విద్యా బాలన్ నటన, ఎన్.టి.ఆర్, బసవతారకం మధ్య సన్నివేశాలు, రానా పర్ఫార్మెన్స్ విద్యా బాలన్ నటన, ఎన్.టి.ఆర్, బసవతారకం మధ్య సన్నివేశాలు, రానా పర్ఫార్మెన్స్నమ్మశక్యం కాని సన్నివేశాలు, ఎమోషన్ మిస్ అవడం, చంద్రబాబుని హీరోగా చూపించడం, అనవసరమైనవి చూపించడం, ఎడిటింగ్, మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్
ఎన్.టి.ఆర్ కథానాయకుడులో కథ ఎక్కడ ఆగుతుందో అక్కడ నుండి మహానాయకుడు మొదలవుతుంది. పార్టీ ఎనౌన్స్ మెంట్ పాటుగా ప్రజల్లో మమేకమై రాష్ట్రమంతా ప్రచారం చేస్తాడు ఎన్.టి.ఆర్. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తారు. పార్టీ పెట్టిన తక్కువ టైంలోనే సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఎన్.టి.ఆర్. పార్టీలో కీలక బాధ్యతలను చంద్రబాబు నాయుడు (రానా)కి అప్పగిస్తాడు. తనతో ఉంటూనే తన వెనుక గోతులు తొవ్వుతున్న నాదెండ్ల భాస్కర్ రావు బసవతారకం కోసం అమెరికాకు వెళ్లి రమ్మని ఎన్.టి.ఆర్ ను పంపిస్తాడు. అమెరికాకు ఎన్.టి.ఆర్ వెళ్లడమే ఆలస్యం ఎమ్మెల్యేలను, మంత్రులతో మీటింగ్ జరిపి తను సిఎంగా మారుతాడు. మళ్లీ సిఎం అయ్యేందుకు ఎన్.టి.ఆర్ చైతన్య రథంతో ప్రజల మధ్యలోకి వెళ్తారు. ఈ టైంలో నేషనల్ పార్టీలు ఎన్.టి.ఆర్ కు సపోర్ట్ గా నిలుస్తాయి. ఎన్.టి.ఆర్ మళ్లీ సిఎం అవుతాడు. అయితే బసవతారకంను మాత్రం కాపాడలేకపోతాడు. బసవతారకం మరణంతో సినిమా ముగుస్తుంది. 


ఎన్.టి.ఆర్ పాత్రలో బాలకృష్ణ నటించాడు అని చెప్పడం కన్నా జీవించాడు అని చెప్పొచ్చు. తండ్రి పాత్ర చేస్తూ ఆయన పాత్రలో పరిపూర్ణత చూపించాడు ఎన్.టి.ఆర్. బాలయ్య నట విశ్వరూపానికి ఎన్.టి.ఆర్ పాత్ర మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది. ఇక మహానాయకుడులో మేజర్ రోల్ రానాకు దక్కింది. ఎన్.టి.ఆర్ రాజకీయ జీవితంలో చంద్రబాబు పాత్ర కీలకం అలానే రానా కూడా బాగా చేశాడు. నాదెండ్ల భాస్కర్ రావుగా నటించిన సచిన్ కూడా మెప్పించాడు. విద్యా బాలన్ సహజ నటనతో ఆకట్టుకుంది. హరికృష్ణగా కళ్యాణ్ రాం బాగా చేశాడు. మిగతా పాత్రలన్ని మెప్పించాయి.


జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. కథానాయకుడు కన్నా ఈ పార్ట్ లో విజువల్స్ చాలా బాగా తీశారు. కీరవాణి సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. మహానాయకుడు ఎడిటింగ్ కాస్త గజిబిజీగా ఉంది. క్రిష్ ఈ భాగాన్ని బాగా హ్యాండిల్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ పెద్దగా మెప్పించలేదు. ఎక్కువ భాగం స్టూడియోలో చుట్టేశారు. 


రాజకీయా కోణంలో సినిమా కథ రాసుకుంటే అందులో ఎన్ని కల్పిత పాత్రలైనా.. కల్పిత సన్నివేశాలైనా రాసుకోవచ్చు. కాని ఎన్.టి.ఆర్ జీవిత కథ అంటే జరిగిన కథ.. అందరికి తెలిసిన కథ. ఈ కథను సినిమాగా తీయడం అంటే కత్తిమీద సాము లాంటిది. క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఫెయిల్యూర్ కాగా మహానాయకుడు మీద చాలా హోప్స్ ఉన్నాయి.


అయితే మహానాయకుడు కూడా అవసరమైన విషయాలను కాకుండా అనవసరమైన విషయాలను గురించి చూపించారు. సినిమాలో ఎన్.టి.ఆర్ కు బదులుగా నారా చంద్రబాబు నాయుడిని హీరోగా చూపించారని చెప్పాలి. నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు ఎపిసోడ్ తర్వాత ఎన్.టి.ఆర్ మళ్లీ గెలిచేందుకు చంద్రబాబు బాగా కష్టపడినట్టు అతని వల్లే ఎన్.టి.ఆర్ మళ్లీ సిఎం అయినట్టు చూపించారు.


బసవతారకం మరణంతో మహానాయకుడు ముగుస్తుంది. అయితే మహానాయకుడులో చంద్రబాబు పాత్రని బాగా హైలెట్ చేశారు. అయితే ఎన్.టి.ఆర్ రియల్ లైఫ్ విలన్ గా చంద్రబాబు గురించి అందరికి తెలుసు. అలాంటిది మహానాయకుడులో చంద్రబాబుని హీరోని చేశాడు. మహానాయకుడులో ఎన్.టి.ఆర్ చేసిన మంచి పనులు చూపించినా అదంతా ఎన్.టి.ఆర్ ఒక్కడే చేసినట్టు ఇచ్చిన బిల్డప్ కూడా బాగా ఎక్కువ ఇచ్చారు. ఎన్.టి.ఆర్ చరమాకంలో విలన్ అయిన చంద్రబాబు గురించి పాజిటివ్ గా చూపించడంతో మహానాయకుడు ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. బయోపిక్ అంటే నిజాలు చూపించాలి కాని ఇలా నిజాలను దాచి జీవిత కథను మార్చడం బాలకృష్ణ వల్లే అయ్యింది.


బాలకృష్ణ, క్రిష్, విద్యాలబాలన్, రానా, ఎం.ఎం.కీరవాణిఎన్.టి.ఆర్ మహానాయకుడు.. జరిగింది ఒకటి చూపించింది మరొకటి..!

మరింత సమాచారం తెలుసుకోండి: