కాజల్ గ్లామర్ షో, యాక్షన్ సీన్స్కాజల్ గ్లామర్ షో, యాక్షన్ సీన్స్స్క్రీన్ ప్లే, మ్యూజిక్, ఎడిటింగ్
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన విజయ్ (బెల్లంకొండ శ్రీనివాస్) తన డ్యూటీని తాను సక్రమంగా చేస్తుంటాడు. సంయుక్త (కాజల్ అగర్వాల్) ను ప్రేమిస్తున్న విజయ్ సడెన్ గా ఓ రోజు ఆమె అదృశ్యం అవుతుంది. ఆమెని వెతికే క్రమంలో కిడ్నాప్ కాబోతున్న మరో హీరోయిన్ మెహ్రీన్ ను కాపాడతాడు. అయితే కొన్ని పరిణామాల వల్ల విజయ్ కిడ్నాపర్ గా నింద పడుతుంది. ఓ పక్క తన మీద పడిన నింద పోగొట్టుకోవడంతో పాటుగా కనిపించకుండా పోయిన సంయుక్తని మళ్లీ విజయ్ ఎలా కనిపెట్టాడు అన్నది సినిమా కథ. 



బెల్లంకొండ శ్రీనివాస్ నటన బాగుంది. సినిమా సినిమాకు అతను పరిణితి చెందుతున్నాడనిపిస్తుంది. ఇక కాజల్ అగర్వాల్ గ్లామర్ షో బాగుంది. ఆమె నటన ఆకట్టుకుంది. మెహ్రీన్ కౌర్ కూడా ఇంప్రెస్ చేసింది. ఇక సినిమాలో విలన్ నీల్ నితిన్ ముఖేష్ విలనిజం బాగుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.



చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీన్స్ లో చోటా తన పనితనం చూపించాడు. తమన్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. సాంగ్స్ అలరించలేదు. బిజిఎం ఓకే. శ్రీనివాస్ మామిళ్ల కథ బాగానే రాసుకున్నా కథనం ఆకట్టుకునేలా లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.


తెలుగు సినిమా పరిశ్రమలో పోలీస్ పాత్రలకు సూపర్ క్రేజ్ ఉంటుంది. పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్లు కూడా పోలీస్ కథతోనే సృష్టించాయి. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ గా మెప్పించాడు. అయితే కథ బాగున్నా దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల కథనం ఆకట్టుకునేలా లేదు. సినిమా అంతా ఊహించినట్టుగా సన్నివేశాలు వస్తుంటాయి.


సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఎంటర్టైన్ చేసినా సెకండ్ హాఫ్ మాత్రం సాగదీసినట్టు అనిపిస్తుంది. సినిమాలో కాజల్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. శ్రీనివాస్, కాజల్ పెయిర్ సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. దర్శకుడు రాసుకున్న కథ బాగున్నా స్క్రీన్ ప్లే విషయంలో తేడా కొట్టేసింది.


రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్ కు నచ్చే అవకాశం ఉంది. కథ బాగున్నా దర్శకుడు సాగించిన కథనం రొటీన్ సినిమాల మాదిరి అనిపిస్తుంది. 



బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్, మెహ్రీన్,శ్రీనివాస్ మామిళ్ళ,నవీన్ సొంటినేని (నాని) బెల్లంకొండ శ్రీనివాస్ 'కవచం'.. కొంచం ఇష్టం కొంచం కష్టం..!

మరింత సమాచారం తెలుసుకోండి: