విజయ్ సినిమాటోగ్రఫీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్విజయ్ సినిమాటోగ్రఫీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్టోరీ స్క్రీన్ ప్లే లాజిక్ లెస్ సీన్స్

విదేశాల్లో కార్పోరేట్ సిఈఓగా పనిచేసే సుందర్ (విజయ్). తాను ఏ దేశంలో వెళ్తే ఆ దేశంలో కార్పోరేట్ కంపెనీలను నాశనం చేసి ఆక్రమిస్తుంటాడు. సంవత్సరానికి వేల కోట్లు సంపాదించే సుందర్ రామస్వామి ఇండియాకు వస్తాడు. తన రాకతో ఇక్కడ కార్పోరేట్ కంపెనీలన్ని వణికిపోతుండగా తాను వచ్చింది తన ఓటు హక్కు వినియోగించుకునేందుకే అని వివరణ ఇస్తాడు. అయితే ఈలోగా తన ఓటుని ఎవరో వేసేశాడని గుర్తిస్తాడు. తన ఓటు దొంగల పాలయ్యిందని కోర్టుని ఆశ్రయిస్తాడు సుందర్. దానితో కోర్ట్ ఎలక్షన్ కౌంట్ ఆపివేస్తుంది. తనలానే 3 లక్షల మంది దొంగ ఓట్ల గురించి కేసు వేయగా ఎన్నికలను రద్దు చేసి మరో 15 రోజుల్లో కొత్తగా ఎన్నికలను నిర్వహించాలని ఆర్డర్స్ వేస్తారు. ఇక ఈలోగా తానో రాజకీయ శక్తిగా మారలనుకుంటాడు సుందర్. ఇంతకీ సుందర్ టార్గెట్ ఎవరు..? తాను ఎలాంటి రాజకీయాలు చేయాలనుకున్నాడు..? అధికార పార్టీని ఎలా ఎదురించాడు అన్నది సర్కార్ సినిమా కథ.

సుందర్ గా విజయ్ నటన ఆకట్టుకుంది. సినిమాలో అతని మార్క్ యాక్షన్, డ్యాన్స్, డైలాగ్స్ తో అలరించాడు. అయితే విజయ్ ను మురుగదాస్ ఇంకా సరిగా వాడుకోలేదని చెప్పొచ్చు. కీర్తి సురేష్ హీరోయిన్ గా కొన్ని సీన్స్ కే పరిమితమైంది. అవికూడా సినిమాకు అంత ప్రాధాన్యత అనిపించవు. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర నిడివి కొద్దిసేపే అయినా బాగా చేసింది. రాధారవి, కురియప్ప పాత్రలు ఆకట్టుకున్నాయి.

రహమాన్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే కాని.. పాటలు మెప్పించలేదు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో కెమెరా వర్క్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక దర్శకుడు మురుగదాస్ కథ, కథనం అంతగా ఆకట్టుకోలేదు. సినిమా మొదలు పెట్టడం కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించినా పోను పోను రొటీన్ కమర్షియల్ డ్రామాగా ఉంటుంది. కథనంలో మురుగదాస్ గ్రిప్పింగ్ చూపించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

స్టార్ డైరక్టర్, స్టార్ హీరో సినిమా అది కూడా రెండు సూపర్ హిట్లు అందించగా హ్యాట్రిక్ గా వచ్చే సినిమాపై అంచనాలు ఉంటాయి. అలానే తుపాకి, కత్తి తర్వాత వచ్చిన సర్కార్ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో సర్కార్ విఫలమైంది. మురుగదాస్ కథ.. దాన్ని నడిపించిన కథనం ట్రాక్ తప్పేశాయి.

తన సినిమాలో కంటెంట్ ను ప్రతి సీన్ లో ఎలివేట్ అయ్యేలా చేసే మురుగదాస్ ఎంచుకున్న కథను నడిపించడంలో టైం పాస్ చేసినట్టు అనిపిస్తుంది. మొదటి భాగం ఎలాగోలా మెప్పించగా సెకండ్ హాఫ్ మాత్రం సాగదీసినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మరి అతి చేసినట్టు అనిపిస్తుంది.

లాజిల్ లెస్ సీన్స్ తో సినిమాలో మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని దర్శకుడు మురుగదాస్ అనుకోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. విజయ్ ఫ్యాన్స్ కు నచ్చే అంశాలన్ని ఉన్న ఈ సర్కార్ సగటు సిని ప్రేక్షకుడిని మాత్రం మెప్పించలేదు.
విజయ్,కీర్తి సురేష్,వరలక్ష్మి,ఎ.ర్ మురగదాస్,కలానిధి మారన్,ఎ.ర్ రెహ్మాన్విజయ్ సర్కార్.. మురుగదాస్ ఫెయిల్యూర్ కంటిన్యూస్..!

మరింత సమాచారం తెలుసుకోండి: