వెంకటేష్, ఫస్ట్ హాఫ్ ఫ్యూ ఎపిసోడ్స్, వరుణ్ తేజ్ వెంకటేష్, ఫస్ట్ హాఫ్ ఫ్యూ ఎపిసోడ్స్, వరుణ్ తేజ్ ప్రొడక్షన్ వాల్యూస్, స్టోరీ పెద్దగా ఏమి లేకపోవడం, సెకండ్ హాఫ్
ఎమ్మెల్యే దగ్గర పిఏగా పనిచేస్తున్న వెంకీ (వెంకటేష్)కు హారిక (తమన్నా)తో పెళ్లి అవుతుంది. పెళ్లి తర్వాత ఆరు నెలలు సరిగా ఉన్నారో లేదో వారి మధ్య గొడవలు మొదలవుతాయి. ఓ పక్క హారిక చెల్లి హనీ (మెహ్రీన్ కౌర్) కూడా వెంకీ, హారికలతో ఉంటూ వరుణ్ (వరుణ్ తేజ్)ను ప్రేమిస్తుంది. హారిక అండ్ ఫ్యామిలీ గురించి బాగా తెలుసుకున్న వెంకీ వరుణ్ ను ఈ ఊబిలో దిగొద్దని అంటాడు. అయినా సరే వినకుండా వరుణ్ హనీతో ఎంగేజ్మెంట్ జరుపుకుంటాడు. పెళ్లి కాకుండానే వరుణ్ కు చుక్కలు చూపిస్తారు హనీ అండ్ ఫ్యామిలీ. అలా ఫ్రస్ట్రేట్ అయిన వెంకీ, వరుణ్ లు యూరప్ వెళ్తారు. అలా వెళ్లిన వారు ఏం చేశారు. వెంకీ, వరుణ్ మళ్లీ హారిక, హనీలను ఎలా కలిశారు. మిగతా కథ ఏంటి అన్నది సినిమా కథ. 



చెప్పడానికి మల్టీస్టారర్ అనుకున్నా ఎఫ్-2 వెంకీ మార్క్ కామెడీతో తన పాత్ర హైలెట్ అవుతూ వచ్చింది. సినిమాలో వెంకటేష్ కామెడీ చూస్తే నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి సినిమాలు గుర్తుకొస్తాయి. వెంకీ పాత్ర వరకు బాగా రాసుకున్నాడు దర్శకుడు అనీల్ రావిపుడి. ఇక వరుణ్ తేజ్ నటన కూడా బాగుంది. తెలంగాణా స్లాంగ్ లో వరుణ్ తేజ్ అలరించాడు. తమన్నా, మెహ్రీన్ కౌర్ లు అలరించారు. ప్రకాశ్ రాజ్, ప్రియదర్శి, శ్రీనివాస్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, వై. విజయ, అన్నపూర్ణ, రఘుబాబు, సుబ్బరాజు, సత్యం రాజేష్ ఇలా అందరిని బాగానే వాడుకున్నాడు అనీల్ రావిపుడి.



సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఉన్నంతలో బాగానే చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంతగా మెప్పించలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా హెల్ప్ అవలేదు. కథ, కథనాల్లో దర్శకుడు అనీల్ రావిపుడి కొత్తగా ఏం చెప్పలేదు కాని తీసుకున్న కథను కామెడీగా చెప్పే ప్రయత్నం చేశాడు. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ పెద్దగా ఖర్చు పెట్టినట్టు కనిపించలేదు.



మల్టీస్టారర్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ తో చేసిన సినిమా ఎఫ్-2. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఎఫ్-2 టీజర్, ట్రైలర్ అలరించాయి. హ్యాట్రిక్ డైరక్టర్ అనీల్ రావిపుడి ఈ సినిమాతో మరో హ్యాట్రిక్ కు నాంధి పలికేలా చేస్తాడని అనుకున్నారు. అయితే సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేదని చెప్పాలి. కథ రొటీన్ గా ఉండగా కథనం కూడా అంతే రొటీన్ గా సాగించాడు అనీల్. 


కథనం కూడా మొదటి భాగం వెంకీని బాగా వాడేసుకున్న అనీల్ రావిపుడి సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే కాస్త ల్యాగ్ చేయడమే కాకుండా ఎలాంటి థ్రిల్స్ లేకుండా చేశాడు. సినిమా సాగినంత సేపు ఫ్లాట్ గా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ కామెడీ పండించినా సెకండ్ హాఫ్ లో అది మిస్సయ్యింది. ఇక క్లైమాక్స్ కూడా మెప్పించలేదు. 


సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఎఫ్-2 వన్ టైం వాచ్ మూవీ అని చెప్పొచ్చు. వెంకటేష్, వరుణ్ తేజ్ ల ఎనర్జీ సినిమాకు ప్లస్ అయ్యింది. అనీల్ రావిపుడు ఇదవరకు సినిమాల్లో నడిపించిన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఈ మూవీలో లేదని చెప్పొచ్చు. 



వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, దిల్ రాజు, అనీల్ రావిపూడి,దేవీ శ్రీ ప్రసాద్ఎఫ్-2.. ఫన్ తక్కువ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ..!

మరింత సమాచారం తెలుసుకోండి: