Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 3:34 pm IST

Menu &Sections

Search

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ, రేటింగ్..ఇది మన కథ-మనందరమూ చూడాల్సిన కథ

- 5/5
ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ, రేటింగ్..ఇది మన కథ-మనందరమూ చూడాల్సిన కథ READ THIS MOVIE REVIEW IN ENGLISH

మంచి

 • ఎన్.టి.ఆర్ జీవిత కథ
 • ఎన్.టి.ఆర్ చివరి రోజుల్లో కష్టాలు చూపించడం
 • ఎన్.టి.ఆర్ పాత్ర
 • నిజాతీగల ప్రయత్నం
 • చెప్పదలచుకున్న పాయింట్ సూటిగా చెప్పడం
 • ఎమోషనల్ గా కనెక్ట్ అవడం
 • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
 • ఆర్ట్ వర్క్
 • సినిమాటోగ్రఫీ

చెడు

 • చెప్పుకునేందుకు పెద్దగా ఏం లేవు
 • మీరు చూడకపోతే ఓ మహనీయుడి జీవితంలోని స్ట్రగుల్స్ ను దానికి కారణమైన విషయాలను మిస్సవుతారు
ఒక్క మాటలో: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఇది మహనీయుడి కథ.. మనమందరం తెలుసుకోవాల్సిన అసలు కథ..!

చిత్ర కథ

నిజ జీవిత కథలను సినిమాగా చెప్పేటప్పుడు అందులో కొన్ని దాచిపెట్టి కొన్ని చూపించడం జరుగుతుంది. అయితే ఎన్.టి.ఆర్ రియల్ స్టోరీగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ నిజంగానే ఆర్జివి అసలు కథతో వచ్చాడు. 1989 ఆ టైంలో తన బయోగ్రఫీ రాస్తానని వచ్చిన లక్ష్మి పార్వతి ఎన్.టి.ఆర్ ను కలుస్తుంది. బయోగ్రఫీ రాసే క్రమంలో ఎన్.టి.ఆర్ మంచి మనసుకి లక్ష్మి పార్వతి దగ్గరవుతుంది.

మేజర్ చంద్రకాంత్ 100 రోజుల వేడుకలో లక్ష్మీ పార్వతిని పెళ్లాడుతా అని ప్రకటిస్తాడు. ఎన్.టి.ఆర్ పక్కనే ఉంటూ చంద్రబాబు అతని వెనుక గోతులు తవ్వుతాడు. 94లో ఎన్నికల్లో గెలిచినా సరే అభ్యర్ధులను తనవైపు తిప్పుకుని ఎన్.టి.ఆర్ కు వెన్నుపోటు పొడిచి సిఎంగా గద్దె ఎక్కుతాడు. ఆ మానసిక క్షోభతో ఎన్.టి.ఆర్ కృంగిపోతాడు.


ఆ తర్వాత కుటుమ సభ్యులు సైతం తనని పట్టించుకోకపోతే లక్ష్మి పార్వతితో ఆయన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. చివరకు ఎన్.టి.ఆర్ మరణంతో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ముగుస్తుంది.

నటీనటుల ప్రతిభ

సినిమాలో ఎన్.టి.ఆర్ గా నటించిన విజయ్ కుమార్ అద్భుతంగా చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో చాలా కన్విన్సెడ్ గా చేశాడు. లక్ష్మి పార్వతిగా నటించిన యజ్ఞా శెట్టి కూడా చాలా బాగా చేశారు. సినిమా అంతా ఎన్.టి.ఆర్, లక్ష్మి పార్వతి చుట్టూ తిరుగుతుంది. చంద్రబాబుగా శ్రీతేజ్ అచ్చుగుద్దినట్టు ఎన్.టి.ఆర్ ను దించాడు. సినిమాలో మిగత పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతికవర్గం పనితీరు

రమ్మీ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో 80 శాతం సీన్స్ క్లోజప్ షాట్సే. చంద్రబాబు, లక్ష్మి పార్వతి, ఎన్.టి.ఆర్ వీళ్ల ఎపిసోడ్స్ మొత్తం క్లోజప్ షాట్స్ తో నడిపించాడు. కళ్యాణి మాలిక్ మ్యూజిక్ అదరగొట్టాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. హైలెట్ సీన్స్ లో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సీన్ ఎంత డిమాండ్ చేస్తుందో దానికి మ్యూజిక్ కూడా బాగా సెట్ అయ్యింది.


రాకేష్ రెడ్డి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా తెరకెక్కించారు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. వర్మ దర్శకత్వ ప్రతిభ అందరికి తెలిసిందే. తాను చెప్పదలచుకున్న పాయింట్ ను చెప్పడం లో అసలు ఏమాత్రం వెనుక్కి తగ్గడని మరోసారి ఈ సినిమా ద్వారా నిరూపీంచుకున్నాడు. అగస్త్య కూడా డైరక్షన్ లో వర్మకు సహకారం అందించడం. సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యింది. 

చిత్ర విశ్లేషణ

బయోపిక్ లలో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ వేరయా అనేలా ఎన్.టి.ఆర్ అసలు జీవిత కథను కళ్లకు కట్టినట్టుగా తెరకెక్కించాడు ఆర్జివి. సినిమా మొదలవడమే ఆలస్యం ఆడియెన్స్ ను కథలో ఇన్వాల్వ్ చేయించిన విధానం బాగుంది. స్క్రీన్ ప్లే కూడా రేసీగా ఉంది. 80 శాతం క్లోజప్ షాట్స్ తీశారు. థియేటర్ మొత్తం సైలెంట్ గా సినిమాను వీక్షించేలా వర్మ డైరెక్ట్ చేశారు. నందమూరి ఫ్యామిలీ చంద్రబాబు నాయుడిని ఎంత గుడ్డిగా నమ్మారో కూడా సినిమాలో చూపించారు. ఎమోషన్స్, రియలిస్టిక్ గా అద్భుతంగా అనిపించాయి.


ఈ బయోపిక్ చూశాక ఇది అసలు సిసలు ఎన్.టి.ఆర్ బయోపిక్ అనక తప్పదు. అంతేకాదు సినిమా చూశాక ప్రతి ఎన్.టి.ఆర్ అభిమాని గర్వపడేలా సినిమా ఉంది. ఎన్.టి.ఆర్ చివరి రోజుల్లో అతని మీద జాలీ చూపించలేదు. చంద్రబాబుగా నటించిన శ్రీతేజ్ బాగా చేశాడు. అతని బాడీ లాంగ్వేజ్ అచ్చం చంద్రబాబుగా బాగా చేశాడు. 


ఎన్.టి.ఆర్ బయోపిక్ గా వచ్చిన బాలకృష్ణ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఎక్కడైతే ఫెయిల్ అయ్యాయో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అక్కడ సక్సెస్ సాధించింది. సినిమాకు ఆడియెన్స్ అంతా కనెక్ట్ అయ్యేలా చేశాడు ఆర్జివి. అంతేకాదు మీడియాను బాబు ఎలా వాడుకుంటాడు అన్నది కూడా సినిమాలో చూపించారు. లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకున్నాక ఎన్.టి.ఆర్ ఎన్ని స్ట్రగుల్వ్ ఫేస్ చేశాడో సినిమాలో చాలా బాగా చూపించారు. అశోక్, దేవేందర్, ఎర్రన్నాయుడు చంద్రబాబుతో ఉన్న సత్సంబంధాన్ని చూపించారు.    


ఇక సినిమాలో వైస్రాయ్ హోటల్ సీన్ హైలెట్ అని చెప్పొచ్చు. అప్పుడు జరిగిన విషయాలను ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా చూపించాడు ఆర్జివి. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా మిగిలిపోయిన ఎన్.టి.ఆర్ కథ కథలో ఎన్.టి.ఆర్ చనిపోయినా కోట్ల మంది హృదయాల్లో బ్రతికే ఉండేలా ఎన్.టి.ఆర్ గురించి గొప్పగా తీశారు లక్ష్మీస్ ఎన్.టి.ఆర్.  

కాస్ట్ అండ్ క్రూ

3 / 5 - 5478
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS

Bollywood

View all