సుమంత్, సినిమాటోగ్రఫీసుమంత్, సినిమాటోగ్రఫీప్రొడక్షన్ వాల్యూస్, స్క్రీన్ ప్లే, ఫస్ట్ హాఫ్
ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఉండే నిషిత్ (సుమంత్) నైట్ రిపోటర్ గా జాయిన్ అవుతాడు. అయితే రిపోర్టర్ గా తను చేయాల్సిన పని కాకుండా రాత్రి జరిగే సంఘటనలను షూట్ చేసి వేరే ఛానెల్స్ కు అమ్ముకుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు మహతి (అంజు కురియన్) తండ్రి హత్య చేయబడతాడు. హత్యను షూట్ చేసిన హీరో దాని ద్వారా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. కాని ఇక్కడ హీరో కూడా రిస్క్ లో పడతాడు. అతనికి సవాళ్లు ఎదురవుతాయి. వాటిని అధిగమించి తన సమస్యల నుండి ఎలా బయటపడ్డాడు అన్నది సినిమా కథ.



నిషిత్ పాత్రలో సుమంత్ ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నాడు. క్రైం జానర్ సినిమా కాబట్టి కాస్త కొత్తగా ఉంటుంది. ఇక హీరోయిన్ అంజు కురియన్ నటన అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ పెద్దగా మెప్పించలేదని చెప్పాలి. సత్య పాత్ర పెద్దగ నవ్వించలేదు. శివాజి రాజా తన పాత్రకు న్యాయం చేశాడూ.



శ్రీచరణ్ పాకాల సంగీతం సోసోగానే ఉంది. బిజిఎం జస్ట్ ఓకే. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. కెమెరా వర్క్ అక్కడక్కడ బాగుంది అనిపిస్తుంది. గ్యారీ ఎడిటింగ్ ఇంకాస్త బాగా చేయాల్సింది. అనీల్ శ్రీకంఠం డైరక్షన్ ఒకే కాని కథ బాగానే రాసుకున్నా దాన్ని సాగించిన విధానం బాగాలేదు. కథనం ఇంకా బాగా రాసుకుని ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.



క్రైం థ్రిల్లర్ సినిమాలకు కావాల్సింది ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెంచి తర్వాత ఏం జరుగబోతుంది అన్న ఎక్సైట్ మెంట్ కలిగేలా చేయాలి. కాని ఇదం జగత్ సినిమా ఆ జానర్ కు సంబందించిన సినిమానే అయినా ఇలాంటి థ్రిల్స్ ఏమి ఉండవు. కథ కొంతమేరకు బాగానే ఉందని అనిపిస్తున్నా కథనంలో దర్శకుడు అనీల్ శ్రీకంఠం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.


సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పెద్దగా లేవని చెప్పుకోవాలి. ఎంచుకున్న పాయింట్ తెరకెక్కించడంలో తప్పటడుగులు వేశాడు అనీల్. కాస్టింగ్ విషయంలో కూడా పెద్దగా దృష్టి పెట్టలేదని చెప్పాలి. హీరో, హీరోయిన్ లవ్ సీన్స్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. హీరోయిన్ అంజు కురియన్ అంత మంచి స్క్రీన్ ప్రెజెన్స్ కలిగిలేదు.


సుమంత్ కాస్త బెటర్ గా పర్ఫాం చేసినా అందుకు తగిన కథ, కథనాలు లేకపోవడంతో పెద్దగా ఉపయోగం అనిపించదు. సినిమా టైటిల్ టీజర్ ఏర్పరచిన క్యూరియాసిటీ సినిమాలో ఏమాత్రం లేదని చెప్పాలి. మళ్లీ రావాతో హిట్ ట్రాక్ ఎక్కినట్టు అనిపించిన సుమంత్ సుబ్రహ్మణ్యపురం, ఇదం జగత్ రెండు సినిమాలతో నిరాశ పరచాడు.



సుమంత్, అంజు కురియన్, అనీల్ శ్రీ కంఠం, జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌, శ్రీచరణ్ పాకలఇదం జగత్.. సుమంత్ మరో ఫెయిల్యూర్ అటెంప్ట్..!

మరింత సమాచారం తెలుసుకోండి: