బాలకృష్ణ నటన, సినిమాటోగ్రఫీ, కీరవాణి మ్యూజిక్బాలకృష్ణ నటన, సినిమాటోగ్రఫీ, కీరవాణి మ్యూజిక్అక్కడక్కడ స్లో అవడం, కొన్ని విషయాలను ప్రస్థావించకపోవడం
ఎన్.టి.ఆర్ జీవిత చరిత్ర కొందరికి తెరచిన పుస్తకం. అయితే ఆయన జీవిత కథలో ఎవరికి తెలియని విషయాలతో పాటుగా తెలుగు తెర మీద తెలుగు రాజకీయాలపై ఆయన వేసిన ముద్ర చూపించే ప్రయత్నంగా ఎన్.టి.ఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తండ్రి బయోపిక్ చేశాడు. రెండు పార్టులుగా వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్యాన్సర్ పడిన బసవతారకం తనయుడు హరికృష్ణకి చెబుతూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. స్వాతంత్రం తర్వాత రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్న ఎన్.టి.ఆర్ అక్కడ అవినీతిని చూసి రాజీనామా చేసి వస్తాడు. ఇక ఎల్వి ప్రసాద్ గారు ఇచ్చిన లేఖ ద్వారా ఆయన్ను కలిసేందుకు మద్రాస్ వెళ్తాడు. ఇక అక్కడ మొదలైన ఎన్.టి.ఆర్ సిని ప్రస్థానం ఎలాసాగింది. ప్రజలు తన మీద చూపిస్తున్న అభిమానం ఎలా వారికి తిరిగివ్వాలనుకున్నాడో అన్నది సినిమా కథ. 


ఎన్.టి.ఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించరు అనడం కన్నా జీవించారని చెప్పొచ్చు. సినిమా మొదటి నుండి చివరి వరకు తండ్రి పాత్రను ఆయన ఎంతో క్రమశిక్షణతో చేశారు. సినిమా కోసం బాలకృష్ణ ఎంత కష్టపడ్డాడో సినిమా చూస్తే తెలుస్తుంది. ఇక బసవతారకం పాత్రలో విద్యా బాలన్ కూడా మెప్పించింది. తన సహజమైన నటనతో ఆమె ఆ పాత్రకు పర్ఫెక్ట్ సూట్ అయ్యింది. ఏయన్నార్ గా సుమంత్ అదరగొట్టాడు. ఎన్.టి.ఆర్, ఏయన్నార్ లుగా బాలకృష్ణ, సుమంత్ బాగా చేశారు. హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రాం పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. చంద్రబాబు నాయుడు పాత్రలో రానా కూడా బాగా చేశాడు. అయితే కథానాయకుడులో రానా సీన్స్ రెండు మూడు మాత్రమే ఉన్నాయి. ఇక ప్రకాశ్ రాజ్, మురళి శర్మ, సాయి మాధవ్ బుర్ర, బ్రహ్మానందం అందరు బాగా చేశారు. హీరోయిన్స్ గా పాటల్లో మెరిసిన రకుల్, హాన్సిక, పాయల్ మెప్పించారు.


జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకు మేజర్ పలస్ అని చెప్పాలి. ఎన్.టి.ఆర్ పాత్రలో బాలకృష్ణని అందంగా చూపించడంలో కెమెరా మెన్ సూపర్ సక్సెస్ అయ్యాడు. కీరవాణి మ్యూజిక్ కూడా అలరించింది. బిజిఎం సినిమాకు ప్రధాన బలమని చెప్పొచ్చు. డైలాగ్స్ సాయి మాధవ్ బుర్ర మరోసారి తన పెన్ పవర్ చూపిచాడు. క్రిష్ డైరక్షన్ ఎన్.టి.ఆర్ కథ చెప్పిన విధానం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.



ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా అనగానే అసలు ఈ సినిమాలో ఏం చెబుతారు అన్న ఎక్సైటింగ్ ఎక్కువగా ఉంటుంది. రెండు పార్టులుగా వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు అంచనాలను అందుకుందని చెప్పొచ్చు. ఎన్.టి.ఆర్ సిని రంగ ప్రవేశం.. అక్కడ జరిగిన విషయాలు.. ఆ తర్వాత అప్రతిహాతంగా ఆయన కొనసాగించిన ప్రస్థానం అంతా బాగా చూపించారు. సినిమాలో ఎన్.టి.ఆర్ గా బాలకృష్ణ మొదటి భాగం కన్నా సెకండ్ హాఫ్ లో అదరగొట్టాడు.


ఎన్.టి.ఆర్ సిని ప్రస్థానం చూపిస్తూనే సినిమాకు కావాల్సిన ఆ మ్యాజిక్ చేశాడు క్రిష్. అందులో ఒకటి ఎన్.టి.ఆర్ శ్రీకృష్ణుడిగా చూపించిన సీన్. బాలకృష్ణ ఆ పాత్రలో పెద్దాయన్ను తలపించాడు. అంతేకాదు ఆ సీన్ సినిమా హైఎల్ట్స్ లో ఒకటని చెప్పొచ్చు. ఇక ప్రజల సమస్యల మీద ఎన్.టి.ఆర్ దృష్టి.. చివరకు పార్టీ స్థాపన ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాలో ప్రధాన హైలెట్స్ గా చెప్పుకోవచ్చు.


మహానటి తర్వాత అంత ఇంప్యాక్ట్ కలిగించేలా ఎన్.టి.ఆర్ బయోపిక్ చేశాడు క్రిష్. నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు సిని అభిమాని.. ఎన్.టి.ఆర్ గురించి తెలుసుకునేలా ఈ సినిమా ఉంది. బాలకృష్ణ నటన, క్రిష్ డైరక్షన్, సాఇ మాధవ్ డైలాగ్స్, కీరవాణి మ్యూజిక్ సినిమాకు ప్రాణమని చెప్పొచ్చు.



బాలకృష్ణ, విద్యాబాలన్, రానా, సుమంత్, రకూల్ ప్రీత్ సింగ్, క్రిష్, ఎం ఎం కీరవాణి ఎన్.టి.ఆర్ కథానాయకుడు.. మెప్పించిన ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: