కెమెరా వర్క్ లీడ్ పెయిర్ రొమాన్స్కెమెరా వర్క్ లీడ్ పెయిర్ రొమాన్స్స్లో నరేషన్ రొటీన్ స్టోరీ మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

చిల్డ్రన్ ఫిల్మ్ మేకర్ అయిన ఆనంద్ (ఆదిత్ అరుణ్) పిల్లల సమస్యలతో చేసే సినిమా కోసం క్రౌడ్ ఫండింగ్ చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో మాస్ కమ్యునికేషన్స్ చేసిన శ్రీలక్ష్మి (హెబ్భా పటేల్) ఆనంద్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు.

అయితే ఆనంద్ తనను పెళ్లాడుతాడని నమ్మిన హెబ్భా పటేల్ అతనితో చాలా దూరం వెళ్తుంది. అదే సమయంలో ఆనంద్ కు ఇలాంటివి కామన్ అని తెలిసి అతనికి దూరమవుతుంది. ఇంతకీ ఆనంద్, శ్రీలక్ష్మిని నిజంగా ప్రేమించాడా..? ఆనంద్, శ్రీలక్ష్మిల లవ్ ఎలా ముగిసింది అన్నది సినిమా కథ.

ఆదిత్ అరుణ్ తన పాత్ర వరకు బాగానే చేశాడు. ఆనంద్ పాత్రలో అతను చక్కగా ఒదిగిపోయాడు. ఇక శ్రీలక్ష్మి పాత్రలో హెబ్భా మళ్లీ యూత్ ఆడియెన్స్ ను మెప్పించే ప్రయత్నం చేసింది. సినిమాలో ఇద్దరి మధ్య రొమాన్స్ అదిరిపోయింది. ఇక నరేష్, రావు రమేష్ ల పాత్రలు అలరించాయి. 

జాయ్ బారువా మ్యూజిక్ జస్ట్ ఓకే. బిజిఎం కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఉదయ్ సినిమాటోగ్రఫీ కొంతమేరకు బెటర్ అని చెప్పొచ్చు. ఇక రొటీన్ కథ, కథనాలతో సినిమా మొత్తం విసుగు తెప్పించేలా చేశాడు అయోధ్యా కుమార్. 24 కిస్సెస్ అని టైటిల్ పెట్టినందుకు హీరో, హీరోయిన్ మధ్య కిస్సులు పెట్టాడు తప్ప సినిమాలో అసలు మ్యాటర్ ఏం లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనేలా ఉన్నాయి.

మిణుగురులు లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమా చేసిన అయోధ్యా కుమార్ 24 కిస్సెస్ అంటూ ఓ ప్రయోగం చేస్తున్నాడు అనుకుంటే. రెగ్యులర్ కథనే 24 కిస్స్ అనే టైటిల్ పెట్టి లీడ్ పెయిర్ మధ్య లిప్ లాక్స్ తప్ప సినిమాలో పెద్దగా మ్యాటర్ ఏం లేకుండా చేశాడు. సినిమా కథ, కథనాలే కాదు రాసుకున్న సీన్స్ ఏమాత్రం ఆసక్తికరంగా సాగవు.


లీడ్ పెయిర్ మధ్య ముద్దులాట కూడా విరక్తి వచ్చేలా చేస్తుంది. సగదీసిన కథనం ఆడియెన్స్ పేషెన్సీని టెస్ట్ చేస్తుందని చెప్పొచ్చు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా కిస్సులతో సినిమా హిట్ కొట్టొచ్చని వచ్చిన ఈ 24 కిస్సెస్ మూవీ కేవలం మూతి ముద్దులు ఉంటే సరిపోదు దానికి తగిన కథ కావాలని తెలిసేలా చేశారు. 


సినిమా మొదటి భాగం రెండు భాగం రెండిటికి రెండు కథనం నెమ్మదిగా సాగుతుంది. ఎంటర్టైన్ మెంట్ ఏదైనా ఉందా అంటే అది లేదు. ఫైనల్ గా యూత్ ఆడియెన్స్ కోసం వచ్చిన 24 కిస్సెస్ వారిని మెప్పించడంలో విఫలమైందని చెప్పొచ్చు.
అదిత్ అరుణ్, హెబ్బా పటేల్, సంజయ్ రెడ్డి,అనిల్ పల్లాల, అయోద్య కుమార్ కృష్ణంశెట్టి, జోయ్ బరువా24 కిస్సెస్.. అవార్డ్ విన్నర్ డైరక్టర్ నిరాశపరిచే ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: