శ్రీయ శరణ్, అక్కడక్కడ కెమెరా వర్క్ శ్రీయ శరణ్, అక్కడక్కడ కెమెరా వర్క్ స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్
ఒకే సందర్భంలో మూడు సంఘటనలు నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీయా శరణ్ లకు షాక్ ఇస్తాయి. క్రికెటర్స్, సెలబ్రిటీస్ ఉన్న ఫ్లైట్ హైజాక్ అవడం జరుగుతుంది. మరో పక్క కొందరు చిన్నారులు కిడ్నాప్ అవుతారు. ఒక పిల్లాడు తన ఇల్లు పోయింది అంటూ కంప్లైంట్ ఇస్తాడు. ఈ మూడు సంఘటనలను ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండగా మూడింటికి కారణం ఒకడే అని తెలుసుకుంటారు. ఆ ఒక్కడు ఎవరు..? అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు..? కథ ఎక్కడ మొదలై ఎక్కడ ముగిసింది అన్నది సినిమా.


ఎంచుకున్న కథను తెర మీదకు తీసుకు రావడంలో దర్శకుడు చాలా పొరపాట్లు చేశాడు. అందుకే సినిమాలో నటించిన నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీయా శరణ్ లు కూడా తమ పరంగా బాగా చేసినా అది సినిమాకు ఏమాత్రం హెల్ప్ అవలేదు. అసలు వీరు ముగ్గురిని దర్శకుడు ఏం చెప్పి ఈ సినిమాకు ఒప్పించాడు అన్న డౌట్ వస్తుంది.



మార్క్ రాబిన్ సంగీతం ఆకట్టుకోలేదు. సినిమా కథ, కథనాలు ఆకట్టుకునేలా తీయడంలో దర్శకుడు ఇంద్రసేన విఫలనయ్యాడు. వెంకట్ సినిమాటోగ్రఫీ సోసోగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే దారుణంగా ఉన్నాయి. వీర భోగ వసంత రాయలు టైటిల్ ఎంత రిచ్ గా ఉందో సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అంత డల్ గా ఉంటాయి.



థ్రిల్లర్ కథలకు స్క్రీన్ ప్లే చాలా పకడ్బందీగా ఉండాలి. వీర భోగ వసంత రాయలు సినిమా టీజర్, ట్రైలర్ ఇలా సినిమాపై ఆసక్తి పెంచిన దర్శకుడు ఇంద్రసేన తన ప్రతిభ కనబరచలేకపోయాడు. తల తోక లేని కథ, కథనాలతో ఆడియెన్స్ కు అసహననాన్ని కలిగించాడు. సినిమాలో మూడు కథలు అసలు వాటికి క్లారిటీ లేదు. 


దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు.. ఏం తీశాడు.. రషెష్ చూశాక ఏం అర్ధం కాక అతికించి ఆడియెన్స్ మీదకు వదిలాడని అనిపిస్తుంది. కేవలం చివరి 15 నిమిషాలు కాస్త బెటర్ గా అనిపిస్తాయి. తప్ప సినిమా రెండు గంటల 5 నిమిషాలు ఎందుకు సినిమాకు వచ్చామన్న భావన వస్తుంది.


సినిమా దర్శకుడు అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యాడు. నటీనటులు మంచి టాలెంట్ ఉన్న వారే అయినా వారిని వాడుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. థ్రిల్లర్ సినిమా ఎలా తీయకూడదో ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు.



ఆర్. ఇంద్రసేన, అప్పారావు బెల్లన, మార్క్ కె.రాబిన్, నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రియ సరన్వీర భోగ వసంత రాయలు.. ఆకట్టుకోలేని ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: