Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 1:26 pm IST

Menu &Sections

Search

'సీత' మూవీ రివ్యూ, రేటింగ్

- 2/5
'సీత' మూవీ రివ్యూ, రేటింగ్ READ THIS MOVIE REVIEW IN ENGLISH

మంచి

  • కాజల్
  • సినిమాటోగ్రఫీ. ప్రొడక్షన్ వాల్యూస్

చెడు

  • స్క్రీన్ ప్లే
  • బెల్లంకొండ శ్రీనివాస్
  • మ్యూజిక్
ఒక్క మాటలో: 'సీత'తో మళ్లీ నిరాశపరచిన బెల్లంకొండ..!

చిత్ర కథ

మనీ మైండెడ్ బిజినెస్ ఉమెన్ అయిన సీత (కాజల్ అగర్వాల్) ఓ పని కోసం ఎమ్మెల్యే బసవ (సోనూ సూద్) తో డీల్ కుదుర్చుకుంటుంది. అయితే దాని కోసం రఘురాం (బెల్లంకొండ శ్రీనివాస్) హెల్ప్ అవసరం పడుతుంది. బసవ కూడా కాజల్ కు ఇబ్బందిగా మారుతాడు.. అందుకే రఘురాం హెల్ప్ తీసుకుంటుంది సీత. సీతతో రఘురాం కు ఉన్న రిలేషన్ ఏంటి..? బసవ నుండి సీతను రఘురాం ఎలా కాపాడాడు..? రఘురాం, సీత ఎలా కలిశారు అన్నది సినిమా కథ.  నటీనటుల ప్రతిభ

సినిమాలో హీరో పాత్ర కన్నా టైటిల్ రోల్ పోశించిన సీత పాత్రకే ప్రాధాన్యత ఎక్కువ ఉంది. సీత పాత్రలో కాజల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మనీ మైండెడ్ గా డేరింగ్ గాళ్ గా కాజల్ ఇదవరకు చూడని విధంగా పర్ఫార్మ్ చేసింది. ఇక రఘురాం పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోసోగా అనిపించాడు. అల్లుడు శీను సినిమా నుండి కవచం వరకు అతను ఇలాంటి పాత్ర చేయలేదు. హీరోకి ఇది కొత్త రోల్ అని చెప్పొచ్చు. మన్నారా చోప్రా ఉన్నంతలో బాగానే చేసింది. బిత్తిరి సత్తి కామెడీ అలరించింది. సోనూ సూద్ విలనిజం ఓకే అనిపిస్తుంది.  సాంకేతికవర్గం పనితీరు

శిర్షా రే సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది.. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కూడా సినిమాకు తగినట్టుగానే ఉంది. అయితే నోటెడ్ సాంగ్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడు. సినిమా బిజిఎం పర్వాలేదు అనిపిస్తుంది. కథ కొత్తగా చెప్పడానికి ట్రై చేసిన తేజ స్క్రీన్ ప్లే రొటీన్ గా సాగించారు. అనీల్ సుంకర నిర్మాణ విలువలు బాగున్నాయి. చిత్ర విశ్లేషణ

జీవితంలో డబ్బే ప్రధానం అనుకునే ఓ అమ్మాయి.. అనుకోకుండా కష్టాల్లో పడితే ఆ సీతకు రాముడు ఎలా తోడున్నాడు అన్నది సీత కథ. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎమోషన్, కామెడీ మిక్స్ చేసి సరదాగా నడిపించిన తేజ సెకండ్ హాఫ్ మాత్రం ట్రాక్ తప్పేశాడని చెప్పొచ్చు. సినిమా స్క్రీన్ ప్లే రొటీన్ గా సాగింది.


ఏమాత్రం ఆకట్టుకునే కథనం రచించలేదు తేజ. పాత్రలను బాగా రాసుకున్నా పాత్ర స్వభావాలు మాత్రం మళ్లీ రొటీన్ పంథాలోనే చిత్రీకరించాడు. ఈకాలం అమ్మాయిల ప్రవర్తనను సీత లో కాజల్ పాత్ర ద్వారా చెప్పాలనుకున్న తేజ కొద్దిమేరకు సక్సెస్ అయినా ఓవరాల్ గా సినిమా ఆడియెన్స్ ను నిరాశపరచిందని చెప్పొచ్చు.   


కమర్షియల్ సినిమాలనే కొత్తగా చెప్పడానికి ట్రై చేసే తేజ సీత విషయంలో రొటీన్ స్క్రీన్ ప్లేతో వచ్చాడు. సగటు సిని ప్రేక్షకుడు ఎంగేజ్ అయ్యే అవకాశం ఉన్నా వెరైటీ సినిమాలు కోరుకునే ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా నచ్చదు. యూత్ ఆడియెన్స్ ను మెప్పించే అంశాలు కూడా పెద్దగా ఏమి లేవని చెప్పొచు. ఫైనల్ గా తేజ సీత ఆశించిన స్థాయిలో లేదు.కాస్ట్ అండ్ క్రూ

3 / 5 - 5478
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS

Tollywood

View all
'మల్లేశం' మూవీ రివ్యూ, రేటింగ్

'మల్లేశం' మూవీ రివ్యూ, రేటింగ్

ఏక్ సినిమా రివ్యూ

ఏక్ సినిమా రివ్యూ

విడుద‌ల తేదీః 14.06.2019 నటీనటులు : బిష్ణు అధికారి , అపర్ణ శర్మ , హిమాన్షి ఖురానా సంగీతం : మంత్ర ఆనంద్ నిర్మాత : హరి దర్శకత్వం : సంపత్ రుద్రారపు రేటింగ్ : 3/5 స‌మాజంలో జ‌రిగే ఎన్నోఅన్యాయాల‌ను అరిక‌ట్టాల‌నే నేప‌ధ్యంలో సాగే క‌థ ఇది. ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌, కుల‌మ‌తాల గొడ‌వ‌లు ఇలా ఎన్నో అన్యాయాల‌ను చూసి త‌ట్టుకోలేని ఓ అమ్మాయి ల‌వ‌ర్ హీరో (బిష్ణు) పాత్ర ఉంటుంది. టెర్రరిజం నేపథ్యంలో సందేశాత్మకంగా తెరకెక్కించిన చిత్రం '' ఏక్ ''. బిష్ణు హీరోగా అపర్ణ శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సుమన్ కీలక పాత్ర పోషించారు. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? చూద్దామా ! స్టోరీ : బ్రిలియంట్ స్టూడెంట్ అయిన సిద్దూ అపర్ణ శర్మ ని ప్రేమిస్తాడు . అపర్ణ శర్మ కూడా సిద్దూ ని అమితంగా ఇష్టపడుతుంది . అయితే ఉగ్రవాదుల దాడిలో అపర్ణ శర్మ చనిపోతుంది . త‌ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అప‌ర్ణ చ‌నిపోవ‌డంతో సంఘ వ్యతిరేకులైన ఉగ్రవాదులను అంతం చేయాలనుకుంటాడు సిద్దూ. ఉగ్రవాదులను అంతం చేయడానికి సిద్దూ ఎంచుకున్న మార్గం ఏంటి ? అందులో సక్సెస్ అయ్యాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . అందులో ఒక‌రిని త‌నే త‌న చేతుల‌తో ఘోరంగా చంపితే మ‌రొక‌రిని తెలివిగా ప్లాన్ చేసి విల‌న్‌ను చంపిస్తాడు. చివ‌ర‌గా త‌ను ప్రియురాలు బాంబ్‌బ్లాస్ట్‌లో చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన మ‌సూద్ (పృధ్వి) క్యారెక్ట‌ర్‌ను త‌న‌తో పాటే బాంబ్ పెట్టి చంపేస్తాడు. త‌న ప్రియురాలు లేని జీవితం త‌న‌కు ఎందుకు త‌న లైఫ్ త‌న‌తోనే అంతం అన్న పాత్ర‌ను ద‌ర్శ‌కుడు చాలా బాగా తెర‌కెక్కించారు. హైలెట్స్ : కథాంశం హీరో నటన పెర్ఫార్మెన్స్ : ఉగ్రవాదులను , అరాచక వాదులను అంతం చేయాలనే సిద్దు పాత్రలో అద్భుతంగా రాణించాడు బిష్ణు అధికారి . నటనలోనే కాదు మంచి ఫిజిక్ తో కూడా ఆకట్టుకున్నాడు బిష్ణు . అపర్ణ శర్మ గ్లామర్ తో అలరించింది , అలాగే హిమాన్షి ఖురానా గ్లామర్ కే పరిమితం అయ్యింది . కీలక పాత్రలో సుమన్ నటించాడు . ఇక సుమన్ గురించి కొత్తగా చెప్పేదేముంది . అలాగే బెనర్జీ , శ్రవణ్ , 30 ఇయర్స్ పృథ్వీ తదితరులు తమ తమ పాత్రల్లో రాణించారు . టెక్నికల్ టీమ్ : మంత్ర ఆనంద్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది , అలాగే విజువల్స్ కూడా బాగున్నాయి . ఖర్చుకు వెనుకాడకుండా మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించి తన నిర్మాణ దక్షతని నిరూపించుకున్నారు హరి . ఇక దర్శకుడు సంపత్ విషయానికి వస్తే బర్నింగ్ పాయింట్ ని కథా వస్తువుగా ఎంచుకొని మంచి ప్రయత్నమే చేసాడు . నటీనటుల నుండి చక్కని నటన ని రాబట్టుకున్న దర్శకుడు యువతని ఆలోచింప జేసే విధంగా ఏక్ చిత్రాన్ని మలిచాడు . ఫైనల్ గా : ఏక్ యాక్ష‌న్ డ్రామా ఎంట‌ర్‌టైన‌ర్‌

Bollywood

View all