మమ్ముట్టి వైఎస్సార్ పాదయాత్ర మ్యూజిక్ సినిమాటోగ్రఫీమమ్ముట్టి వైఎస్సార్ పాదయాత్ర మ్యూజిక్ సినిమాటోగ్రఫీపెద్దగా ఏమి లేవు

వైఎస్‌ఆర్‌(మమ్ముటీ) కాంగ్రెస్‌ పార్టీలో రెబల్‌ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఎప్పటికప్పుడు ప్రజలకు దగ్గర ఉండే ఉద్దేశ్యంతో పార్టీ అధినాయకత్వంను ఎదురిస్తూనే ఉంటాడు. అలా పార్టీ అధినాయకత్వం, సీనియర్ల మాట కాదని పాదయాత్ర మొదలు పెడతాడు. ఆ పాదయాత్ర వైఎస్‌ఆర్‌ లో తీసుకు వచ్చిన మార్పు ఏంటీ? ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటీ అనేది సినిమా కథ.

రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో మమ్ముటీ అద్బుతంగా నటించాడు. కొన్ని సీన్స్‌లో నిజంగా వైఎస్‌ఆర్‌ నటించాడా అన్నట్లుగా అనిపించింది. బాడీలాంగ్వేజ్‌, ఎమోషన్‌, డైలాగ్‌ డెలవరీ ఇలా అన్ని కూడా వైఎస్‌ను దించేశాడు. యాత్ర సినిమాకు మమ్ముటీ ప్రాణం పోసినట్లుగా నటించి మెప్పించాడు.


వైఎస్‌ఆర్‌ పాత్రను మమ్ముటీ కావడం వల్లే రక్తికట్టించగలిగాడు, మరెవ్వరైనా ఆకట్టుకోలేక పోయేవారు అనిపిస్తుంది. సినిమా మొత్తంను ఒంటి చేత్తో నడిపించాడు. మిగిలిన పాత్రల్లో నటించిన వారు కూడా వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.

ఇది కమర్షియల్‌ సినిమా కాదు కనుక పాటలను ఎక్కువగా ఆశించలేం. ఉన్న పాటలు సందర్బానుసారంగా ఉన్నాయి. అయితే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బాగా వచ్చింది. పలు ఎమోషనల్‌ సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంది. ఆ సీన్స్‌ స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది.


పాదయాత్రకు సంబంధించిన సీన్స్‌ చిత్రీకరణకు మంచి ట్రిక్స్‌ను వాడినట్లుగా అనిపించింది. సెకండ్‌ హాఫ్‌లో సీన్స్‌ ఇంకాస్త ఎడిట్‌ చేస్తే బాగుండేది. దర్శకుడు రాఘవ వైఎస్‌ఆర్‌ పై తనకున్న అభిమానంను పూర్తిగా చూపించే ప్రయత్నం చేశాడు. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. 
ఈమద్య కాలంలో వరుసగా బయోపిక్‌లు వస్తున్నాయి. ఇటీవలే ఎన్టీఆర్‌ కథానాయకుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కలెక్షన్స్‌ విషయం పక్కన పెడితే ఎన్టీఆర్‌ అభిమానుల్లో ఆనందం నింపింది. అలాగే యాత్ర కూడా ఉండాలని అంతా భావించారు. వైఎస్‌ఆర్‌ అభిమానుల కోసం అన్నట్లుగానే ఈ చిత్రం ఉంది. ఆ మహానుభావుడి పై ఉన్న అభిమానంతో దర్శకుడు రాఘవ మంచి కంటెంట్‌తోనే సినిమాను చేశాడు.


సినిమాపై వైఎస్‌ అభిమానులు పెట్టుకున్న నమ్మకం నిలిచే విధంగానే సినిమా ఉంది. సినిమా మొత్తం కూడా పాదయాత్ర చుట్టునే తిరిగింది. వైఎస్‌ఆర్‌ జీవితానికి సంబంధించిన ఎక్కువ విషయాలను దర్శకుడు పట్టించుకోకుండా కేవలం పాదయాత్రను బేస్‌ చేసుకుని సినిమాను రూపొందించాడు. వైఎస్‌ఆర్‌తో మరోసారి ఆయన అభిమానులు ఎమోషనల్ జర్నీ చేసేలా దర్శకుడు చేశాడు.
మమ్ముట్టి,జగపతిబాబు,సుహాసిని,మహి వి రాఘవన్, కె కృష్ణ కుమార్యాత్ర.. వైఎస్సార్ కు గొప్ప నివాళి..!

మరింత సమాచారం తెలుసుకోండి: