Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 10:11 pm IST

Menu &Sections

Search

'ఎబిసిడి' మూవీ రివ్యూ, రేటింగ్

- 2.25/5
'ఎబిసిడి' మూవీ రివ్యూ, రేటింగ్ READ THIS MOVIE REVIEW IN ENGLISH

మంచి

  • లీడ్ కాస్ట్
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్

చెడు

  • స్క్రీన్ ప్లే
  • సాంగ్స్
  • కొన్ని సీన్స్ లో అల్లు శిరీష్
ఒక్క మాటలో: ఏబిసిడి.. ఆశించిన స్థాయిలో లేదు..!

చిత్ర కథ

ఎన్.ఆర్.ఐ విద్యా ప్రసాద్ (నాగబాబు) మిలీనియర్.. అతని తనయుడు అరవింద్ ప్రసాద్ (అల్లు శిరీష్) అలియాస్ అవికి డబ్బు విలువ తెలిసి రావడం లేదని భావిస్తాడు. అందుకే అతన్ని ఇండియాకు పంపిస్తాడు. అవితో పాటుగా భాషా (భరత్) కూడా ఇండియాకు వస్తారు. హైదరాబాద్ లో వాళ్లు అడుగుపెట్టగానే వారి కార్డ్స్ అన్నిటిని బ్లాక్ చేయించడమే కాకుండా వారు ఫోన్ చేసి డబ్బులు అడిగినా వేయొద్దని అవి స్నేహితులకు చెబుతాడు. ఈ క్రమంలో అతనికి హీరోయిన్ పరిచయమవడం. అవి ఎంబిఏ కాలేజ్ లో జాయిన్ అవడం అక్కడ మినిస్టర్ కొడుకుతో గొడవ పడటం వంటివి జరుగుతాయి. అవికి తండ్రి ఏదైతే కష్టం విలువ.. డబ్బు విలువ తెలియాలని అనుకున్నాడో ఫైనల్ గా అదెలా తెలుసుకున్నాడన్నది సినిమా కథ.     




నటీనటుల ప్రతిభ

సినిమాలో అవి పాత్రలో అల్లు శిరీష్ చాలా ఈజ్ తో చేశాడు. అల్లు శిరీష్ తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. భరత్ కూడా కామెడీ పండించాడు. ఇక రుక్సర్ థ్రిల్లన్ ఇంప్రెస్ చేసినా ఆమెకు పెద్ద స్కోప్ ఉన్న పాత్ర చేయలేదు. సిరివెన్నెల రాజా విలన్ గా పెద్దగా మెప్పించలేదు. నాగబాబు పాత్ర అలరిస్తుంది. సుభలేక సుధాకర్ కూడా బాగానే చేశారు. వెన్నెల కిశోర్ కామెడీ పర్వాలేదు అనిపించింది. 



సాంకేతికవర్గం పనితీరు

రాం సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే బడ్జెట్ పరిమితులను బట్టి తక్కువ లొకేషన్స్ లో సినిమా కానిచ్చేశారని తెలుస్తుంది. జుదా శాండి మ్యూజిక్ రెండు సాంగ్స్ బ్గున్నాయి. బిజిఎం జస్ట్ ఓకే అనిపిస్తుంది. డైరక్టర్ సంజీవ్ రెడ్డి సూపర్ హిట్ రీమేక్ సినిమా అయినా పెద్దగా మెప్పించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ సోసోగానే ఉన్నాయి.



చిత్ర విశ్లేషణ

శ్రీరస్తు శుభమస్తు సినిమా తర్వాత ఒక్క క్షణం సినిమాతో అంచనాలను అందుకోని అల్లు శిరీష్ ఏబిసిడి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మళయాళంలో కూడా అదే టైటిల్ తో హిట్ అందుకున్న ఈ సినిమా తెలుగులో రీమేక్ అయ్యింది. సంజీవ్ రెడ్డి సినిమా ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగించినా సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పేశాడు.


ముఖ్యంగా సిరివెన్నెల రాజాని విలన్ గా తీసుకోవడం మైనస్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు అన్ని సినిమాల్లో క్లాస్ రోల్స్ లో అలరించిన అతను ఈ విలన్ రోల్ కు సూట అవలేదు. కథ రొటీన్ గా అనిపించినా కథనం ఏదైనా కొత్తగా ఉంటుంది అనుకుంటే అదికూడా రొటీన్ గా సాగించాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ఫస్ట్ హాఫ్ వరకు హ్యూమర్ టచ్ ఇచ్చినా సెకండ్ హాఫ్ మాత్రం నిరాశపరచింది.


సినిమాలో అల్లు శిరీష్ ఎనర్జీ బాగానే ఉంది. అయితే క్యారక్టర్ కు తగినట్టుగా ఇంకాస్త బాగా చెయ్యొచ్చు. సగటు సిని ప్రేక్షకుడు సినిమా మెచ్చే అవకాశం ఉంది. వెరైటీ కథలు.. డిఫరెంట్ జానర్ ఆశించే వారికి ఏబిసిడి అసలు నచ్చే ఛాన్స్ లేదు.



కాస్ట్ అండ్ క్రూ

3 / 5 - 5478
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS

Bollywood

View all