Star cast: PradeepRutvaShivaji Raja
Producer: Rahul KumarDirector: Naveen

PJDM - English Full Review

పుటుక్కు జరజర డుబుక్కు మే రివ్యూ: చిత్రకథ 
మమతల కోవెల అనే ఒక అనాధాశ్రమం. ఆ ఆశ్రమం తన తాత ముత్తాతలు దానం చేసారని ఆ ప్రాపర్టీ కి చెందిన మూడవ తరం వారసుడు గబ్బర్ సింగ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తన దగ్గర ఉన్నాయని చెప్పి ఆ ప్లేస్ ని పది రోజుల్లో ఖాళీ చెయ్యాలని చెప్తాడు. దాంతో ఆ ఆశ్రమ పెద్ద అదే ఆశ్రమంలో పెరిగిన రాంబాబు(ప్రదీప్ ఆకాష్), జానీ(చంటి) లను సాయం అడుగుతాడు. వాళ్ళు గబ్బర్ సింగ్ తో మాట్లాడితే కోటి రూపాయలు పదిహేను రోజుల్లో ఇస్తే ఆ స్థలం వాళ్ళకే ఇచ్చేస్తానని చెప్తాడు. దాంతో వీళ్ళు డబ్బు కోసం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే ఒకతను ఒక కిడ్నాప్ చేస్తే కోటి రూపాయలిస్తామంటాడు. వీళ్ళు డబ్బు కోసం ఒప్పుకుంటారు. కానీ వాళ్ళ కిడ్నాప్ ఒక్కరితో ఆగదు. అలా వాళ్ళు ఎన్ని  కిడ్నాప్ లు  చేసారు? అసలు ఎవరెవర్ని కిడ్నాప్ చేసారు? ఎందుకు చేసారు? అసలు రాంబాబు - జానీచేత కిడ్నాప్ చేయించింది ఎవరు? ఎందుకు చేయించాడు? చివరికి వాళ్ళు కోటి రూపాయలు తెచ్చి ఆ ఆశ్రమాన్ని కాపాడుకున్నారా? లేదా అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే థియేటర్ వెతుక్కొని సినిమాకి వెళ్ళండి.

పుటుక్కు జరజర డుబుక్కు మే రివ్యూ: నటీనటుల ప్రతిభ
ముందుగా హీరో పాత్ర చేసిన ప్రదీప్ ఆకాష్ నటన ఉంది అంటే ఉంది. ఇక హీరోయిన్ రుత్వ నటన గురించి నేను ఏమీ చెప్పలేను. ఒక్క మాటలో అయితే ఆమె నటన అనిర్వచనీయం. ఎందుకంటే ఆస్థాయిలో హావ భావాలు పలికించి ప్రేక్షకులని భయపెట్టింది. ఇక సినిమాలో ముఖ్య పాత్రలు చేసిన తాగుబోతు రమేష్, చంటి, ధన్ రాజ్, వేణు, బాబు మోహన్ లు బాగానే చేసారు కానీ ఆడియన్స్ ని నవ్వించడంలో మాత్రం భారీగా విఫలమయ్యారు. దొంగ పాత్రలో శివాజీరాజా జస్ట్ ఓకే కానీ సినిమాకి పెద్దదా ఉపయోగం లేదు. ఇక ఎవరన్నా ఉన్నా వారి గురించి చెప్పడం అనవసరం.

పుటుక్కు జరజర డుబుక్కు మే రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

సాంకేతిక అంశాల్లో ఇది బాగా చేసారు అని చెప్పుకోవడానికి ఒక్క విభాగం కూడాలేదు. బాగాలేనివి లేనప్పుడు ఎంత చెడగొట్టారో అన్నదన్నా చెప్పాలిగా .. ఈ చిత్ర కథా రచయిత అన్ని అల్లరి నరేష్ సినిమాలని వరుసబెట్టి రిపీటెడ్ గా చూసినట్టున్నాడు. అందుకే ఆ అన్ని సినిమాల్ని కలగలిపి ఈ సినిమా రాసేశాడు. ఈ సినిమాలో బ్లేడ్ బాబ్జీ, చందన బ్రదర్స్ - బొమ్మన సిస్టర్స్ మొదలైన సినిమాల్లోని కొన్ని పార్ట్స్ ని మక్కికి మక్కి దించినట్లు అనిపిస్తుంది. ఇక డైరెక్టర్ తన దర్శకత్వ ప్రతిభ మరియు స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల కళ్ళలో నీళ్ళు తెప్పించాడు. సెంటిమెంట్ తో కాదు సుమీ టార్చర్ తో.. మీకు శత కోటి దండాలు పెడతాం మళ్ళీ ఇలాంటి కళాఖండాల్ని తియ్యొద్దు ప్లీజ్.. ఇక మిగిలిన విభాగాల్లో ముఖ్యమైన మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ లు చాలా చెత్తగా ఉన్నాయి. దీనికంటే యూ ట్యూబ్ లో దొరికే షార్ట్ ఫిల్మ్స్ లో అద్భుతమైన క్వాలిటీ కనిపిస్తోంది. ఈ సినిమాతో షార్ట్ ఫిల్మ్స్ ని పోల్చుకుంటే షార్ట్ ఫిల్మ్స్ ని కెవ్వు కేక అని అనొచ్చు. డైలాగ్స్ కూడా అస్సలు బాగోలేవు.


పుటుక్కు జరజర డుబుక్కు మే రివ్యూ: హైలెట్స్
  • మా కర్మ కాలి ఈ సినిమాకి వెళ్ళడం..

పుటుక్కు జరజర డుబుక్కు మే రివ్యూ: డ్రా బాక్స్
  • ఒకటా రెండా.. నేను చెప్పలేను ఒకవేళ చెప్పినా మీరు చదవలేరు.

పుటుక్కు జరజర డుబుక్కు మే రివ్యూ: విశ్లేషణ

అసలు సినిమా ఏమని మొదలు పెట్టారో.. ఏమని తీసారో.. ఏమని రిలీజ్ చేసారో కాని చూసిన ప్రేక్షకులు మాత్రం పుటుక్కు జరజర డుబుక్కు మే..! ఇలాంటి సినిమాలని కామెడీ  ఎంట్రటైన్ మూవీస్ అని పబ్లిసిటీ చేస్తుంటే కామెడీ అంటేనే భయం వేస్తోంది. ఎన్నో కామెడీ సినిమాలు వస్తున్నాయి, అలాంటప్పుడు కొత్తగా ఎలాంటి కామెడీ చూపించగలిగితే ప్రేక్షకులను రెండుగంటలకు పైగా థియేటర్లో కూర్చో బెట్టగలం అనే కానీస అవగాహన కూడా లేకుండా, కేవలం ఆడియన్స్ కి తెలిసిన నలుగురు కమెడియన్స్ ఉంటే చాలు అని అనుకొని డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించడం చాలా దారుణమైన విషయం. అలాగే సినిమాలో ఏ ఒక్క లాజిక్ లేకుండా, ఒక్క పాత్రకి పర్ఫెక్ట్ ముగింపు లేదా జస్టిఫికేషన్ లేకుండా సినిమా తీసినందుకు, ఏదో కాసేపు నవ్వుకుందామని వచ్చిన ప్రేక్షకుడికి టార్చర్ చూపించినందుకు డైరెక్టర్ కి దండేసి దండం పెట్టాలి. వీటన్నిటికీ తోడు నారాయణ ఈవివి సత్యరాయణ అని ఒక నారదుడి పాత్రని పై నుంచి కిందకి తెచ్చి ప్రేక్షకులని టార్చర్ చెయ్యడమే కాకుండా, ఈవివి గారి పేరు చెడగొట్టారు. సీన్స్, డైలాగ్స్ దాదాపు అన్ని తెలుగు సినిమాల్లోని చాలా సీన్స్ కి స్పూఫ్ లాగా అనిపిస్తాయి. అలాగే పాటలే అవసరంలేని ఈ సినిమాలో మూడు సాంగ్స్ అందులోనూ ఒకటి ఐటెం సాంగ్. ఈ మధ్య డైరెక్టర్స్ కి సినిమాలో అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కడో ఓ చోట ఐటెం సాంగ్ పెట్టడం ఓ ఫాషన్ అయిపొయింది. చివరిగా నేను ఒక్కటే చెబుతాను.. ఈ సినిమాకి 50 రూపాయలు పెట్టడం కంటే ఒక పది రూపాయలకి పళ్లీలు కొనుక్కొని 10 రూపాయలకి చందమామ కథల పుస్తకం ఒకటి కొనుక్కొని ఏ పార్క్ లోనో కూర్చొని చదువుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. లేదా కాస్త కంప్యూటర్, ఇంటర్నెట్ తెలిసిన వాళ్ళైతే ఒక 20 రూపాయలు పెట్టి నెట్ కి వెళ్లి ఈటీవి వారి జబర్దస్త్ కామెడి షో చూడండి ఓ గంటసేపన్నా నవ్వుకోవచ్చు లేదా పేస్ బుక్ లో కడుపుబ్బా నవ్వించే కొన్ని జోక్స్ పేజీలు ఉంటాయి అవి చదవండి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు.


పుటుక్కు జరజర డుబుక్కు మే రివ్యూ: చివరగా
పుటుక్కు జరజర డుబుక్కు మే : ప్రేక్షకుల ప్రాణాలు పుటుక్కు జరజర డుబుక్కు మే..!
 

Review board: Cheruku Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on PJDM | PJDM Wallpapers | PJDM Videos

మరింత సమాచారం తెలుసుకోండి: