రాజా సాంగ్స్ అలరించాయి. బిజిఎం కూడా బాగుంది. కథ, కథనాలు కొత్తగా ఏమి అనిపించవు.. కాని ఊర మాస్ ఆడియెన్స్ మెప్పించేలా సినిమా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

పందెం కోడి వచ్చిన పుష్కర కాలానికి ఆ సినిమా సీక్వల్ వచ్చింది. ఈ సినిమాతో దర్శకుడు లింగుస్వామి తన సత్తా చాటాడు. అయితే సినిమా తెలుగు డబ్బింగ్ కావడం చేత చాలా చోట్ల తమిళ నేటివిటీ బాగా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగగా సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా నడుస్తుంది.


సినిమాలో విశాల్, వరలక్ష్మిల ఫైట్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేదనిపిస్తుంది. రొటీన్ సినిమాగా వచ్చిన పందెం కోడి-2 పక్కా మాస్ ఎంటర్టైనర్.. అది కాకుండా మిగతా ఏది ఆశించి వెళ్లినా నిరాశ చెందుతారు. ఇంకా చెప్పాలంటే ఏ క్లాస్ సెంటర్స్ లో ఈ సినిమా నడవడం పెద్ద కష్టమే.


మొత్తానికి లింగుస్వామి సూపర్ సక్సెస్ ఫుల్ సీక్వల్ సూపర్ ఎంటర్టైనర్ గా మిగిలింది. విశాల్, వరలక్ష్మి, కీర్తి సురేష్ లీడ్ కాస్టింగ్ అంతా సినిమాకు ది బెస్ట్ అందించారు. 
Vishal,Keerthi Suresh,Varalaxmi Sarathkumar,N.Linguswamy,yuvan shankar rajaపందెం కోడి-2.. ఓనీ ఫర్ మాస్ ఆడియెన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: