Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 4:31 pm IST

Menu &Sections

Search

రివ్యూ మహర్షి : మహర్షే

- 5/5
రివ్యూ మహర్షి : మహర్షే READ THIS MOVIE REVIEW IN ENGLISH

మంచి

 • హృదయం హృదయ స్పృశించడం
 • రక్తం మరిగిలించేలాంటి క్లయిమాక్
 • రైతులకు సరైన గౌరవం
 • మహేష్ అద్భుతమైన నటన
 • వెరియేషన్స్ తో రిషి పాత్ర
 • సెంటిమెంట్
 • ఎమోషన్స్
 • ప్లాట్లు స్క్రీన్ ప్లే
 • డీఎస్ పి బ్యాగ్ గౌండ్ మ్యూజిక్
 • కార్పోరేట్ సంస్థల వ్యవహారం
 • తల్లి-కొడుకు సెంటిమెంట్
 • హృదయాలను కదిలించే డైలాగ్స్
 • డైరెక్టర్ టేకోవర్
 • సామాజిక కోణం
 • ఈ సినిమా యూత్
 • అల్లరి నరేష్ నటన అద్భుతం. తల్లిదండ్రులు
 • రైతులు
 • వృద్దుల అందరినీ అలరించే మూవీ

చెడు

 • కాస్ట్యూమ్స్ మరియు కొరియోగ్రఫీ
 • కొన్ని చోట్ల సంగీత నేపథ్యం
 • సాగదీసిన సన్నివేశాలు
ఒక్క మాటలో: ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిందే... శ్రీమంతుడు చేయలేని పనిని మహర్షి చేసాడు ... సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ మూవీ 100 రోజుల ప్రదర్శన

చిత్ర కథ

జీవితమంటేనే గెలవడం, గెలవకపోతే.. ఓడిపోతే ప్రపంచం మనల్ని పడేసి తొక్కుకుంటూ మనమీద నుండే నడిచి వెళుతుందనే మనస్థత్వంతో సొంత తండ్రి మద్య తరగతి జీవితాన్ని ఒక ఫెయిల్యూర్ లా చూసే తెలివైయిన కుర్రాడు చదువుకునే కాలేజీలో అతనికి ఎదురయిన వ్యక్తులు, స్నేహితులు, వారి మద్య జరిగే సంఘటనలు, ప్రపంచాన్ని గెలవానుకునే ధ్యేయంతో సాధ్యమయినంత వేగంగా జీవన గమనాన్ని సాగిస్తాడు.

అతనికి కావాలనుకున్నవన్నీ దక్కించుకుని..అయిన వారిని పోగొట్టుకుని అసలు నేను కవాలన్నవన్నీ దక్కించకుని గెలిచానా..? గెలుపు అంటే ఇదేనా అనే ప్రశ్నతో తన అంతరాత్మ వెక్కిరింతతో బాహ్య ప్రపంచంలోకి వచ్చి... తనదయిన అంతర్జాతీయ ఖ్యాతిని తన వారి కోసం తృణ ప్రాయంగా వదిలివేయడానికి  దారితీసే పరిస్థితుల సమాహారమే ఈ మహర్షి, ఇలాంటి కథలో రైతులు వారి జీవన విధానం, సంఘంలో వారి గౌరవం వంటి విషయాలను జొప్పించడమే ఈ కథ ఘనత. 

11:10am: సున్నితమైన ఎమోషనల్ టచ్ తో మహేష్ అందరి హృదయాలను కదిలించారు.  సినిమా పూర్తయ్యింది.


11:08am:  దేవిశ్రీ అందించిన ఎమోషనల్ సాంగ్ సౌల్ ఆఫ్ రిషి "ఇదే కదా నీ కథ" పాట వస్తుంది.11:05am: రిషి రైతులకు సహాయం అందేలా రాష్ట్రంలో ప్రతీ ఒక్కరినీ ప్రభావితం చేస్తున్నాడు.


10:58am:మహర్షి డైలాగ్ : రైతును కాపాడడం ప్రభుత్వ భాధ్యతే కాదు... మనందరిదీ ... మనలోని ప్రతి వాళ్ళది.


10:55am:మహర్షి డైలాగ్ : ఒక ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు... మరి రైతు ఏడిస్తే దేశానికి మంచిదా ?


10:48am:కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి పాత్ర చాలా బాగుంది. రైతులు పడే కష్టాలు చూపిస్తున్నారు. ప్రస్తుతం రైతుల సమస్యలు, వారు ఎదుర్కొనే ఇబ్బందులు మీద ఇప్పుడొక ప్రెస్ మీట్ సన్నివేశం వస్తుంది.


10:45am: ప్రస్తుతం సినిమాలో రైతులు పడే కష్టాలు, బాధలు, రైతు జీవితానాకి సంబందించిన సంఘటనలు చూపిస్తున్నారు. ఇప్పుడు మహేష్ రైతుగా మారి నాగలి పట్టారు.


10:40am: మహర్షి డైలాగ్ : సాఫ్టువేర్ అన్నారు కదరా ?


10:35am: ప్రస్తుతం తల్లీ కొడుకు అనుబంధం గురించి కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు చూపిస్తున్నారు. 


10:32am: మహర్షి డైలాగ్ : ఒకసారి ఏసి రూములో కూర్చుని కుదరదన్నావ్... చెట్టు క్రింద కొచ్చావ్...


10:32am: మహర్షి డైలాగ్ : ఒకసారి ఏసి రూములో కూర్చుని కుదరదన్నావ్... చెట్టు క్రింద కొచ్చావ్... ఇప్పుడు కాదంటే ఎక్కడికి పోతావో ఆలోచించుకో వివేక్


10:28am: మహర్షి డైలాగ్ : ఈడెవడో సూటు వేసుకున్న శకునిలాగా వున్నాడే 


10:25am: మూవీ కాస్త సీరియస్ గా సాగుతుంది. జగపతి బాబు మహేష్ మరియు నరేష్ లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు.10:20am: తాజాగా సీన్లో కి రాజీవ్ కనకాల నెగిటీవ్ పాత్రతో ఎంట్రీ ఇచ్చాడు.. ఇప్పుడు ముఖ్య సన్నివేశాలు వస్తున్నాయి. 


10:18am: ‘పాలపిట్టా’ సాంగ్ వస్తుంది. జానపద నృత్యం, అదిరిపోయే మ్యూజిక్, కాస్ట్యూమ్స్ అద్బుతమైన కోరియోగ్రాఫ్.. మొత్తానికి థియేటర్లో ఆడియన్స్ సైతం ఎగిరి గంతేసేలా ఉంది. 


10:14am:  మహర్షి డైలాగ్ : అలాంటోడు మన జీవితంలో ఉండాలంటే అదృష్ఠం ఉండాలి సార్ ... మరి మీకు ఆ అదృష్ఠం ఉందా ?


10:10am: పూజా, విద్యుల్లేఖ తో మళ్ళీ కథలోకి ఎంటర్ అయ్యింది. తన కంపెనీ పని మీద నరేష్ గ్రామానికి ఆమె చేరుకుంది. ప్రస్తుతం గ్రామీణ వాతావరణం నేపథ్యంలో కొన్ని సీన్లు వస్తున్నాయి. 


10:08am: ఆంధ్రప్రదేశ్ లో కార్పోరేట్ యాజమాన్యం వ్యవస్థ గురించి చూపిస్తున్నారు.  


10:05am: రిషి, జగపతిబాబుతో ఛాలెంజ్ చేసి నరేష్ గ్రామంలోనే తన కంపెనీ బ్రాంచ్ స్థాపించాడు.  ఇప్పుడు ఫిర్ షురూ పాట మొదలయ్యింది.


10:02am: తన గ్రామంలోపైప్ లైన్ కోసం కార్పోరేట్ యజమాని పై పోరాటం మొదలు పెట్టాడు నరేష్.  ఇప్పుడు జగపతి బాబు(వివేక్ మిట్టల్) భారతదేశంలో ప్రముఖ కార్పొరేట్ కింగ్ గా పరిచయం చేయబడ్డాడు.


9:57am:మహర్షి డైలాగ్ : భారతదేశాన్ని రాజకీయ నాయకులు పాలిస్తారనుకుం టారు ... కానీ కార్పొరేట్ కంపెనీలే పాలిస్తారు.


9:55am:మహర్షి డైలాగ్ : సార్ మీరు ఇంగ్లీష్ దొర లాగా ఉంటారు... పల్లెటూళ్ళో ఎండలు ఎక్కువ జాగ్రత్త.


9:53am: ప్రస్తుతం పోసాని కృష్ణమురళి, మహేష్ బాబు ల కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి. 


9:50am: విశ్రాంతి తర్వాత  రిషి ఇండియా లో అడుగు పెట్టాడు.ఇప్పుడు గోదావరి జిల్లాలోని రామవరం అనే గ్రామానికి వెళ్తున్నాడు. అల్లరి నరేష్ చాలా అద్భుతంగా నటిస్తున్నాడు.  ప్రస్తుతం కొన్ని భావోద్వేగ  సన్నివేశాలు వస్తున్నాయి. 


......... విశ్రాంతి..............


ఫస్టాఫ్ టాక్ :  అద్భుతమైన సంభాషణలు, అహ్లాదకరమైన సన్నివేశాలు, భావోద్వేగ భాగాలు, హీరో, హీరోయిన్ల మద్య అతని కుటుంబం, ఫ్రెండ్ మద్య సన్నివేశాలు.. మొత్తానికి ఈ చిత్రం సూపర్ స్టార్ మహేష్ ... మాహెచ్ మహేష్ మహేష్ మహేష్ చిత్రం మహర్షి.

డైరెక్టర్ వంశి, మహేష్ పాత్రను అద్బుతంగా మలిచారు.. ఆ మద్య మహేష్ కెరీర్ లో మంచి డైరెక్టర్అని అందుకే చెప్పినట్లుంది...భావోద్వేగం, వ్యంగ్య, గ్రేస్, కామెడీ, రాయల్నెస్, కార్పోరటీనస్, రఫ్ లుక్, ప్రొఫెషనల్ లుక్, బోస్సీ టోన్, ఇన్నోసెంట్ డిక్షన్ ఇంత తక్కువ సమయంలో నవరసాలన్నీ చూపించాడు మహేష్ బాబు..ఇంత గొప్ప నటన నిజంగా అద్భుతం. ఇప్పటి వరకు స్క్రీన్ ప్లే బాగానే కవర్ చేశారు. 


9:20am:  రిషి తన సీఈఓ పదవిని వదిలి భారతదేశానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇప్పుడు రిషి జర్నీ మొదలయిందని చెప్పొచ్చు.

మహర్షి డైలాగ్ : ఇప్పటి వరకూ నువ్వేమనుకున్నావో అది చేశావు... ఇప్పుడు నీ మనసేం చెప్తే అది చేయ్‌... నువ్వు గెలుస్తావు రిషి


9:16am:ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు పూర్తయ్యింది.అసలు నరేష్ పాత్ర వెనుకున్న సస్పెన్స్ ఏమిటో "నువ్వని" బ్యాగ్ డ్రాప్ లో స్పెషల్ సాంగ్ వస్తుంది. 


9:06am: సినిమాలో దేవీ శ్రీ బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల అద్భుతం అనిపించినా..కొన్ని చోట్ల వీక్ అనిపిస్తుంది. సినిమాలో చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. 


8:58am: ప్రస్తుతం కొన్ని కుటుంబ నేపథ్యంలో సన్నివేశాలు వస్తున్నాయి.  మహేష్ బాబు కొత్త అవతారం ఎత్తారు..అమెరికా పయనం. 

మహర్షి డైలాగ్ : రిషి నేను హుస్సేన్ బోల్టు ను చూసేసాను ... నిన్ను చూడాలనుకుంటున్నాను ... పరిగెత్తు రిషి ... ఆగకుండా


8:55am: సినిమాలో ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూ సన్నివేశాలు వస్తున్నాయి.  మహర్షి డైలాగ్ : ఓడిపోతామన్న భయంతో ఆటమొదలెడితే ... ఆటలో ఎప్పుడూ గెలవం. చెప్పా కదా ఆఖరు పేజిలో నా ఫోన్ నెంబరు ఉంది... కాల్ చెయ్యండి.


8:50am:మహర్షి, పూజా హెడ్గే మద్య ఓ సాంగ్ ‘ ఎవరెస్ట్ అంచున’వస్తుంది.  ఈ పాటల కాస్ట్యూమ్స్, పిక్చరైజేషన్ చాలా బాగుంది..


8:48am: మహర్షి, పూజా హెడ్గే కుటుంబాన్ని కలుస్తాడు. కుటుంబ నేపథ్యంలో కొన్ని ఎమోషనల్, సెంటిమెంట్ సన్నివేశాలు చూపిస్తున్నారు..మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.


8:42am:మహేష్, ముఖేష్ రిషి  మధ్య ఒక ఫైట్ సీక్వెన్స్ వస్తుంది.మహేష్ కాలేజ్ ఎపిసోడ్స్ లో చాలా ఫిట్ గా యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు.


8:42am:హీరోయిన్ పూజా హెగ్డే ఓ ఫన్నీ సన్నివేశంతో పరిచయం అయ్యింది. ఇప్పుడు రిషి , రవిల మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.


8:39am: మహర్షి డైలాగ్ : రెండు సబ్జక్ట్స్ కే చనిపోతావా ? ఎవడి బలం వాడిదే ... నీ బలం ఏంటో తెలుసుకో దీనెమ్మ జీవితం నీ కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది


8:35am: అల్లరి నరేష్, మహర్షి మద్య ఫ్రెండ్ షిప్ చాలా బాగా తీశారు..ఇద్దరి నటన చాలా అద్బుతంగా ఉంది..ఒక అన్నదమ్ముల్లా అనిపిస్తున్నారు.  సెంటిమెంట్, ఎమెషన్స్ బాగా కనిపిస్తున్నాయి. 


8:32am: కుటుంబ సన్నివేశాలు వస్తున్నాయి.ప్రకాష్ రాజ్ మరియు జయ సుధలు రిషి తల్లి తండ్రులుగా పరిచయం అయ్యారు. అల్లరి నరేష్ తండ్రిగా తనికెళ్ల భరణి ఎంట్రీ ఇచ్చాడు. 


8:30am: రావు రమేష్ డైలాగ్: అసలేం చేద్దామనుకుంటున్నావు ?  మహర్షి డైలాగ్ :  ఏలేద్దామనుకుంటున్నాను సార్ ... ప్రపంచాన్ని ఏలేద్దామనుకుం టున్నాను.


8:28am: రిషి(మహష్) ని ఝాన్సీ ఇంటర్వ్యూ తీసుకుంటుంది.. రిషి కాలేజ్ టైమ్ ఫ్లాష్ బ్యాక్ కు సినిమా షిఫ్ట్ అయ్యింది. మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే విద్యార్థులందరికీ హాజరు కానున్న IIET కళాశాలలో రావు రమేష్ పరిచయాలు చేసుకుంటున్నారు. 


8:26am: రిషి(మహష్) ని ఝాన్సీ ఇంటర్వ్యూ తీసుకుంటుంది..అప్పడు తన గతాన్ని చెబుతున్నారు. 


8:25am: మహర్షి డైలాగ్: ఏంటో గాల్లో ఆక్సిజన్ తగ్గినట్టు మనుష్యుల్లో హ్యూమానిటీ తగ్గిపోతుంది


8:22am: అద్భుతమైన బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ తో ఓ బిలీనియర్ గా ప్రముఖ వ్యాపారవేత్తగా  మహేష్ ఎంట్రీ ఇచ్చాడు..చూడటానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. 


8:20am: హాయ్ ఏపిహెరాల్డ్.కామ్ రీడర్స్  వంశి పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డె, అల్లరి నరేష్ నటించిన ‘మహర్షి’ట్విట్స్ కి స్వాగతం...సుస్వాగతం. 

నటీనటుల ప్రతిభ

మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ గారబ్బాయి గా..చైల్డ్ ఆర్టిస్టుగా కెరీయర్ మొదలు పెట్టి కృష్ణ, మహేష్ బాబు గారి నాన్నే అనే స్థాయికి చేరుకున్నారు.  మహేష్ కెరియర్ లో హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు ఉన్ాన..నటుడిగా మహేష్ బాబుకు ప్రతి సినిమాకు 100 కు 100 మార్కులే పడ్డాయి.  మహేష్ 25వ సినిమా విజయవంతం అవడం ఎంత గొప్పో..సంఘానికి ఉపయో పడే సినిమాతో బాక్సాఫీసును జయించడం అసలయిన విజయం.


స్క్రీన్ మీద బొమ్మ పడినప్పటి నుండి తెరదించే వరకూ ఆసాంతం..ప్రతి ఫ్రేములోనూ మహేష్ దాదాపు అయితే వేరియేషన్లను ఈ సినిమాలో పండించిన విధానం అద్భుతం.


అల్లరి నరేష్..హీరోతో సమాన స్థాయి, హీరో స్థాయిని పెంచే పాత్ర, పెర్ ఫార్మెన్స్ కు చోటున్న ఈ పాత్రలో అల్లరి నరేష్ భళా అన్పించాడు.  లెజెండ్ జగపతిబాబుకు ఎలా టర్నింగ్ పాయింట్ అయ్యిందో మహర్షి అల్లరోడికి అంతకు మించి టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
జయసుధ గారిని నిండయిన తల్లి పాత్రలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తరువాత మనకందించిందీ సినిమా తల్లీ-కొడుకుల ఈ తరం అనుబందాన్ని కళ్లకు కట్టారు. 


జయసుధ తన సహజన నటన..హీరోయిన్ పూజా హెగ్డే, శ్రీనివాస్ రెడ్డి, సాయి కుమార్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, తమ తమ పాత్రల్లో ఒదిగిపోతే..రాజీవ్ కనకాల, జగపతి బాబు భళా అనిపించారు.  మొత్తంగా మహర్షి సినిమాలో నటించడం వారందరిక అదృష్టం అని చెప్పుకోవొచ్చు. 

సాంకేతికవర్గం పనితీరు

మహర్షి సినిమా కథ నివిడి (సినిమా సమయం కాదు) ఎక్కువ.  హైదరాబాద్ మద్య తరగతి నుండి - కాలేజీ-అమెరికా - గోదావరి జిల్లా లో రామవరం అనే గ్రామం ఇంత భారీగా ఉన్న కథా నిడివిలో లోకేషన్స్, ప్రతి అరగంట సినిమా నిడివికి పాత్రల ఆహార్యంలో మార్పు, డిక్షన్ లో మార్పు, కథా వస్తువు రూపాంతరం చెందుతుంటే సాంకేతిక వర్గం పని ఎంత కష్టమో గుడ్డు పెట్టే కోడికే తెలుసన్నట్లు..


విస్తృత పరిధిని కవర్ చేస్తూ..మానవ విలువలను స్పృశిస్తూ..కూడా కమర్షియల్ హీరోయిజాన్ని ఎక్కడా తక్కువ చేయకుండా నడిపించిన దర్శకుడు వంశి పైడిపల్లి ఈ సినిమాతో మహేస్ బాబు అభిమానుల గుండెల్లో కాదు..తెలుగు సినీ అభిమానుల గుండెల్లో సైతం చెరగని ముద్ర వేశారు. 


మాటలు, కథనం ఈ సినిమాకు పెట్టని కోట. కెమెరామెన్, కాస్ట్యూమ్స్, కొరియోగ్రఫర్ ఇంకొంచెం మంచిగా చేసే అవకాశం ఉంది.  ఉన్నవి ముచ్చటగా మూడే చెప్పుకోదగిన ఫైట్లయినా యాక్షన్ కొరియో గ్రఫీ బాగుంది.  మొత్తానికి సాంకేతిక వర్గం మహేష్ బాబు 25వ సినిమా స్థాయి ఖచ్చితంగా అందుకున్నారు. 

చిత్ర విశ్లేషణ

కొన్ని సినిమాలు ఉంటాయి..ఒక రోజు ఉదయం మొదలయి మరునాటి ఉదయంతో ముగిసేవి..హాంగోవర్ సినిమాలు సీరీస్ లా.. మరికొన్ని సినిమాలు ఉంటాయి తండ్రి కాలంలో మొదలయి పిల్లల తరంతో పూర్తయ్యే లవకుశలా..ఇది ఆ సినిమా కథా పరిధి.

మహర్షి సినిమా పరిధి గంభీరం, మొదట మద్య, దిగువ మద్య తరగతి కుటుంబము నుండి వచ్చిన కుర్రాడి జీవితాశయం అన్నట్లు ఉన్న కథావస్తువు గెలుపు - ఓటమి ఏది గెలుపు, ఏది నిజమయిన గెలుపు అనేటటువంటి వృత్తి మీమాంసగా మారి అంతలోనే కార్పోరేట్లు వారు వారి స్వార్థం కోసం సామాన్య ప్రజల మీద చేస్తున్న అరాచకం, రాజకీయ నాయకుల వత్తాసు అనే మూలల్లోకి వెళ్లి అంతలోనే రైతులు సంఘానికి వారి అవసరం, సంఘం వారికి ఇస్తున్న గౌరవం, రైతుల పట్ల ప్రతి వ్యక్తికి ఉన్న భాద్యతలను గుర్తెరిగేలా చెప్పే ప్రయత్నం.

రైతు సమస్యలకు ఒక సమాధానం చూపించే యత్నం..ఇది అంతా ఏది గెలుపు - ఏది నిజమయిన గెలుపు అనే కథాంశం చుట్టూ హృద్యంగా అల్లిన విధానం..అమోఘం..


అసలే ఈ మద్య కాలంలో సరయిన తెలుగు సినిమాలు విడుదల కాక మోహం వాచిపోయిన కోట్లది మంది తెలుగుు ప్రేక్షకులకు మృష్ఠాన్న భోజనం.. తాంబూలంతో పాటు పెట్టినట్లు ఉంది ఈ మహర్షి సినిమా. 


మహేష్ సినిమాలన్నింటిలోనూ ఉండే ఒక ఇబ్బంది ముగింపు (క్లైయిమాక్స్)...శ్రీమంతుడు సినిమాలో కూడా క్లైమాక్స్ ఇంకా బావుండొచ్చు అంటుంటారందరూ.. అయితే మహర్షి సినిమాలో ఆ ఇబ్బందిని విజయవంతంగా అధిగమించింది.   ఈసినిమా ముగింపు హృదయానికి హత్తుకునేట్లుగా ఉంది. 

కాస్ట్ అండ్ క్రూ

3 / 5 - 8744
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS

Bollywood

View all