ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాటోగ్రఫీప్రొడక్షన్ వాల్యూస్ సినిమాటోగ్రఫీరొటీన్ రివెంజ్ డ్రామా మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్
నమ్మి తమ కంపెనీలో షేర్ ఇచ్చినందుకు తన ఫ్యామిలీని చంపేసిన నలుగురు మీద పగ పెంచుకుంటాడు అమర్ (రవితేజ). అయితే అతని జీవితంలో జరిగిన ఈ ట్రాజడీ వల్ల అతనికి ఓ డిజార్డర్ ఏర్పడుతుంది. దానిలో భాగంగా కొంతసేపు అక్బర్, మరికొంతసేపు ఆంటోనిగా మారుతుంటాడు. ఐశ్వర్య అలియాస్ పూజా (ఇలియానా) కూడా అమర్ కోసం వెతుకుతుంది. ఇంతకీ అమర్, ఐశ్వర్య ఎలా కలిశారు. అమర్ అక్బర్ అండ్ ఆంటోనిగా శత్రువులను ఎలా టార్గెట్ చేశాడు అన్నది ఈ సినిమా కథ.

సినిమాలో రవితేజ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడు. అయితే మాట తీరు తప్ప మూడు పాత్రల్లో రవితేజ ఒకే విధంగా కనిపిస్తారు. పాత్రల తీరు తెన్నులు రవితేజ ఎనర్జీని చూపించడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఇలియానా ఎప్పటిలానే మెరిసింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు తనే డబ్బింగ్ చెప్పడం విశేషం. విలన్స్ గా నటించిన వారు ఏదో అలా చేశారు. తరుణ్ అరోరా ఓకే అనిపించాడు. పోలీస్ గా చేసిన అభిమన్యు సింగ్ బాగానే చేశాడు. ఇక కమెడియన్స్ సునీల్, వెన్నెల కిశోర్, సత్య, రఘు బాబు, శ్రీనివాస్ రెడ్డి, జయప్రకాశ్ రెడ్డి కామెడీ అంతగా ఆకట్టుకోలేదు. షయాజి శిండే ఎప్పటిలానే నటన కనబరిచాడు. 

వెంకట్ దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మొత్తం యూఎస్ లో బాగా అందంగా షూట్ చేశారు. ఇక తమన్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి. బిజిఎం ఓకే. ఎం.ఆర్ వర్మ ఎడిటింగ్ ఇంకాస్త జాగ్రత్త పడాల్సిందిగా అనిపిస్తుంది. ఓ రొటీన్ రివెంజ్ డ్రామాని హీరోకి, హీరోయిన్ కు డిజార్డర్ అని పెట్టి అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేశాడు. తాను అనుకున్నట్టుగా కథ, కథనాలను సాగించిన శ్రీను వైట్ల ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయాడు. మైత్రి మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

హీరో, హీరోయిన్ ఒకే ఫ్యామిలీలా ఉండే ఇద్దరు స్నేహితుల వారసులు. వారి తల్లిదండ్రులు పార్ట్ నర్స్ గా అనుకున్న వారి ద్వారా వారు చంపబడతారు. ఎలాగోలా వారి నుండి తప్పించుకున్న హీరో, హీరోయిన్ విడిపోతారు. చిన్నప్పుడు కావడం వల్ల పెద్దయ్యాక వాళ్లు పక్క పక్కనే ఉన్నా వీళ్లు చిన్ననాటి స్నేహితులు అని తెలియదు. ఇక తన స్నేహితురాలిని కనిపెట్టి శత్రువులను చంపడమే హీరో పని.

రొటీన్ రివెంజ్ డ్రామాకి హీరో, హీరోయిన్ ఇద్దరికి ఓ డిజార్డర్ అని పెట్టి శ్రీను వైట్ల కొత్తగా చేసినా సినిమా చాలా హడావిడిగా అనిపించడం వల్ల సగటు ప్రేక్షకుడికి అర్ధం కాలేదని చెప్పాలి. అంతేకాదు సినిమాలో అనుకున్నంత కామెడీ లేకపోవడం ఉన్న కామెడీ చిరాకు తెప్పించడం జరిగింది. సునీల్, సత్య, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు లాంటి పాత్రలున్నా సినిమాలో కామెడీ పండలేదు. అంతేకాదు రవితేజ, ఇలియానాల మధ్య రొమాన్స్ కు కూడా ఛాన్స్ లేకుండా చేశాడు. 

స్క్రీన్ ప్లే విషయంలో శ్రీను వైట్ల చాలా పొరపాట్లు చేశాడని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ పెద్దగా ఆకట్టుకోలేదు.. సెకండ్ హాఫ్ కాస్త ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టినా పెద్దగా ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ కూడా ఆశించినంతగా లేదు. మొత్తానికి శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని మళ్లీ నిరాశపరచింది. 


రవితేజ, ఇలియానా, శ్రీను వైట్ల,నవీన్ యేర్నేని, వై రవి శంకర్, మోహన్ చెరుకూరి, ఎస్ థమన్అమర్ అక్బర్ ఆంటోని.. శ్రీను వైట్ల, రవితేజ మెప్పించలేని ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: