నిహారిక నటన, సినిమాటోగ్రఫీనిహారిక నటన, సినిమాటోగ్రఫీరొటీన్ గా అనిపించే కథ, స్లో నరేషన్, మ్యూజిక్
అభి (రాహుల్ విజయ్), సూర్యకాంతం (నిహారిక) తొలి చూపులోనే ప్రేమించుకుంటారు. అభి చేసిన ప్రపోజల్ ను సూర్యాకంతం ఒప్పుకుంటుంది. అయితే సూర్యకాంతం తల్లి చనిపోవడం వల్ల డిప్రెషన్ లో అభి నుండి దూరంగ వెళ్తుంది. సూర్యకాంతం గురించి ఆలోచించుకుంటూ ఉన్న అభికి పూజా (పెర్లిన్ బేసారియా) తో పెళ్లి ఫిక్స్ చేస్తారు. అభి, పూజాతో సంతోషంగా ఉన్న అభి లైఫ్ లోకి మళ్లీ సూర్యకాంతం వస్తుంది. ఇంతకీ అభి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు..? అభికి దూరంగా వేళ్లిన సూర్యకాంతం ఏం చేసింది..? అన్నది సినిమా కథ. 



సూర్యకాంతం పాత్రలో నిహారిక చాలా బాగా చేసింది. సినిమా అంతా తన అల్లరి నటన ఆకట్టుకుంటుంది. ఫైర్ బ్రాండ్ గా నిహారిక సూపర్ అనిపించుకుంది. అభి పాత్రలో రాహుల్ విజయ్ నటన ఆకట్టుకుంది. పూనా పాత్రలో నటించిన పేర్లిన్ బెతారియా కూడా బాగా చేసింది. కమెడియన్ సత్య అలరించాడు. శివాజి రాజా, సుహాసిని పాత్రలు ఆకట్టుకున్నాయి. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.  



హరి జాస్తి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా కథకు తగినట్టుగా కెమెరా వర్క్ ఇంప్రెస్ చేసింది. రాబిన్ మ్యూజిక్ సోసోగా ఉంది. రీ రికార్డింగ్ ఓకే. కథ, కథనాల్లో దర్శకుడు ప్రణీత్ రొటీన్ గానే వెళ్లాడనిపిస్తుంది. హీరోయిన్ క్యారక్టరైజేషన్ తప్ప కొత్తగా ఏమి లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.



ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సీరీస్ తో దర్శకుడిగా సత్తా చాటిన ప్రణీత్ బ్రహ్మాండపల్లి ఫీచర్ ఫిల్మ్ గా చేసిన సూర్యకాంతం రొటీన్ స్టోరీతో వచ్చింది. అల్లరి చేసే అమ్మాయి.. సైలెంట్ అండ్ సిన్సియర్ అబ్బాయి.. వారి మధ్య ప్రేమ ఇంతలో ఆ హీరోయిన్ అతన్ని వదిలి వెళ్లడం. ఈలోగా అతను వేరే అమ్మాయికి కనెక్ట్ అవడం ఈలోగా మొదటి ప్రేమికురాలు రావడం ఇలాంటి కథలు చాలా వచ్చాయి.


అయితే దర్శకుడు చెప్పదలచుకున్న పాయింట్ ను బాగానే చెప్పాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఇంప్రెస్ చేశాడు. అయితే ఓవరాల్ గా సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అక్కడక్కడ స్లో నరేషన్ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది. అయితే నిహారిక పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుందనిపిస్తుంది. 


రొటీన్ కథ అనిపించినా దర్శకుడు ఫ్రెష్ గా ఈ కథను డీల్ చేశాడు. అయితే సినిమా కథ మీద ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. అయితే ఒకమనసు, హ్యాపీ వెడ్డింగ్ సినిమాలతో పోల్చితే సూర్యకాంతం కొంతవరకు బెటర్ అని చెప్పొచ్చు. మెగా ఫ్యాన్స్ కు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.



Niharika Konidela, Rahul Vijay, Suhasini Maniratnam, Mark K Robin, Pranith Bramandapally నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్,సుహాసిని మనిరత్నం, మార్క్ కె రుబిన్, ప్రణిత్ రొటీన్ కథతో వచ్చిన సూర్యకాంతం..!

మరింత సమాచారం తెలుసుకోండి: