నాని నటన, సినిమాటోగ్రఫీ, అనిరుద్ మ్యూజిక్, ఎమోషనల్ సీన్స్ నాని నటన, సినిమాటోగ్రఫీ, అనిరుద్ మ్యూజిక్, ఎమోషనల్ సీన్స్ సెకండ్ హాఫ్ మొదట్లో కొద్దిగా స్లో అవడం
ఆల్రెడీ రంజీకి వెళ్లి ఫుడ్ కార్పోరేషన్ లో ఉద్యోగం చేసే అర్జున్ (నాని) కొన్ని కారణాల వల్ల ఆ జాబ్ నుండి సస్పెండ్ అవడంతో ప్రేమించి పెళ్లాడిన సారా (శ్రద్ధ శ్రీనాథ్) జీతం మీద ఆధారపడుతుంటాడు. తన కొడుకు జెర్సీ 500 రూపాయలు పెట్టి కొనలేని పరిస్థితి అర్జున్ ది. అయితే ఈలోగా న్యూజిల్యాండ్ తో హైదరాబాద్ ఆడే ట్రస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన అర్జున్ ఫైనల్ గా మళ్లీ రంజీ జట్టులో స్థానం సంపాదిస్తాడు. 10 ఏళ్ల క్రితం అర్జున్ క్రికెట్ ఎందుకు వదిలేశాడు. నేషనల్ కు సెలెక్ట్ అవ్వాలన్న అర్జున్ కోరిక నెరవేరిందా లేదా అన్నది సినిమా కథ. 



నాని నాచురల్ నటనతో అర్జున్ పాత్రకి ప్రాణం పోశాడు. ఇన్నేళ్ల కెరియర్ లో నాని కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదని చెప్పొచ్చు. శ్రద్ధ శ్రీనాథ్ కూడా బాగానే నటించింది. మూర్తి పాత్రలో సత్యరాజ్ ఇంప్రెస్ చేశాడు. ఇక సినిమాలో హీరో స్నేహితులుగా ప్రవీణ్, నవీన్ ఇలా అందరు బాగానే చేశారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.



సాను వర్గీస్ సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. కథలోని ఫీల్ ను చూపించేలా కెమెరా వర్క్ బాగా చేశారు. ఇక అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ సినిమాకు మరో హైలెట్ అని చెప్పొచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. కథ, కథనాల్లో దర్శకుడు గౌతం తన టాలెంట్ చూపించాడు. ఎంచుకున్న కథను ఎక్కడ ట్రాక్ తప్పకుండా స్క్రీన్ ప్లే కూడా బాగా రాసుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి.



ఇది కేవలం అర్జున్ కథ కాదు లక్ష్యం ఒకటి పెట్టుకుని దాన్ని మధ్యలో వదిలిపెట్టిన ప్రతి ఒక్కరి కథ. సినిమాలో అర్జున్ పాత్రని వెంటనే ఓన్ చేసుకుంటారు. క్రికెట్ లో దేశం కోసం ఆడాలనుకున్న అర్జున్ సడెన్ గా క్రికెట్ మానేస్తాడు. వచ్చిన ఉద్యోగం కూడా ఏదో గొడవతో సస్పెన్షన్ లో ఉంటుంది. ఏమి చేయకుండా ఇంట్లో తిని కూర్చునే అర్జున్ మళ్లీ క్రికెటర్ అవ్వాలనుకుంటాడు. అసలు ఎందుకు క్రికెట్ మానేశాడు అన్నది ఫైనల్ లో ట్విస్ట్ రివీల్ అవుతుంది.


ఎంచుకున్న కథను దర్శకుడు ఎమోషనల్ గా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య సీన్స్ అయితే హైలెట్ గా నిలిచాయి. సినిమాలో అర్జున్ కథగా కన్నా సినిమా చూస్తున్న ఆడియెన్ తన కథ తెర మీద చూస్తున్నట్టు ఫీల్ అవుతాడు. ఫస్ట్ హాఫ్ కాస్త ఎక్సైటింగ్ గా అనిపించగా సెకండ్ హాఫ్ మొదట్లో కొద్దిగా స్లో అనిపిస్తుంది.


ఫైనల్ గా మళ్లీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాను నిలబెట్టారు. సినిమాకు అనిరుద్ మ్యూజిక్ మేజర్ హెల్ప్ అయ్యింది. నాని కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో మరోసారి తన సత్తా చాటాడు. ఈ సమ్మర్ లో జెర్సీ మరో హిట్ సినిమా అవుతుందని చెప్పొచ్చు.



నాని, శ్రద్ధా శ్రీనాథ్, గౌతమ్ తిన్నూరి,అనిరుథ్,సత్యరాజ్జెర్సీ.. తప్పక చూడాల్సిన సినిమా..!

మరింత సమాచారం తెలుసుకోండి: