కాస్ట్ అండ్ క్రూ సినిమాటోగ్రఫీ మ్యూజిక్కాస్ట్ అండ్ క్రూ సినిమాటోగ్రఫీ మ్యూజిక్అక్కడక్కడ స్లో అవడం మిస్సింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్

ఇండియన్ స్పేస్ సెంటర్ నుండి వెళ్లిన మిహిర శాటిలైట్ ట్రాక్ తప్పడంతో దాని వల్ల ప్రపంచ కమ్యునికేషన్ వ్యవస్థ దెబ్బ తింటుందని ఇండియన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ దాన్ని మళ్లీ డీ కోడ్ చేసేందుకు దేవ్ (వరుణ్ తేజ్)ను వెనక్కి పిలుస్తాడు. అయితే అంతకుముందే విప్రయాన్ అనే శాటిలైట్ ను వదిలిన దేవ్ అది ఫెయిల్ అవడంతో పాటుగా తాను ఎంతో ప్రేమించిన పారు (లావణ్య త్రిపాఠి) దూరమవడంతో స్పేస్ సెంటర్ వదిలి రామేశ్వరంలో స్కూల్ లో పాఠాలు చెబుతూ ఉంటాడు. ఎలాగోలా మిహిర కోసం అతన్ని ఒప్పించి తీసు కొస్తుంది రియా (అదితి రావు) అలా వచ్చిన దేవ్ మిహిర శాటిలైట్ ను ఎలా వర్క్ చేసేలా చేశాడు. ఇక తను ఎంతగానో కలలు కన్న విప్రయాన్ ప్రాజెక్ట్ ను దేవ్ ఎలా కనిపెట్టాడు. దాని కోసం అతంకు ఎంత రిస్క్ చేశాడు అన్నది సినిమా కథ.

దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ అదరగొట్టాడు. సినిమా సినిమాకు వరుణ్ తన క్యారక్టరైజేషన్ ఎంచుకుంటున్న తీరు అద్భుతంగా ఉంది. దేవ్ గా వరుణ్ మంచి నటన కనబరిచాడు. ఇక రియాగా అదితి రావు మరోసారి తన ప్రతిభ చూపించగా.. పారుగా లావణ్య త్రిపాఠి ఉన్నంతసేపు బాగానే చేసింది. ఇక అవసరాల శ్రీనివాస్, రహమన్, సత్యదేవ్, రాజు బాగానే చేశారు. 

ఇలాంటి సినిమాలకు టెక్నికల్ సపోర్ట్ చాలా అవసరం. అంతరిక్షం అద్భుత మైన టెక్నికల్ టీం తో వర్క్ వచ్చింది. ప్రశాన్ ఆర్. విహారి మ్యూజిక్ బాగుంది. బిజిఎం కూడా సినిమాకు తగినట్టుగా బాగా ఇచ్చాడు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు కెమెరా వర్క్ పెద్ద ప్లస్ పాయింట్. కథ, కథనాలు దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఇదవరకు తెలుగు సినిమా మీద చూడని అద్భుతాన్ని చూపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
అసలేమాత్రం తెలుగు ప్రేక్షకులకు అనుభవం లేని స్పేస్ కాన్సెప్ట్ కథతో వచ్చాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. మొదటి సినిమా ఘాజితోనే అతని సత్తా తెలిసింది. ఇప్పుడు అంతరిక్షం అంటూ స్పేస్ కాన్సెప్ట్ సినిమా చేశాడు. సినిమాలో కథ, కథనాలు తెలుగు ప్రేక్షకులు కోరుకునే కొత్త పంథాలో సాగుతుంది. 


ప్రతి నిమిషం ఉత్కంఠతతో సినిమా నడుస్తుంది. ముఖ్యంగా ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయి. తెలుగు తెర మీద ఎలాంటి అద్భుతాలు కూడా చేయొచ్చని మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. సంకల్ప్ రెడ్డిని ఈ విషయంలో తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. పర్ఫెక్ట్ కాస్ట్ తో వచ్చిన అంతరిక్షం ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగిస్తుంది.


మొదటి భాగం కాస్త స్పీడ్ గా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చూసే ఆడియెన్స్ కు అంతరిక్షం నచ్చుతుంది. మాస్ ఆడియెన్స్ కూడా ఈ సినిమాను మెచ్చే అవకాశం ఉంది. 
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి,అతిథి రావు, సంకల్ప్ రెడ్డి,వై రాజీవ్ రెడ్డి అంతరిక్షం.. సంకల్ప్ మరో అద్భుత సినిమా..!

మరింత సమాచారం తెలుసుకోండి: