11:10am: సున్నితమైన ఎమోషనల్ టచ్ తో మహేష్ అందరి హృదయాలను కదిలించారు. సినిమా పూర్తయ్యింది.
11:08am: దేవిశ్రీ అందించిన ఎమోషనల్ సాంగ్ సౌల్ ఆఫ్ రిషి "ఇదే కదా నీ కథ" పాట వస్తుంది.
11:05am: రిషి రైతులకు సహాయం అందేలా రాష్ట్రంలో ప్రతీ ఒక్కరినీ ప్రభావితం చేస్తున్నాడు.
10:58am:మహర్షి డైలాగ్ : రైతును కాపాడడం ప్రభుత్వ భాధ్యతే కాదు... మనందరిదీ ... మనలోని ప్రతి వాళ్ళది.
10:55am:మహర్షి డైలాగ్ : ఒక ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు... మరి రైతు ఏడిస్తే దేశానికి మంచిదా ?
10:48am:కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి పాత్ర చాలా బాగుంది. రైతులు పడే కష్టాలు చూపిస్తున్నారు. ప్రస్తుతం రైతుల సమస్యలు, వారు ఎదుర్కొనే ఇబ్బందులు మీద ఇప్పుడొక ప్రెస్ మీట్ సన్నివేశం వస్తుంది.
10:45am: ప్రస్తుతం సినిమాలో రైతులు పడే కష్టాలు, బాధలు, రైతు జీవితానాకి సంబందించిన సంఘటనలు చూపిస్తున్నారు. ఇప్పుడు మహేష్ రైతుగా మారి నాగలి పట్టారు.
10:40am: మహర్షి డైలాగ్ : సాఫ్టువేర్ అన్నారు కదరా ?
10:35am: ప్రస్తుతం తల్లీ కొడుకు అనుబంధం గురించి కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు చూపిస్తున్నారు.
10:32am: మహర్షి డైలాగ్ : ఒకసారి ఏసి రూములో కూర్చుని కుదరదన్నావ్... చెట్టు క్రింద కొచ్చావ్...
10:32am: మహర్షి డైలాగ్ : ఒకసారి ఏసి రూములో కూర్చుని కుదరదన్నావ్... చెట్టు క్రింద కొచ్చావ్... ఇప్పుడు కాదంటే ఎక్కడికి పోతావో ఆలోచించుకో వివేక్
10:28am: మహర్షి డైలాగ్ : ఈడెవడో సూటు వేసుకున్న శకునిలాగా వున్నాడే
10:25am: మూవీ కాస్త సీరియస్ గా సాగుతుంది. జగపతి బాబు మహేష్ మరియు నరేష్ లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
10:20am: తాజాగా సీన్లో కి రాజీవ్ కనకాల నెగిటీవ్ పాత్రతో ఎంట్రీ ఇచ్చాడు.. ఇప్పుడు ముఖ్య సన్నివేశాలు వస్తున్నాయి.
10:18am: ‘పాలపిట్టా’ సాంగ్ వస్తుంది. జానపద నృత్యం, అదిరిపోయే మ్యూజిక్, కాస్ట్యూమ్స్ అద్బుతమైన కోరియోగ్రాఫ్.. మొత్తానికి థియేటర్లో ఆడియన్స్ సైతం ఎగిరి గంతేసేలా ఉంది.
10:14am: మహర్షి డైలాగ్ : అలాంటోడు మన జీవితంలో ఉండాలంటే అదృష్ఠం ఉండాలి సార్ ... మరి మీకు ఆ అదృష్ఠం ఉందా ?
10:10am: పూజా, విద్యుల్లేఖ తో మళ్ళీ కథలోకి ఎంటర్ అయ్యింది. తన కంపెనీ పని మీద నరేష్ గ్రామానికి ఆమె చేరుకుంది. ప్రస్తుతం గ్రామీణ వాతావరణం నేపథ్యంలో కొన్ని సీన్లు వస్తున్నాయి.
10:08am: ఆంధ్రప్రదేశ్ లో కార్పోరేట్ యాజమాన్యం వ్యవస్థ గురించి చూపిస్తున్నారు.
10:05am: రిషి, జగపతిబాబుతో ఛాలెంజ్ చేసి నరేష్ గ్రామంలోనే తన కంపెనీ బ్రాంచ్ స్థాపించాడు. ఇప్పుడు ఫిర్ షురూ పాట మొదలయ్యింది.
10:02am: తన గ్రామంలోపైప్ లైన్ కోసం కార్పోరేట్ యజమాని పై పోరాటం మొదలు పెట్టాడు నరేష్. ఇప్పుడు జగపతి బాబు(వివేక్ మిట్టల్) భారతదేశంలో ప్రముఖ కార్పొరేట్ కింగ్ గా పరిచయం చేయబడ్డాడు.
9:57am:మహర్షి డైలాగ్ : భారతదేశాన్ని రాజకీయ నాయకులు పాలిస్తారనుకుం టారు ... కానీ కార్పొరేట్ కంపెనీలే పాలిస్తారు.
9:55am:మహర్షి డైలాగ్ : సార్ మీరు ఇంగ్లీష్ దొర లాగా ఉంటారు... పల్లెటూళ్ళో ఎండలు ఎక్కువ జాగ్రత్త.
9:53am: ప్రస్తుతం పోసాని కృష్ణమురళి, మహేష్ బాబు ల కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
9:50am: విశ్రాంతి తర్వాత రిషి ఇండియా లో అడుగు పెట్టాడు.ఇప్పుడు గోదావరి జిల్లాలోని రామవరం అనే గ్రామానికి వెళ్తున్నాడు. అల్లరి నరేష్ చాలా అద్భుతంగా నటిస్తున్నాడు. ప్రస్తుతం కొన్ని భావోద్వేగ సన్నివేశాలు వస్తున్నాయి.
......... విశ్రాంతి..............
ఫస్టాఫ్ టాక్ : అద్భుతమైన సంభాషణలు, అహ్లాదకరమైన సన్నివేశాలు, భావోద్వేగ భాగాలు, హీరో, హీరోయిన్ల మద్య అతని కుటుంబం, ఫ్రెండ్ మద్య సన్నివేశాలు.. మొత్తానికి ఈ చిత్రం సూపర్ స్టార్ మహేష్ ... మాహెచ్ మహేష్ మహేష్ మహేష్ చిత్రం మహర్షి.
డైరెక్టర్ వంశి, మహేష్ పాత్రను అద్బుతంగా మలిచారు.. ఆ మద్య మహేష్ కెరీర్ లో మంచి డైరెక్టర్అని అందుకే చెప్పినట్లుంది...భావోద్వేగం, వ్యంగ్య, గ్రేస్, కామెడీ, రాయల్నెస్, కార్పోరటీనస్, రఫ్ లుక్, ప్రొఫెషనల్ లుక్, బోస్సీ టోన్, ఇన్నోసెంట్ డిక్షన్ ఇంత తక్కువ సమయంలో నవరసాలన్నీ చూపించాడు మహేష్ బాబు..ఇంత గొప్ప నటన నిజంగా అద్భుతం. ఇప్పటి వరకు స్క్రీన్ ప్లే బాగానే కవర్ చేశారు.
9:20am: రిషి తన సీఈఓ పదవిని వదిలి భారతదేశానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇప్పుడు రిషి జర్నీ మొదలయిందని చెప్పొచ్చు.
మహర్షి డైలాగ్ : ఇప్పటి వరకూ నువ్వేమనుకున్నావో అది చేశావు... ఇప్పుడు నీ మనసేం చెప్తే అది చేయ్... నువ్వు గెలుస్తావు రిషి
9:16am:ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు పూర్తయ్యింది.అసలు నరేష్ పాత్ర వెనుకున్న సస్పెన్స్ ఏమిటో "నువ్వని" బ్యాగ్ డ్రాప్ లో స్పెషల్ సాంగ్ వస్తుంది.
9:06am: సినిమాలో దేవీ శ్రీ బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల అద్భుతం అనిపించినా..కొన్ని చోట్ల వీక్ అనిపిస్తుంది. సినిమాలో చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది.
8:58am: ప్రస్తుతం కొన్ని కుటుంబ నేపథ్యంలో సన్నివేశాలు వస్తున్నాయి. మహేష్ బాబు కొత్త అవతారం ఎత్తారు..అమెరికా పయనం.
మహర్షి డైలాగ్ : రిషి నేను హుస్సేన్ బోల్టు ను చూసేసాను ... నిన్ను చూడాలనుకుంటున్నాను ... పరిగెత్తు రిషి ... ఆగకుండా
8:55am: సినిమాలో ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూ సన్నివేశాలు వస్తున్నాయి. మహర్షి డైలాగ్ : ఓడిపోతామన్న భయంతో ఆటమొదలెడితే ... ఆటలో ఎప్పుడూ గెలవం. చెప్పా కదా ఆఖరు పేజిలో నా ఫోన్ నెంబరు ఉంది... కాల్ చెయ్యండి.
8:50am:మహర్షి, పూజా హెడ్గే మద్య ఓ సాంగ్ ‘ ఎవరెస్ట్ అంచున’వస్తుంది. ఈ పాటల కాస్ట్యూమ్స్, పిక్చరైజేషన్ చాలా బాగుంది..
8:48am: మహర్షి, పూజా హెడ్గే కుటుంబాన్ని కలుస్తాడు. కుటుంబ నేపథ్యంలో కొన్ని ఎమోషనల్, సెంటిమెంట్ సన్నివేశాలు చూపిస్తున్నారు..మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.
8:42am:మహేష్, ముఖేష్ రిషి మధ్య ఒక ఫైట్ సీక్వెన్స్ వస్తుంది.మహేష్ కాలేజ్ ఎపిసోడ్స్ లో చాలా ఫిట్ గా యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు.
8:42am:హీరోయిన్ పూజా హెగ్డే ఓ ఫన్నీ సన్నివేశంతో పరిచయం అయ్యింది. ఇప్పుడు రిషి , రవిల మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
8:39am: మహర్షి డైలాగ్ : రెండు సబ్జక్ట్స్ కే చనిపోతావా ? ఎవడి బలం వాడిదే ... నీ బలం ఏంటో తెలుసుకో దీనెమ్మ జీవితం నీ కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది
8:35am: అల్లరి నరేష్, మహర్షి మద్య ఫ్రెండ్ షిప్ చాలా బాగా తీశారు..ఇద్దరి నటన చాలా అద్బుతంగా ఉంది..ఒక అన్నదమ్ముల్లా అనిపిస్తున్నారు. సెంటిమెంట్, ఎమెషన్స్ బాగా కనిపిస్తున్నాయి.
8:32am: కుటుంబ సన్నివేశాలు వస్తున్నాయి.ప్రకాష్ రాజ్ మరియు జయ సుధలు రిషి తల్లి తండ్రులుగా పరిచయం అయ్యారు. అల్లరి నరేష్ తండ్రిగా తనికెళ్ల భరణి ఎంట్రీ ఇచ్చాడు.
8:30am: రావు రమేష్ డైలాగ్: అసలేం చేద్దామనుకుంటున్నావు ? మహర్షి డైలాగ్ : ఏలేద్దామనుకుంటున్నాను సార్ ... ప్రపంచాన్ని ఏలేద్దామనుకుం టున్నాను.
8:28am: రిషి(మహష్) ని ఝాన్సీ ఇంటర్వ్యూ తీసుకుంటుంది.. రిషి కాలేజ్ టైమ్ ఫ్లాష్ బ్యాక్ కు సినిమా షిఫ్ట్ అయ్యింది. మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే విద్యార్థులందరికీ హాజరు కానున్న IIET కళాశాలలో రావు రమేష్ పరిచయాలు చేసుకుంటున్నారు.
8:26am: రిషి(మహష్) ని ఝాన్సీ ఇంటర్వ్యూ తీసుకుంటుంది..అప్పడు తన గతాన్ని చెబుతున్నారు.
8:25am: మహర్షి డైలాగ్: ఏంటో గాల్లో ఆక్సిజన్ తగ్గినట్టు మనుష్యుల్లో హ్యూమానిటీ తగ్గిపోతుంది
8:22am: అద్భుతమైన బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ తో ఓ బిలీనియర్ గా ప్రముఖ వ్యాపారవేత్తగా మహేష్ ఎంట్రీ ఇచ్చాడు..చూడటానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
8:20am: హాయ్ ఏపిహెరాల్డ్.కామ్ రీడర్స్ వంశి పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డె, అల్లరి నరేష్ నటించిన ‘మహర్షి’ట్విట్స్ కి స్వాగతం...సుస్వాగతం.