లీడ్ పెయిర్ నటన మ్యూజిక్ సినిమాటోగ్రఫీలీడ్ పెయిర్ నటన మ్యూజిక్ సినిమాటోగ్రఫీసెకండ్ హాఫ్ స్లో నరేషన్

కలకత్తాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఖాళీగా తిరుగుతున్న సూర్య (శర్వానంద్)కు మెడిసిన్ చేస్తున్న వైశాలి (సాయి పల్లవి)ని చూసి ప్రేమిస్తాడు. ఆమె వెంటే తిరుగుతూ ఆమెను కూడా తన ప్రేమలో పడేస్తాడు. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో తన ప్రేమకు తానే శత్రువుగా మారుతాడు సూర్య. అప్పటి నుండి సూర్య, వైశాలిలు దూరమవుతారు. అసలు సూర్య, వైశాలి ఎందుకు దూరమయ్యారు. వారు మళ్లీ కలిశారా.. దూరమవడానికి కారణం ఏంటి.. అన్నది సినిమా కథ.

సూర్య పాత్రలో శర్వానంద్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా చేశాడు. సాయి పల్లవి నటన బాగుంది. కొన్ని సీన్స్ లో శర్వానంద్ ను డామినేట్ చేసింది అమ్మడు. ప్రియదర్శి మెప్పించాడు. మురళి శర్మ, సంపత్ పెద్దగా ఆకట్టుకోలేదు. వెన్నెల కిశోర్, సునీల్ లాంటి వారు ఉన్నా పెద్దగా వాడుకోలేదు. ప్రియా రామన్, అజయ్ పాత్రలు ఓకే అనెలా ఉన్నాయి. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ బాగుంది. లవ్ స్టోరీకి కావాల్సిన మ్యూజిక్ ఇచ్చాడు. జేకే సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. కలకత్తాలో అందమైన లొకేషన్స్ చూపించాడు. ఇక సినిమా కథ పెద్దగా ఆకట్టుకోలేదు. కథనం కూడా హను మరోసారి దారి తప్పాడని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొదటిసారి అయినా చెరుకూరి సుధాకర్ అభిరుచి గల నిర్మాతగా అనిపించారు.

అందాల రాక్షసి సినిమా నుండి పడి పడి లేచె మనసు వరకు హను సినిమాలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయి. ఈ సినిమాలో కూడా శర్వా, సాయి పల్లవిల లవ్ సీన్స్ బాగున్నాయి. అయితే సినిమా సెకండ్ హాఫ్ ఎప్పుడు మొదలైందో అప్పుడు ట్రాక్ తప్పేసుంది. మొదటి భాగం బాగా తీసుకెళ్లిన దర్శకుడు సెకండ్ హాఫ్ తేల్చేశాడు.

ఆమెను ప్రేమలో పడేంతవరకు ఆమె చుట్టే తిరిగిన హీరో పెళ్లి మాత్రం వద్దని అంటాడు. స్వయంవరంలో వేణులా సడెన్ షాక్ ఇస్తాడన్నమాట. అయితే దానికి తన ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ కారణమని తెలుస్తుంది. అయితే ఈ కన్ ఫ్లిక్ట్స్ ఆడియెన్స్ కు నచ్చేలా ఉండవు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా మొదటి సగం మెప్పించిన హను సెకండ్ హాఫ్ మాత్రం చెడగొట్టాడని చెప్పొచ్చు.



శర్వానంద్, సాయి పల్లవి, హను రాఘవపుడి, ప్రసాద్ చుక్కపల్లి, విశాల్ చంద్రశేఖర్పడి పడి లేచె మనసు.. హను మరోసారి ఫెయిల్ అయ్యాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: