అఖిల్, నిధి అగర్వాల్, తమన్ మ్యూజిక్అఖిల్, నిధి అగర్వాల్, తమన్ మ్యూజిక్రొటీన్ స్టోరీ, సెకండ్ హాఫ్ స్లో అవడం
ప్లే బోయ్ విక్రం కృష్ణ (అఖిల్) ఏ అమ్మాయినైనా సరే క్షణాల్లో పడేస్తాడు. ఇలాంటి రొమాంటిక్ కుర్రాడికి నిక్కి (నిధి అగర్వాల్) దగ్గరవుతుంది. ముందు అతని గురించి తెలిసి అతన్ని దూరం పెట్టిన నిక్కి అతనితో ట్రావెల్ చేస్తూ అతన్ని ప్రేమిస్తుంది. విక్కికి నిక్కి లవ్ ప్రపోజ్ చేస్తుంది.. ఓ రెండు నెలలు ప్రేమించుకుందాం అది బాగుంటే కంటిన్యూ చేద్దాం అంటాడు. అయితే నిక్కి అతి ప్రేమ.. విక్కి తట్టుకోలేడు. దానితో ఆమెను దూరం చేసుకుంటాడు. విక్కిని వదిలి ఫారిన్ వెళ్లిన నిక్కిని ఎలాగైనా మెప్పించి తన ప్రేమను గెలిపించుకోవాలని చూస్తాడు విక్కి. మరి అదెలా సాధ్యమైంది అన్నది వెండితెర మీద చూడాల్సిందే.



మొదటి, రెండు సినిమాల కన్నా అఖిల్ ఈ సినిమా నటనలో పరిణితి చెందాడని చెప్పొచ్చు. తనకు సూటయ్యే పాత్రలో అఖిల్ విక్కి పాత్రలో అలరించాడు. ఎనర్జిటిక్ గా అనిపించడమే కాదు డ్యాన్స్ తో అదరగొట్టాడు. ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా అలరించింది. తన క్యూట్ లుక్స్ తో నిధి తనకు దొరికిన స్క్రీన్ స్పేస్ ను బాగా వాడుకుంది. ఇక ప్రియదర్శి మొదటి భాగం కామెడీతో అలరించగా.. సెకండ్ హాఫ్ ఆ బాధ్యతని హైపర్ ఆది తీసుకున్నాడు. ఇక రావు రమేష్, జయ ప్రకాశ్ పాత్రలు ఎప్పటిలానే అలరించాయి. 



జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. ఫారిన్ లొకేషన్స్ బాగా చూపించారు. ఇక తమ మ్యూజిక్ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. సినిమా సాంగ్స్ ఒకటి రెండు మెప్పించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదరగొట్టాడు. కథ, కథనం దర్శకుడు వెంకీ అట్లూరి తన ప్రతిభ చాటాడని చెప్పొచ్చు. కథ రొటీన్ గానే అనిపించినా తాను రాసుకున్న కథనం మెప్పించింది. బోగవల్లి ప్రసాద్ ఖర్చుకి వెనుకాడలేదని చెప్పొచ్చు.



హీరోని ముందు అసహ్యించుకున్న హీరోయిన్ ఆ తర్వాత అతని మంచి మనసు చూసి దగ్గరవడం.. అతన్ని ప్రేమించడం.. అతని ప్రేమలో తను పెట్టిన కండీషన్స్ కు హీరో ఇబ్బంది పడటం.. ఆమె ప్రేమని కాదని చెప్పడం.. తీరా ఆమె హీరో నుండి దూరమయ్యాక మళ్లీ ఆమె కోసం హీరో వెళ్లడం ఇదంతా ఎప్పుడు వింటున్న ప్రేమకథనే. 


మిస్టర్ మజ్ ను సినిమా కూడా అలాంటి కథతోనే వచ్చింది. తొలిప్రేమ సినిమాతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి మరోసారి ప్రేమకథతో వచ్చాడు. అయితే తొలిప్రేమ సినిమాలో రాసుకున్నంత పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఇందులో మిస్సైంది. మొదటి భాగం వరకు బాగా ఇంప్రెస్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ రొటీన్ చేశాడు. 


ఇక క్లైమాక్స్ కూడా కొత్తగా ఏమి అనిపించదు. ఓవరాల్ గా అఖిల్ కు ఈ సినిమా మంచి అవుట్ పుట్ ఇచ్చిందని చెప్పొచ్చు. యూత్ ఆడియెన్స్ కు బాగా నచ్చొచ్చు. అయితే డిఫరెంట్ సినిమాలు చూసే వారికి నచ్చకపోవచ్చు. తనకు వచ్చిన అవకాశాన్ని వెంకీ అట్లూరి అన్నివిధాలుగా వాడుకున్నాడు.



అఖిల్ అక్కినేని,నిధి అగర్వాల్, బివిఎస్ ఎన్ ప్రసాద్, వెంకి అట్లూరి, దేవీ శ్రీ ప్రసాద్మిస్టర్ మజ్ను.. జస్ట్ ఓకే..!

మరింత సమాచారం తెలుసుకోండి: