సాయి తేజ్, మ్యూజిక్, డైలాగ్స్ సాయి తేజ్, మ్యూజిక్, డైలాగ్స్ రొటీన్ స్క్రీన్ ప్లే, అక్కడక్కడ స్లో అవడం
విజయ్ కృష్ణ (సాయి తేజ్) లైఫ్ లో సక్సెస్ అనేదే లేని అతని జీవితంలో లహరి (కళ్యాణి ప్రియదర్శన్) వస్తుంది. ఏది స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేని లహరి విజయ్ విషయంలో తప్పు చేశానని ఫీల్ అవుతుంది. అతని ప్రేమకు బ్రేకప్ చెబుతుంది. మరోపక్క స్వేచ్చ (నివేదా పేతురాజ్) విజయ్ సక్సెస్ కు హెల్ప్ చేయాలని అనుకుంటుంది. విజయ్ ప్రాజెక్ట్ తన హెల్ప్ చేస్తుంది ఇంతకీ విజయ్ లైఫ్ లో సక్సెస్ అయ్యాడా..? అతను చేసిన ఆ ప్రాజెక్ట్ ఏంటి..? విజయ్, కృష్ణ లహరిల ప్రేమ గెలిచిందా అన్నది సినిమా కథ.



విజయ్ కృష్ణ పాత్రలో సాయి తేజ్ అలరించాడు. ఇదవరకు కన్నా అతని నటనలో పరిణితి కనిపించింది. ఇక కళ్యాణి ప్రియదర్శన్ క్యూట్ లుక్స్ లో ఆకట్టుకోగా.. నివేదా పేతురాజ్ నటన జస్ట్ ఓకే అనేలా ఉంది. పోసాని, వెన్నెల కిశోర్, సునీల్ వంటి వారు బాగానే చేశారు. హైపర్ ఆది, సుదర్శన్, రావు రమేష్ రెండు, మూడు సీన్స్ లో కనిపించి అలరించారు.



కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. అయితే కొన్ని షాట్స్ సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగానే ఉంది. కథ, కథనాల్లో దర్శకుడు కిశోర్ తిరుమల కొత్తదనం చూపించలేదు. ఫెయిల్యూర్ మెన్ సక్సెస్ కథతో రాసుకున్న చిత్రలహరి కథ రొటీన్ గా ఉండటమే కాకుండా స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గా నడిపించాడు. డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.



నేను శైలజా, ఉన్నది ఒకటే జిందగి సినిమాలతో సత్తా చాటిన కిశోర్ తిరుమల చిత్రలహరి సినిమా కథ, కథనాల్లో రొటీన్ పంథా కొనసాగించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అయినా కాస్త కూస్తో కొంత బెటర్ కాని సెకండ్ హాఫ్ మరీ దారుణంగా ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసిన సీన్స్ చేస్తాడు.


ఇక ఏదైతే హీరో ప్రాజెక్ట్ అంటాడో ఆ ప్రాజెక్ట్ కు సంబందించి క్లైమాక్స్ కూడా పెద్దగా మెప్పించలేదు. సాయి తేజ్, కళ్యాణిల ప్రేమ కథ ఇంకాస్త బాగా రాసుకుని ఉండాల్సింది. కళ్యాణి ప్రియదర్శన్ క్యూట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. ఇక నివేదా పేతురాజ్ పాత్ర దర్శకుడు సరిగా డీల్ చేయలేదు.


సినిమా చూస్తున్నంతసేపు మనం ఓ కొత్త సినిమా చూస్తున్న ఫీల్ కలగదు. ఆల్రెడీ తెలిసిన కథే తెలిసిన కథనంతోనే సినిమా నడుస్తుంది. సినిమాలో రెండు మూడు చోట్ల దర్శకుడు పర్వాలేదు అనిపించాడు కాని రెస్టాఫ్ దట్ అంతా ఏదో జరుగుతుంది. ఫైనల్ గా మెగా ఫ్యాన్స్ కు, యూత్ ఆడియెన్స్ కు కొద్దిగా నచ్చొచ్చు అయితే వెరైటీ సినిమాలను కావలనుకునే వారికి ఈ సినిమా నచ్చదు.  



సాయి ధరమ్ తేజ్,కళ్యాణి ప్రియదర్శిని, నివేదే పేతూరి,సునీల్, వెన్నెల కిషోర్, కిషోర్ తిరుమల, దేవీ శ్రీ ప్రసాద్సాయి తేజ్ 'చిత్రలహరి'.. జస్ట్ ఓకే అనిపించే సినిమా..!

మరింత సమాచారం తెలుసుకోండి: