నాగ చైతన్య, సమంత, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్నాగ చైతన్య, సమంత, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ స్లో అనిపించడం, ఎడిటింగ్
పూర్ణ (నాగ చైతన్య) వైజాగ్ లో రైల్వే టీం కోసం క్రికెట్ ఆడుతుంటాడు. ఇండియా టీంకు ఆడాలన్న తపన ఉంటుంది. అయితే ఈలోగా అతనికి అన్షు (దివ్యాన్ష కౌశిక్) తో గొడవతో పరిచయం ఏర్పడి అది చిన్నగా ప్రేమగా మారుతుంది. నేవీ ఆఫీసర్ కూతురు అయిన అన్షు రైల్వే టిసి కొడుకు పూర్ణతో తిరగడం తెలుసుకున్న అన్షు ఫాదర్ ఆమెను దూరంగా తీసుకెళ్తాడు. ఆ తర్వాత అటు ప్రేమను.. ఎంతో ఇష్టమైన క్రికెట్ ను వదిలేసి మందుకు బానెస అవుతాడు పూర్ణ. అయితే పూర్ణకు తెలియకుండానే అతని ఎదురు ఇంట్లో ఉంటూ ప్రేమిస్తుంది శ్రావణి (సమంత). ఆమె తన తండ్రిని ఒప్పించి పూర్ణని పెళ్లాడుతుంది. అయితే పెళ్లైనా సరే అన్షు జ్ఞాపకాలతో పూర్ణ శ్రావణితో సరిగా ఉండడు. ఫైనల్ గా పూర్ణ, శ్రావణి ఎలా దగ్గరయ్యారు..? పూర్ణ, అన్షులు ఎలా విడిపోయారు..? తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా కథ.  



పూర్ణ పాత్రలో నాగ చైతన్య అదరగొట్టాడు. ఈ సినిమాలో చైతన్య చాలా మెచ్యుర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. తన కెరియర్ బెస్ట్ పఫార్మెన్స్ అనుకోవచ్చు. ఇక సినిమాకు మరో హైలెట్ శ్రావణి పాత్ర. సమంత తన అభినయంతో మరోసారి ఆకట్టుకుంది. చైతు, సమంతల స్క్రీన్ స్పేస్ ఆడియెన్స్ ను అలరిస్తుంది. సెకండ్ హీరోయిన్ గా నటించిన దివ్యాన్ష కౌశిక్ కూడా మెప్పించింది. రావు రమేష్, పోసాని పాత్రలు అలరించాయి. సుబ్బరాజు నెగటివ్ రోల్ ఎప్పటిలానే బాగా చేశాడు. పూర్ణ ఫ్రెండ్స్ గా సుహాస్, సుదర్శన్ కూడా అలరించాడు.



విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. సినిమాకు కెమెరా వర్క్ బాగుంది. గోపి సుందర్ సాంగ్స్ అలరించాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. కథ, కథనాల్లో దర్శకుడు శివ నిర్వాణ ప్రతిభ కనబరిచాడు. రొటీన్ కు భిన్నంగా కథ, కథనాలు సాగుతాయి. షైన్ స్క్రీన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.



ఇది ఓ విరహ ప్రేమ గాథే కాని దర్శకుడు శివ నిర్వాణ అలాంటి కథను కొత్తగా చెప్పాడు. పూర్ణ, శ్రావణి పాత్రల ద్వారా ఓ మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు. దర్శకుడు అనుకున్నది అనుకున్న విధంగా సినిమాను తెరకెక్కించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ప్లెసెంట్ గా సాగుతుంది.


అయితే సెకండ్ హాఫ్ అక్కడక్కడ స్లో అయినట్టు అనిపిస్తుంది. నాగ చైతన్య, సమంతల మధ్య సీన్స్ అలరించాయి. ఎక్కువ శాతం వైజాగ్ లోనే తీశారు కాబట్టి బడ్జెట్ కూడా పెద్దగా అవలేదు. నిన్నుకోరి సినిమాతో ప్రతిభ చాటిన శివ నిర్వాణ మజిలీతో కూడా మెప్పించాడని చెప్పొచ్చు.


రియల్ లైఫ్ భార్యాభర్తలైన చైతు, సమంత సినిమాలో కూడా భార్యాభర్తలుగా నటించడం విశేషం. రొటీన్ సినిమాలా కాకుండా రియలిస్టిక్ గా ఎంతో నాచురల్ గా సినిమాను నడిపించాడు శివ నిర్వాణ. ప్రేమ.. కెరియర్.. ఇలా ప్రతి మనిషి జీవితంలో ఉండే కథనే తెర మీద చూపించి మజిలీని మనసుకు నచ్చేలా చేశారు. యూత్, ఫ్యామిలీ అందరు చూడదగినట్టుగా సినిమా ఉంది.



అక్కినేని నాగ చైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్, శివ నిర్వాణ, గోపీ సుందర్ప్రేమ.. బాధ.. రెండిటి 'మజిలీ'..!

మరింత సమాచారం తెలుసుకోండి: