విజయ్ దేవరకొండ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ ప్లేవిజయ్ దేవరకొండ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ ప్లేసెకండ్ హాఫ్ అక్కడక్కడ స్లో అవడం సిజి వర్క్అతికష్టం మీద ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసిన శివ (విజయ్ దేవరకొండ) జాబ్ చేయాలని హైదరాబాద్ వస్తాడు. ఏవేవో ఉద్యోగాలు చేసిన శివ క్యాప్ డ్రైవర్ ఉద్యోగం తనకు పర్ఫెక్ట్ అని తన దగ్గర ఉన్న డబ్బులతో ఓ కారు కొంటాడు. అయితే అతని అదృష్టం కొద్ది శివకు ఆ కారు కొన్ననాటి నుండి శివకు బాగా కలిసి వస్తుంది.

అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్న టైంలో శివ కారులో దెయ్యం ఉందని గమనిస్తాడు. మరి ఆ కారులో దెయ్యాన్ని శివ ఏం చేస్తాడు. ఆ దెయ్యం వల్ల శివ ఎలాంటి రిస్క్ లో పడ్డాడు. ఫైనల్ గా కారుని కారులో దెయ్యాన్ని ఏం చేశాడు అన్నది సినిమా కథ.


విజయ్ ఎప్పటిలానే జోష్ ఫుల్ గా నటించి మెప్పించాడు. సినిమా మొదలైన కొద్దిసేపటికే అతని పాత్రకు కనెక్ట్ అయ్యేలా నటించాడు. ఇక ప్రియాంకాకు పెద్దగా స్కోప్ లేకున్నా ఉన్నంతలో ఆమె బాగా చేసింది. ముఖ్యంగా క్యూట్ లుక్స్ అలరించాయి. మాళవిక నాయర్ కూడా స్క్రీన్ టైం కొద్దిసేపే కాని ప్రత్యేకమైన పాత్ర అని చెప్పొచ్చు. ఇక మధునందన్ గా విష్ణు అనే కొత్త కుర్రాడు మెప్పించాడు. రవి వర్మ, రవి ప్రకాశ్, కళ్యాణి, ఉత్తేజ్, యమున పరిధి మేరకు నటించి మెప్పించారు.
సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా గురించి హైలెట్ గా చెప్పుకోవాల్సిన అంశాల్లో కెమెరా వర్క్ ఒకటి. జేక్ బిజోయ్ మ్యూజిక్ బాగుంది. బిజిఎం అలరించింది. రాహుల్ సంకృత్యన్ హర్రర్ సినిమా అటెంప్ట్ బాగానే డీల్ చేశాడని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. డిఫరెంట్ సినిమాలు చేస్తూ కెరియర్ కొనసాగిస్తున్న విజయ్ ఇలాంటి జానర్ సినిమా చేయడం గొప్ప విషయం. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ ఓకే. డైలాగ్స్ చాలా నాచురల్ గా ఉన్నాయి.


హర్రర్ థ్రిల్లర్ అంటే ఒకే రకమైన ఫార్మెట్ లో వెళ్తుంటాయి అని ఆడియెన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. టాక్సీవాలా ట్రైలర్ చూస్తే సరదాగా టాక్సీ నడుపుతున్న హీరో కారులో దెయ్యం వచ్చి చేరుతుంది. అది తనని ఎలా ఆడిస్తుందో అనేదే సినిమా కథ. అయితే ఇందులో కొత్తగా సైంటిఫిక్ కనెక్షన్ కొత్తగా అనిపిస్తుంది. 


సినిమాలో ఆస్ట్రాల్ ప్రొజెక్షన్ అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. ఇక సాధారణంగా హర్రర్ థ్రిల్లర్ సినిమాల్లో ఉండే బలవంతమైన కామెడీ కాకుండా సరదాగా ఈ సినిమా నడిపించాడు దర్శకుడు. మొదటి భాగం అంతా సరదాగా సాగగా సెకండ్ హాఫ్ కాస్త స్లో అయినట్టు తెలుస్తుంది. దర్శకుడు కథను బాగానే డీల్ చేశాడు.


గీతా గోవిందం హిట్ తర్వాత నోటాతో ఫ్లాప్ అందుకున్న విజయ్ ఈ హర్రర్ థ్రిల్లర్ తో మళ్లీ ట్రాక్ ఎక్కాడని చెప్పొచ్చు. సినిమా సగటు సిని ప్రేక్షకుడుని అలరిస్తుంది. ఇక విజయ్ ఫ్యాన్స్ కు ఈ సినిమా బాగా నచ్చేస్తుంది.


విజయ్ దేవరకొండ, ప్రియాంక జవల్కర్,బన్ని వాసు,రాహుల్ సాంకృతాయన్,జేక్స్ బిజాయ్టాక్సీవాలా.. విజయ్ ఫన్ ఫిల్డ్ రైడ్

మరింత సమాచారం తెలుసుకోండి: