అనికారావు న‌ట‌న‌, కామెడీ, డైరెక్ష‌న్అనికారావు న‌ట‌న‌, కామెడీ, డైరెక్ష‌న్స్లో నెరేష‌న్; ఎడిటింగ్
స్వ‌యంవ‌ద‌గా టైటిల్ పాత్ర‌లో అనికా రావు న‌టించింది. ఆమెను తండ్రి విక్రమ్ రెడ్డి (లోహిత్ కుమార్) అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. తనకు ఏమాత్రం కోపం తెప్పించినా, వెకిలి వేషాలు వేసినా సహించదు స్వయంవద. వాళ్లకు అప్పటికప్పుడు బుద్ధి చెబుతుంటుంది. స్వయంవద తండ్రి విక్రమ్ రెడ్డి దగ్గర బినామీగా పనిచేస్తుంటాడు జెల్లా వెంకట్రాముడు (పోసాని కృష్ణ మురళి). ఇతని కొడుకు సుబ్బు (సుబ్బారావు ) (ఆదిత్య అల్లూరి) సినిమా హీరో అవుదామని ప్రయత్నిస్తుంటాడు. ఇది ఇంట్లో వాళ్లకు నచ్చదు. ఈ క్రమంలో స్వయంవద సుబ్బును చూసి ఇష్టపడుతుంది. తండ్రికి చెబితే వెంకట్రాముడుతో మాట్లాడి సంబంధం కుదర్చుకుంటాడు. అందరికీ పెళ్లి ఇష్టమైనా స్వయంవద అహం సుబ్బుకు నచ్చదు. దాంతో పెళ్లి వద్దని చెబుతాడు. తనకు ఏమాత్రం నచ్చని చిన్న విషయాలకే మండిపడే స్వయంవద.. తనను పెళ్లికి నిరాకరిస్తే ఎలా స్పందించింది. సెకండాఫ్‌లో వచ్చే ప్రియంవద ఎవరు ఆమెకు, స్వయంవద కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటనేదే మిగిలిన స్టోరీ.


స్వయంవద పాత్రలో అహంభావిగా అనికారావు నాచుర‌ల్‌గా నటించింది. భయానక సన్నివేశాల్లో ఆమె చూపించిన హావభావాలు ఆకట్టుకున్నాయి. ప్రియంవద పాత్రలో పూర్తి భిన్నమైన స్వభావంతో నటించి మెప్పించింది. ఆదిత్య అల్లూరి తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించాడు. ప్రతికూల ఆలోచనలు గల తండ్రిగా లోహిత్ కుమార్ ఆకట్టుకుంటే.. కొడుకు కోసం తపించే తండ్రిగా పోసాని నటన రక్తి కట్టించింది. ఆద్యంతం సాగే మూడు పాత్రల్లో ధన్ రాజ్ తన పూర్తిస్థాయి నటన చూపించాడు.  


వేణు ముర‌ళీధ‌ర్.వి కెమెరా పనితనం సినిమాకు హుందాతనం తీసుకురాగా.. ర‌మ‌ణ‌. జీవి పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సెల్వ కుమార్ ఎడిటింగ్ సూప‌ర్ అనిపిస్తుంది.

ఈ సినిమాలో నెగిటివ్ థింకింగ్ జీవితాన్ని ఎంతలా దిగ‌జారుస్తుందో చూపించే ప్ర‌య‌త్నం చేశాడు డైరెక్ట‌ర్ వివేక్ వర్మ. తనకు ఫ‌స్ట్ మూవీ అయినా ఆస‌క్తిరంగా తెరకెక్కించాడు. ఈ సినిమా ఫ‌స్ట్ సీన్ మాత్రం ఇర‌గ‌దీశాడు. సినిమా చూసిన వాళ్లు ఫస్ట్ సీన్ మర్చిపోలేరు. హారర్ సస్పెన్స్ అంశాలను వినోదం ఎక్కడా తగ్గకుండా రూపకల్పన చేశారు. ఒక వైపు నవ్విస్తూనే ఆలోచింపజేసేలా ఓ మెసెజ్‌ను మిక్స్ చేశారు. అక్క‌డ‌క్క‌డ క‌త్తిరించేయాల్సిన సీన్‌లు ఉన్నాయి. సినిమాకు ఎడిటింగ్ మైన‌స్‌గా చెప్పుకోవ‌చ్చు. 
ఈ సినిమాకు ఒకానొక చారిత్రక నేపథ్యాన్ని ఇప్పటి వర్తమానానికి ముడివేస్తూ కథను అల్లుకున్నాడు డైరెక్ట‌ర్. నెగిటివ్ థింకింక్ ఎంత ప్రమాదకరమో సినిమా ద్వారా చెప్పాడు డైరెక్ట‌ర్ వివేక్ వర్మ. రొటీన్‌కు భిన్నంగా హ‌ర‌ర్ మూవీని తెర‌కెక్కించి ఆక‌ట్టుకున్నాడు డైరెక్ట‌ర్ వివేక్ వర్మ. చారిత్రక నేపథ్యంతో సాగడం, నెగిటివ్ థింకింగ్ వద్దని చెబుతూ మెసెజ్, ఎంట‌ర్‌టైన్మెంట్‌ను క‌ల‌గ‌లిపిన మూవీ సరికొత్తగా అలరిస్తుంది. 



అనికా రావు; ఆదిత్య అల్లూరి; అర్చ‌నా కౌడ్లీ; పోసాని కృష్ణ ముర‌ళి; ధ‌న్ రాజ్; సారికా రామ‌చంద్ర‌రావు; రాంజ‌గ‌న్; లోహిత్ కుమార్;అన్ని అంశాల మిక్స‌ర్ పొట్లం

మరింత సమాచారం తెలుసుకోండి: