రాం చరణ్, సినిమాటోగ్రఫీ, బిజిఎం, రాం చరణ్, సినిమాటోగ్రఫీ, బిజిఎం, రొటీన్ స్టోరీ, ఫుల్ కన్ ఫ్యూజన్ స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్
అనాథలైన నలుగురు పిల్లలకు ఓ పసివాడు దొరుకుతాడు. అతన్ని వారు పెంచుకుంటారు. ఆ నలుగురు కుర్రాళ్ల మీద రౌడీలు ఎటాక్ చేయగా అందరి కన్నా చిన్నవాడైనా సరే ఆ పిల్లాడు వారిని కాపాడుతాడు. అప్పటినుండి అతను చదువు మానేసి అన్నయ్యలు నలుగురి చదువు కొనసాగేలా చేస్తాడు. వారికి ఎలాంటి కష్టం వచ్చినా రాం కొణిదల (రాం చరణ్) ముందుంటాడు. రాము పెద్ద అన్నయ్య భువన్ కుమార్ (ప్రశాంత్) ఎలక్షన్ కమీషన్ లో పనిచేస్తుంటాడు. వైజాగ్ ఏరియాలో పందెం పరశురాం భువన్ ను బెదించగా అతనికి గట్టి వార్నింగ్ ఇస్తాడు రాము. భువన్ ను బీహార్ ఎలక్షన్స్ కు వెళ్తాడు. అక్కడ రాజ భాయ్ (వివేక్ ఓబేరాయ్)ని ఎదురిస్తాడు భువన్ కుమార్. రాజ భాయ్ టార్గెట్ లో రాము ఫ్యామిలీ ఉంటుంది. మరి రాజా భాయ్ రాము ఫ్యామిలీని ఏం చేశాడు. అతన్ని రాము ఎలా అడ్డుకున్నాడు.. తర్వాత ఏమైంది అనది సినిమా కథ.   



మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం తర్వాత తన నటనతో పరిణితి సాధించాడని చెప్పొచ్చు. ఈ సినిమాలో కూడా రాము పాత్రలో అదరగొట్టేశాడు. ఇంటెన్స్ తో నటించాడని చెప్పొచ్చు. కియరా అద్వానిది అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర ఏం కాదు. ఉన్నంతవరకు మెప్పించింది. సినిమాలో విలన్ గా వివేక్ ఓబేరాయ్ రోల్ గంభీరంగా అనిపిస్తుంది. అయితే అతన్ని ఇంకా బోయపాటి వాడుకోలేదని చెప్పొచ్చు. ప్రశాంత్, ఆర్య రాజేష్, రవివర్మ అన్నదమ్ములుగా చేశారు. ప్రశాంత్ ఒకప్పటి హీరో ఇప్పుడు ఇలా చేయడం సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. స్నేహ పాత్ర ఉన్నంతలో అలరిస్తుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు మెప్పిస్తుంది. 



రిషి పంజాబి, ఆర్ధర్ విల్సన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో చరణ్ ను చూపించిన విధానం బాగుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ జస్ట్ ఓకే. బిజిఎం కూడా అంతగా మెప్పించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. కథ, కథనాల్లో దర్శకుడు బోయపాటి శ్రీను రొటీన్ పంథా కొనసాగించాడు. సినిమా అంతా యాక్షన్ మాస్ ఎలిమెంట్స్ తో నింపాడు.



సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో వచ్చిన సినిమా వినయ విధేయ రామ. వాళ్లు అనాథలైనా వారు తమకు దొరికిన పిల్లాడిని బ్రతికిస్తారు. ఆ పిల్లాడే పెరిగి పెద్దవాడై ఆ ఫ్యామిలీకి ఏ కష్టం వచ్చినా సరే ముందు నిలబడతాడు. అన్న ఈసి అవడం వల్ల పార్టీ ప్రజలకు నష్టాన్ని కలిగించేది అయితే వారిని అడ్డుకుంటాడు మంచిగా చెబితే వినకుంటే తమ్ముడిని రంగంలో దించుతాడు. 


అలా వైజాగ్ లో పందెం పరశురాంపై పంతం నెగ్గించుకున్నా బీహార్ రాజా భాయ్ దగ్గర వీరి పప్పులు ఉడకవు. అయితే తమ్ముడు రాముపై నమ్మకం ఉండి రాజా భాయ్ విధ్వంసాన్ని ఆపాలని చూస్తాడు భుబవన్. అలానే రాజా భాయ్ ని ఢీ కొడతాడు. మొదటి భాగం యాక్షన్, సెంటిమెంట్, కామెడీ అంతా సమపాళ్లలో ఉన్నట్టు అనిపిస్తుంది. కాని సెకండ్ హాఫ్ ఇక పూర్తిగా ట్రాక్ తప్పేసింది.    


మాస్ అంశాలు ఉన్నా ఈ విధ్వంసం అంతా ఎందుకు ఏంటి అన్నది ఆడియెన్స్ ఆలోచిచేలా ఉంటుంది. కథ, కథనాల విషయంలో దర్శకుడు బోయపాటి ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. మాస్ అంశాలు పుష్కలంగా ఉండేలా చూసుకున్నాడు కాని అవి ఎంతవరకు ప్రేక్షకులకు ఎంగేజ్ అవుతున్నాయన్న విషయం మర్చిపోయాడు. సింపుల్ కథకు భారీ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అయితే తెలుగులో ఇలా లాజిక్ లేకుండా తలకాయలు నరికేసే విధ్వంసాలకు చెక్ పెట్టారు. 


రాం చరణ్ సినిమా కాబట్టి కచ్చితంగా మెగా ఫ్యాన్స్ ను అలరించేలా వివి ఆర్ ఉందని చెప్పు. యూత్ ఆడియెన్స్ కు జస్ట్ ఓకే అనిపించినా ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం నిరాశపడే అవకాశం ఉంది.


రాంచరణ్, కైరా అద్వాని, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, బోయపాటి శ్రీను, దిల్ రాజు, దేవీ శ్రీ ప్రసాద్రాం చరణ్ వినయ విధేయ రామ.. అంచనాలను అందుకోలేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: