డైలాగ్స్ ఎమోషన్ రొమాన్స్డైలాగ్స్ ఎమోషన్ రొమాన్స్రొటీన్ స్టోరీ అధిక రక్తపాతం మ్యూజిక్
రాయలసీమ ప్రాంతంలో సుబ్బారెడ్డి దగ్గర పనిచేస్తుంటాడు భైరవ (ధనుంజయ్). సుబ్బారెడ్డి కూతురు గీత (ఇర్రా మోర్) మీద శత్రువుకు ఎటాక్ చేయగా వారి నుండి భైరవ ఆమెను కాపాడతాడు. అప్పటి నుండి భైరవని ప్రేమిస్తుంది గీత.

ఈ విషయం తెలుసుకున్న సుబ్బారెడ్డి గీతను కట్టారెడ్డికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. భైరవ తల్లిని, స్నేహితులను అంతం చేస్తాడు. దీనితో పగ పెంచుకున్న భైరవ సుబ్బారెడ్డిని ఎలా ఎదుర్కున్నాడు..? సుబ్బారైడ్డిని భైరవ ఏం చేశాడు..? అన్నదే సినిమా కథ.

భైరవ పాత్రలో ధనుంజయ్ ఆకట్టుకున్నాడు. సినిమాలో అతను చాలా ఎమోషనల్ గా కనిపిస్తాడు. ఇర్రా మోర్ కూడా బాగానే చేసింది. రొమాంటిక్ సీన్స్ ఇద్దరు అదరగొట్టారు. సుబ్బారెడ్డి, కట్టారెడ్డి పాత్రలో నటించిన వాళ్లు బాగానే చేశారు. మిగతా పాత్రలంతా పరిధి మేరకు నటించి మెప్పించారు.

జగదీష్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. రాజివి సినిమాల్లో కెమెరా వర్క్ బాగుంటుందని తెలిసిందే. ఇక రవి శంకర్ మ్యూజిక్ సోసోగానే ఉంది. కథ, కథనాల్లో దర్శకుడు సిద్ధార్థ్ తన ప్రతిభ కనబరిచాడు. అయితే కథ రొటీన్ గా అనిపించడంతో కథనం కూడా పెద్దగా గొప్పగా ఆకట్టుకోలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు.
పెద్దింటి పిల్లని.. పేదింటి కుర్రాడు ప్రేమిస్తే.. ఆ తర్వాత జరిగే పరీణామాలు ఏంటో ఎన్నో సినిమాల్లో చూపించారు. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి దగ్గర పనిచేసే హీరో యజమాని కూతురిని ప్రేమించడం.. అతనికి విషయం తెలిసి హిం స మొదలు పెట్టడం.. దానికి హీరో హీరోయిన్ తండ్రికి బుద్ధి చెప్పడం.. ఇదే రొటీన్ కథతో సినిమా వచ్చింది.


వయిలెన్స్, రొమాన్స్ కలిసి భైరవగ గీత సినిమాలో ఉన్నాయి. అయితే కథలో కాస్త కొత్తదనం ఉంటే తప్పకుండా దర్శకుడు సత్తా చాటేవాడు అని అతను ఈ కథను డీల్ చేసిన విధానం చూస్తే అర్ధమవుతుంది. సినిమా అంతా ఒకే ఫ్లోలో వెళ్లడం కాస్త ఇబ్బంది కరంగా ఉంటుంది. 


దర్శకుడు ఒకవర్గం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ సినిమా చేశాడనిపిస్తుంది. ఏ సెంటర్ ఆడియెన్స్ కు భైరవ గీత నచ్చే అవకాశం లేదు. బి,సి సెంటర్స్ లో అది కంటెంట్ కు కనెక్ట్ అయిన వారు ఎంజాయ్ చేస్తారు. ఫైనల్ గా రాం గోపాల్ వర్మ ప్రొడక్ష లో ఆశించిన స్థాయిలో భైరవ గీత లేదని చెప్పొచ్చు.
ధనుంజయ్, ఇర్రా మోర్, రాంగోపాల్ వర్మ, సిద్దార్థ,రవిశంకర్భైరవగీత.. వర్మ ఫ్యాక్టరీ తరహా మూవీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: