హీరోయిన్స్, సినిమాటోగ్రఫీ, కామెడీహీరోయిన్స్, సినిమాటోగ్రఫీ, కామెడీఓవర్ గ్రాఫిక్స్, రొటీన్ స్టోరీ
తన తల్లి కోరిక మేరకు ఎదురి వారి కోసం ఎలాంటి త్యాగాన్నైనా చేసే కాళీ (రాఘవ లారెన్స్) హ్యాండిక్యాప్డ్ చిల్డ్రెన్స్ కు ఓ ఆశ్రమాన్ని నడిపిస్తూ ఉంటాడు. అయితే కాళీ చేసే మంచి పనుల ద్వారా అతన్ని వాడుకుని మిస్టర్ శంకర్ కోట్ల డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తారు. అయితే కాళీ దానికి అంగీకరించడు.. మినిస్టర్ అతని తమ్ముడు వల్ల కాళీ చనిపోతాడు. అలా చనిపోయిన కాళీ దెయ్యమై రాఘవ మీద ఆవహిస్తాడు. ఇంతకీ కాళీ ఎవరి మీద పగ తీర్చుకోవాలని వచ్చాడు..? ఆ పగ ఎలా తీర్చుకున్నాడు..? రాఘవను కాళీ ఏం చేశాడు అన్నది సినిమా కథ.



కాళీ, రాఘవ పాత్రల్లో లారెన్స్ నటన ఆకట్టుకుంది. రెండు పాత్రల్లో లారెన్స్ వేరియేషన్స్ చూపించాడు. ఇక తన మార్క్ కామెడీ టైమింగ్, ఎమోషన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. హీరోయిన్స్ వేదిక, ఓవియా కూడా ఆకట్టుకున్నారు. కోవై సరళ కూడా తన నటనతో మెప్పించింది. మిగతా పాత్రలు పరిధి మేరకు నటించి మెప్పించారు.



హారర్ సినిమాలకు సినిమాటోగ్రఫీ ప్రధానంగా బాగుండాలి. ఈ సినిమాకు అది బాగా సెట్ అయ్యింది. గ్రాఫిక్స్ కూడా బాగా ఉన్నాయి. తమన్ బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. దర్శకుడు రాఘవ లారెన్స్ తన డైరక్షన్ టాలెంట్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.



హర్రర్ కాన్సెప్ట్ సినిమాలకు కామెడీ జోడించి లారెన్స్ వరుసగా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నాడు. అదే క్రమంలో వచ్చిన కాంచన 3 కూడా కొద్దిమంది ప్రేక్షకులకు నచ్చుతుంది. లారెన్స్ మార్క్ కామెడీ, హర్రర్ థ్రిల్స్ ఉన్నా సినిమా రొటీన్ గా అనిపిస్తుంది. కథ కూడా అంత గొప్పగా అనిపించదు.


సినిమాలో కొన్ని గ్రాఫిక్స్ బాగున్నాయి. అయితే ఇదవరకు లారెన్స్ సినిమాల్లో ఉన్న సస్పెన్స్, థ్రిల్ కాంచన 3లో కనిపించలేదు. అయితే ఈ జానర్ సినిమాలు చూసే ఆడియెన్స్ కు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. సినిమాలో ఎక్కడ కొత్తదనం కనిపించదు. 



Raghava Lawrence, Vedhika, Oviya, Nikki Tamboli, Kabir Duhan Singh, Doopaadoo Musicకాంచన 3.. మరోసారి భయపెట్టాడు

మరింత సమాచారం తెలుసుకోండి: