రజినికాంత్ స్టైల్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ రజినికాంత్ స్టైల్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, మెలోడ్రామా
హాస్టల్ వార్డెన్ గా పనిచేస్తున్న కాళి (రజినికాంత్) అక్కడ ఓ ప్రేమ జంటకు హెల్ప్ చేస్తుంటాడు. అన్వర్ తో సాన్నిహితంగా ఉంటున్న కాళిని అక్కడ రౌడీ గ్యాంగ్ ఎటాక్ చేస్తుంది. అయితే కాళి అసలు కథ ఏంటి.. అతను ఎందుకు అక్కడకు వచ్చాడు. అన్వర్ కు కాళికి ఉన్న రిలేషన్ ఏంటి అన్నది ఫ్లాష్ బ్యాక్ ద్వారా రివీల్ అవుతుంది. పెట్ట వీరగా ఉన్న హీరో కాళిగా ఎందుకు మారాల్సి వచ్చింది..? తన వాళ్లను కోల్పోయిన పెట్ట వీర శత్రువులను ఎలా మట్టుపెట్టాడు అన్నది సినిమా కథ. 



సూపర్ స్టార్ రజినికాంత్ పేట సినిమాలో చాలా స్టైలిష్ గా ఉన్నారు. సినిమా కేవలం రజిని స్టైల్ కోసమే అన్నట్టుగా ఉంది. మునుపటి సినిమాల కన్నా కాస్త యవన్నంగా కనిపించారు. సిమ్రాన్, త్రిషల నటన బాగుంది. శషి కుమార్ ఓకే అనిపించాడు. నవాజుద్ధీన్ సిద్ధిఖి, విజయ్ సేతుపతి తమ పాత్రలకు న్యాయం చేశారు. మేఘా ఆకాష్ కూడా క్యూట్ గా కనిపిస్తుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.  



తిరు సినిమాటోగ్రఫీ బాగుంది. రజినిని స్టైలిష్ గా చూపించడంలో కెమెరా వర్క్ బాగుంది. అనిరుధ్ మ్యూజిక్ ఓకే. బిజిఎం బాగా ఇచ్చాడు. అయితే తెలుగు ప్రేక్షకులకు ఈ సాంగ్స్ నచ్చే అవకాశం లేదు. కథ, కథనాల్లో దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు ఏమాత్రం కొత్తదనం లేకుండా చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.



పిజ్జా, జిగరు తండా సినిమాలతో దర్శకుడిగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కార్తిక్ సుబ్బరాజు సూపర్ స్టార్ రజినితో చేసిన సినిమా పేట. రజిని హార్డ్ కోర్ ఫ్యాన్ అవడం వల్ల అతన్ని 90ల్లో ఆయన చూపించిన వీరత్వం చూపించాలని అలాంటి కథతోనే వచ్చాడు కార్తిక్ సుబ్బరాజు. అయితే సినిమా కథ మాత్రమే కాదు కథనం కూడా అప్పటిలానే సాగించాడు.


ఆసక్తికరంగా సాగించాల్సిన కథనం చాలా నీరసంగా సాగుతుంది. సినిమాలో ఒక్క రజిని స్టైల్ తప్పించి చెప్పుకోడానికి ఏమి ఉండదు. రజిని బొమ్మ చూపించి సినిమా ఆడించేద్దాం అంటే ఎలా కుదురుతుంది చెప్పండి. కార్తిక్ సుబ్బరాజు రజిని మీద పెట్టిన ఫోకస్ కాస్త కథ కథనాల మీద పెట్టి ఉంటే బాగుండేది. మొదటి భాగం పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ ఇంకా దారుణంగా చేశాడు.


యువ దర్శకుడితో రజిని సినిమా కచ్చితంగా కొత్త ఉత్సాహం ఇస్తుదని అనుకున్నారు. కాని రొటీన్ కథతో కార్తిక్ నిరాశపరచాడు. తెలుగులో వచ్చినా తమిళ నేటివిటీకి తగినట్టుగా ఉండటం వల్ల ఇక్కడ సినిమా వర్క్ అవుట్ అవదని చెప్పొచ్చు. తమిళంలో కూడా పేట రజిని ఫ్యాన్స్ కు తప్ప మిగతా వారికి నచ్చే అవకాశం లేదు.



రజినీకాంత్, సిమ్రాన్, త్రిష, విజయ్ సేతుపతి, కార్తిక్ సుబ్బరాజు, అనిరుథ్పేట.. రజిని ఫెయిల్యూర్ కంటిన్యూస్..!

మరింత సమాచారం తెలుసుకోండి: